11
September, 2026

A News 365Times Venture

11
Friday
September, 2026

A News 365Times Venture

Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..

Date:

Sweet Atukulu Recipe: పండుగలు, విశేష పూజా దినాల్లో దేవుడికి నైవేద్యం సమర్పించడానికి సమయం తక్కువగా ఉన్నప్పుడు చిటికెలో చేసుకోగల అద్భుతమైన ప్రసాదం “తీపి అటుకులు”. వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి, శ్రీకృష్ణాష్టమి వంటి పర్వదినాల్లో స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన అటుకులతో ఈ నైవేద్యాన్ని సులభంగా తయారుచేసుకోవచ్చు.

కరకరలాడుతూ, బెల్లం పాకంతో కూడిన కమ్మని రుచితో ఉండే ఈ ప్రసాదాన్ని వంట రానివారు కూడా నిమిషాల్లో సిద్ధం చేయవచ్చు. కేవలం దేవుడి నైవేద్యంగానే కాకుండా.. ఇంట్లో పిల్లలు లేదా పెద్దలు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తక్షణమే చేసుకునేందుకు ఇది చక్కటి ఎంపిక. బెల్లం పాకంతో చేయడం వల్ల ఇది చాలా రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది. నోరూరించే ఈ తీపి అటుకుల ప్రసాదం తయారీ విధానం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

* అటుకులు (సన్నటి అటుకులు) – 2 కప్పులు
* తురిమిన బెల్లం – 1/2 నుండి 3/4 కప్పు (తీపికి తగినట్లుగా)
* ఎండు కొబ్బరి తురుము – 1/2 కప్పు
* జీడిపప్పు, కిస్‌మిస్ – 1/4 కప్పు
* నెయ్యి – 3 టీస్పూన్లు
* యాలకుల పొడి – 1/4 టీస్పూన్
* పచ్చ కర్పూరం – చిటికెడు (ఆప్షనల్)
* నీళ్లు – 1/4 కప్పు

తయారీ విధానం:

ఈ ప్రసాదానికి పేపర్ అటుకులు (చాలా సన్నగా ఉండే అటుకులు) వాడితేనే టెక్స్చర్ బాగుంటుంది. ముందుగా అటుకులను జల్లెడ పట్టి, అందులోని నూక లేదా చిన్న రజను వేరుచేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, రెండు టీస్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగాక జీడిపప్పు, కిస్‌మిస్ వేసి దోరగా వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో మరో టీస్పూన్ నెయ్యి వేసి, ఎండు కొబ్బరి తురుమును వేసి చిన్న మంటపై మంచి బంగారు రంగు వచ్చేవరకు వేయించి పక్కకు తీసుకోవాలి.

ఇప్పుడు అదే పాన్‌లో జల్లించి పెట్టుకున్న అటుకులను వేసి చిన్న మంటపై ఒకటి రెండు నిమిషాలు వేయించాలి. అటుకులు రంగు మారకూడదు, కేవలం వేడెక్కి క్రిస్పీగా మారితే సరిపోతుంది. ఆ తర్వాత వీటిని డ్రై ఫ్రూట్స్, వేయించిన కొబ్బరి ఉన్న ప్లేట్‌లోకి తీసుకుని చేత్తో అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పడు మరో పాన్‌లో తురిమిన బెల్లం, పావు కప్పు నీళ్లు పోసి మీడియం మంటపై బెల్లాన్ని పూర్తిగా కరిగించాలి. బెల్లం కరిగాక నలకలు లేకుండా ఆ నీటిని వడకట్టి, మళ్లీ పాన్‌లోకి తీసుకోవాలి. వడకట్టిన బెల్లం నీటిని చిన్న మంటపై మరిగించాలి. గులాబ్ జామున్ పాకం కంటే కాస్త చిక్కగా, జిగురుగా (తీగ పాకానికి కాస్త ముందు దశ) అయ్యేంత వరకు మరిగించాలి.

పాకం సిద్ధమయ్యాక స్టవ్ మంటను పూర్తిగా తగ్గించి, ముందుగా కలిపి ఉంచిన అటుకులు, కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని ఇందులో వేయాలి. పాకం అటుకులన్నింటికీ సమానంగా పట్టేలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. చివరిగా యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం వేసి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రపరిస్తే వారం రోజులకు పైగా కరకరలాడుతూ తాజాగా ఉంటుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!

Saudi Arabia-Pakistan: సౌదీ అరేబియాపై హైతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్రమవుతున్నాయి. సౌదీ...

Modi-Putin: మోడీతో పుతిన్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ

బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రధాని మోడీ-రష్యా...

Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..

Raghav Chadha: రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై...

Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్‌ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?

2001 సెప్టెంబర్ 11, అమెరికన్ల జీవితాల్లో ఒక పీడకల. అంతేకాదు ప్రపంచమంతా...