ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే ఛాన్స్ వచ్చింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కానిస్టేబుల్ (టెక్నికల్/ట్రేడ్స్‌మ్యాన్/పయనీర్ – పురుషులు/మహిళలు) ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, ఈ రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 20న ప్రారంభమై, మే 19, 2026న నిర్ణీత గడువు ముగిసే వరకు కొనసాగుతుంది. ఈ రిక్రూట్‌మెంట్‌కు అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు CRPF అధికారిక వెబ్‌సైట్, rect.crpf.gov.in ను సందర్శించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read:Actress Sajini : నన్ను చంపాలని చూస్తున్నారు.. నటి సంచలన ఆరోపణలు!
అర్హత
ఈ నియామకంలో పాల్గొనడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుండి మెట్రిక్యులేషన్ (10వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి. అదనంగా, అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో అనుభవం, ఐటిఐ సర్టిఫికేట్, లేదా హెవీ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. అంతేకాకుండా, జనవరి 1, 2026 నాటికి, కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టుకు అభ్యర్థుల వయస్సు 21 నుండి 27 సంవత్సరాల మధ్య, ఇతర అన్ని పోస్టులకు 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి.
Also Read:VishnuPriya Subscription : ఒక్క కేసుతో విష్ణుప్రియకి 11 లక్షల లాభం
రిజర్వ్డ్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయో సడలింపు లభిస్తుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వర్గాల అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు రూ.100 రుసుమును చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యర్థులు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. ఈ నియామకంలో ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)/నైపుణ్య పరీక్ష/PET, PST/డాక్యుమెంట్ వెరిఫికేషన్/వైద్య పరీక్ష (DME/RME) మొదలైన వాటి ద్వారా జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు పే లెవెల్ 3 ప్రకారం నెలకు రూ. 21,700 – 69,100 జీతం అందిస్తారు. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.




