14
April, 2026

A News 365Times Venture

14
Tuesday
April, 2026

A News 365Times Venture

TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసులో సంచలన విషయాలు..!

Date:

TCS Nashik Case: ప్రముఖ టెక్ సంస్థ టీసీఎస్ నాసిక్ బీపీవో ‘‘కార్పొరేట్ జిహాద్’’ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో అంతర్జాతీయ సంబంధాలు వెలుగులోకి వస్తున్నాయి. టీమ్ లీడర్లు‌గా ఉన్న ఆరుగురు ముస్లిం ఉద్యోగులు, హెచ్‌ఆర్ విభాగంలో పనిచేసే మరో నిందితురాలు కలిసి హిందూ మహిళా ఉద్యోగుల్ని వేధించిన కేసు టెక్ ప్రపంచంలో సంచలనంగా మారింది. మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులు, ఉద్యోగ భద్రత పేరుతో బెదిరింపులకు పాల్పడటం, మతమార్పిడి చర్యలకు నిందితులు పాల్పడ్డారు.

మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయడంతో, కొందరు మహిళా పోలీసులు హౌస్ కీపింగ్ సిబ్బందిగా టీసీఎస్‌లో అండర్ కవర్‌గా పనిచేస్తూ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకువచ్చారు. ఈ ఆపరేషన్‌లో ఒక పెద్ద మతమార్పిడి నెట్వర్క్ బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఈ కేసుపై మహారాష్ట్ర సర్కార్ సిట్ విచారణ ప్రారంభించింది. ఈకేసులో ఇప్పటి వరకు 9 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. ఇందులో 8 మంది మహిళలు కాగా, ఒక పురుషుడు ఉన్నాడు. అయితే, ఇప్పుడు బాధితుల సంఖ్య 12కు చేరినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు నమోదైన ఎఫ్ఐఆర్‌ల ప్రకారం, ఇందులో లైంగిక వేధింపులు, పెళ్లిపేరుతో మోసం చేసి అత్యాచారం, మతపరమైన ఒత్తిడి, భావోద్వేగ దుర్వినియోగం వంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి.

Read Also: CRPF Constable Recruitment 2026: గెట్ రెడీ.. 9175 కానిస్టేబుల్ పోస్టులు.. అర్హులు వీరే

నలుగురు మహిళా కానిస్టేబుళ్లను టీసీఎస్‌లో పని చేసేలా పంపారు. వీరి ద్వారా నిందితులైన ఉద్యోగుల మధ్య జరుతున్న సంభాషణ, అనుమానాస్పద కదలికలపై కీలక సమాచారం సేకరించారు. ఈ కేసులో ‘‘ఇమ్రాన్’’ అనే వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది. అతనికి మలేషియాతో సంబంధాలు ఉన్న వ్యక్తిగా అనుమానం వ్యక్తమవుతోంది. వాట్సాప్ కాల్స్ ద్వారా ఉద్యోగులతో మాట్లాడి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు, బెటర్ లైఫ్ గురించి చెప్పి ప్రభావితం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతని అసలు గుర్తింపు, ఈ కేసులో అతడి పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ కేసులో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, రజా మెమన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుకుల సహకరించిన హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా సమాచారం. నియామకాలు, సంస్థలో ఆమె పాత్ర, హిందూ మహిళల్ని ఎలా ట్రాప్ చేసిందనే దానిపై విచారణ చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అతిపెద్ద మతమార్పిడి నెట్వర్క్‌తో సంబంధాలు ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. పోలీసులు నిందితుల వాట్సాప్ చాట్స్, అందులో ఉద్యోగుల్ని ఎలా ట్రాప్ చేయాలనే వ్యూహాలు వంటివి చర్చించుకున్నట్లు తెలుస్తోంది. డిలీట్ చేసిన చాట్స్‌ను పొందేందుకు ఫోరెన్సిక్ టీమ్ ఈ మెసేజ్‌లను తిరిగి పొందేలా పనిచేస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

KKR Vs CSK: కేకేఆర్ టార్గెట్ 193.. మరోసారి కీలక పాత్ర పోషించిన సంజూ..

చెపాక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు సమిష్టిగా...

VF MPV 7: విన్‌ఫాస్ట్ VF MPV 7 వచ్చేస్తోంది.. 500KM రేంజ్, 7 సీట్లు, ధర ఎంత? పూర్తి సమాచారం

విన్‌ఫాస్ట్ (VinFast) భారతదేశంలో తన మూడవ ఎలక్ట్రిక్ వాహనంగా VF MPV...

PAKISTAN: ప్రపంచానికి మధ్యవర్తిగా బిల్డప్.. కానీ హోటల్ బిల్లులు కట్టలేని పరిస్థితి!

PAKISTAN: అమెరికా-ఇరాన్ మధ్య చర్చలకు వేదికగా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ మారింది....

CRPF Constable Recruitment 2026: గెట్ రెడీ.. 9175 కానిస్టేబుల్ పోస్టులు.. అర్హులు వీరే

ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్....