3
September, 2026

A News 365Times Venture

3
Thursday
September, 2026

A News 365Times Venture

Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!

Date:

ఓ భర్త టెక్నాలజీని ఉపయోగించి భార్య అక్రమ సంబంధాన్ని పట్టుకున్నాడు. మూడో కంటికి తెలియకుండా చాలా చాకచక్యంగా వీడియో రికార్డ్ చేశాడు. కానీ చివరికి అదే అతడికి శాపంగా మారుతుందని ఊహించలేకపోయాడు. ఇంతకీ భార్య అక్రమ సంబంధాన్ని ఎలా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది. తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

తైవాన్‌లో చోటుచేసుకున్న ఓ విడాకుల కేసు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని రుజువు చేసేందుకు ఓ భర్త తన ఇంట్లోని రోబో వాక్యూమ్ కెమెరా రికార్డింగ్స్‌ను ఆధారంగా ఉపయోగించాడు. ఆ వీడియోల ఆధారంగా భార్య, ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తిపై న్యాయపరమైన చర్యలు తీసుకున్నాడు. ఈ కేసులో కోర్టు భర్తకు మానసిక వేదనకు పరిహారంగా 5 లక్షల తైవాన్ డాలర్లు చెల్లించాలని ఆదేశించింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.17 లక్షలకు సమానం.

అయితే ఈ కేసులో భర్తకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. తన అనుమతి లేకుండా ప్రైవేట్ ప్రదేశంలో వీడియో రికార్డు చేశాడంటూ భార్య అతడిపై మరో కేసు వేసింది. ఈ కేసును విచారించిన కోర్టు.. ఆమె వాదనతో ఏకీభవించింది. అనుమతి లేకుండా భార్యను చిత్రీకరించడం గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని పేర్కొంటూ భర్తకు ఐదు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే 1.5 లక్షల తైవాన్ డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

రోబో వాక్యూమ్‌తో..

భర్త తన రోబో వాక్యూమ్‌కు సంబంధించిన మొబైల్ యాప్ ద్వారా ఇంట్లో ఉన్న భార్యను రిమోట్‌గా సంప్రదించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో వాక్యూమ్‌లోని కెమెరా ద్వారా లైవ్ ఫుటేజీ అతడికి కనిపించింది. అందులో భార్య దుస్తులు మార్చుకోవడం, ఒక వ్యక్తితో బెడ్‌పైకి వెళ్లడం, ఇంట్లో కలిసి తిరుగుతున్న దృశ్యాలు కనిపించినట్లు సమాచారం. దీంతో భర్త ఆ దృశ్యాలను రికార్డు చేసి భద్రపరిచాడు. అనంతరం విడాకుల కేసులో భార్య వివాహేతర సంబంధానికి ఆధారంగా ఆ వీడియోలను కోర్టులో సమర్పించాడు. ఆ ఆధారాలతో అతడి వాదనకు బలం చేకూరడంతో మానసిక వేదనకు పరిహారం పొందాడు.

అయితే అదే వీడియో రికార్డింగ్ అతడికి శాపంగా మారింది. తన అనుమతి లేకుండా ప్రైవేట్ సందర్భాలను చిత్రీకరించాడంటూ భార్య ఫిర్యాదు చేయడంతో కోర్టు మరో కోణంలో కేసును పరిశీలించింది. చివరకు రోబో వాక్యూమ్ కెమెరాను ఉపయోగించిన విధానం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించిందని నిర్ధారించి జైలు శిక్ష విధించింది.

స్మార్ట్ పరికరాలతో గోప్యతకు ముప్పు?

ఈ ఘటనతో ఇంట్లో ఉపయోగించే స్మార్ట్ పరికరాల భద్రత, గోప్యతపై మరోసారి చర్చ మొదలైంది. ఆధునిక రోబో వాక్యూమ్ క్లీనర్లు కేవలం నేలను శుభ్రం చేయడానికే పరిమితం కావు. వాటిలో కెమెరాలు, వివిధ రకాల సెన్సర్లు ఉండటంతో ఇళ్లలోని గదులను మ్యాప్ చేయడం, వస్తువులను గుర్తించడం, స్వయంచాలకంగా మార్గాన్ని నిర్ణయించుకోవడం వంటి పనులు చేస్తాయి. పరికరం, దాని సాఫ్ట్‌వేర్‌ను బట్టి సేకరించే సమాచారం ఇంటి నిర్మాణం, గదుల అమరిక, ఇంట్లో జరుగుతున్న కార్యకలాపాలకు సంబంధించిన వివరాలను కూడా కలిగి ఉండే అవకాశం ఉంది. దీంతో స్మార్ట్ హోమ్ పరికరాలు సౌకర్యంతో పాటు గోప్యతకు సంబంధించిన ప్రమాదాలను కూడా తీసుకురావచ్చనే విషయం ఈ ఘటనతో స్పష్టమైంది. నేలను శుభ్రం చేయడానికి రూపొందించిన ఓ రోబో వాక్యూమ్.. అనుకోకుండా నిఘా సాధనంగా మారిన ఈ ఘటన సాంకేతిక పరికరాలను ఉపయోగించేటప్పుడు వ్యక్తిగత గోప్యత, అనుమతులు, డేటా భద్రతపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?

OTR: తెలంగాణ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల పోరులోకి ఊహించని వ్యక్తులు దిగబోతున్నారా?...

Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్‌ కల్యాణ్‌.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!

Deputy CM Pawan Kalyan: తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన...

Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!

Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రి కొండా...

Turkey-SCO: ‘ఎస్‌సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!

చైనా, రష్యా నేతృత్వంలోని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO)లో పూర్తిస్థాయి సభ్యత్వం...