3
September, 2026

A News 365Times Venture

3
Thursday
September, 2026

A News 365Times Venture

Deputy CM Pawan Kalyan: ఎవ్వరినీ వదలని పవన్‌ కల్యాణ్‌.. ప్రధాని నుంచి జనసైనికుల వరకు..!

Date:

Deputy CM Pawan Kalyan: తన పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనను పలకరించి, శుభాకాంక్షలు తెలియజేసి, ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరి ఆప్యాయతకు కృతజ్ఞుడినని పేర్కొన్నారు. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, భారత్‌ నలుమూలల నుంచి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ, అభిమానానికి పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. వారి ఆప్యాయత తనను ఎంతో వినమ్రతకు గురిచేసిందని అన్నారు.

జనసేన పార్టీ నాయకులు, కూటమి భాగస్వాములు, ప్రతి జనసైనికుడు, అభిమాని, మద్దతుదారు తన పుట్టినరోజును ఎంతో ప్రేమతో, ఉత్సాహంతో జరుపుకున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తనపై వారు చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు చెప్పడానికి తగినంత మాటలు తన వద్ద లేవని అన్నారు. జనసైనికులు, అభిమానులతో ఏర్పడిన ఈ అనుబంధాన్ని తాను ఎంతో విలువైనదిగా భావిస్తున్నానని తెలిపారు. తనకు వచ్చిన శుభాకాంక్షలను వినమ్రతతో, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు. అదే సమయంలో ప్రజలు తనపై ఉంచిన నమ్మకంతో మరింత బాధ్యతగా పనిచేయాల్సిన అవసరాన్ని ఈ ప్రేమాభిమానాలు గుర్తు చేస్తున్నాయని పేర్కొన్నారు.

తనపై ప్రజలు చూపించే ప్రేమ కేవలం వేడుకల్లో మాత్రమే కాకుండా, తనతో పాటు ముందుకు తీసుకెళ్లే బాధ్యతగా భావిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ తనపై ఉంచిన విశ్వాసానికి తగినట్టుగా వ్యవహరించాల్సిన బాధ్యతను ఈ అభిమానం మరింత పెంచుతుందని అన్నారు. తన పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతూ.. ప్రజలు, అభిమానులు అందించే ప్రేమ ఎప్పటికీ తనకు బలంగా నిలుస్తుందని పేర్కొన్నారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌..

https://x.com/PawanKalyan/status/2095160768971051311

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Tamil Nadu: కొత్త అసెంబ్లీ–సచివాలయం.. ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖలు.. సీఎం విజయ్ ప్రకటన

Tamil Nadu: తమిళనాడుకు కొత్త అసెంబ్లీ, సచివాలయ సముదాయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం...

OTR: గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటి?

OTR: తెలంగాణ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల పోరులోకి ఊహించని వ్యక్తులు దిగబోతున్నారా?...

Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!

Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రి కొండా...

Turkey-SCO: ‘ఎస్‌సీవో’లో మేము చేరతాం.. టర్కీ ప్రతిపాదన.. భారత్ అభ్యంతరం!

చైనా, రష్యా నేతృత్వంలోని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO)లో పూర్తిస్థాయి సభ్యత్వం...