17
June, 2026

A News 365Times Venture

17
Wednesday
June, 2026

A News 365Times Venture

Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ ‘స్టాండప్ కామెడీ’.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..

Date:

భారత టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ ప్రస్థానం ఒక వెలుగు వెలిగి, అంతే వేగంగా ముగింపు దశకు చేరుకుంది. కెరీర్‌లో 113 టీ20లలో 3,272 పరుగులు చేసిన సూర్య.. 35 ఏళ్ల వయసులో ఇప్పుడు మళ్లీ భారత జట్టులోకి రావడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. ఒకప్పుడు తన అద్భుతమైన బ్యాటింగ్‌తో టీ20 స్వరూపాన్నే మార్చేసిన ఈ ‘మిస్టర్ 360’ ఆటతీరు ఎందుకు పతనమైందనేది ఆసక్తికరం.

2025లో 19 టీ20 ఇన్నింగ్స్‌లలో సూర్య కేవలం 218 పరుగులు మాత్రమే చేశాడు. ఒక సన్మాన సభలో దీనిపై ఓ విద్యార్థి ప్రశ్నించగా.. “నా వెనుక 14 మంది సైనికులు (జట్టు సభ్యులు) ఉన్నారు, నేను ఆడే రోజు ఏమౌతుందో వారికి తెలుసు” అంటూ కాస్త అహంకారంతో కూడిన సమాధానమిచ్చాడు. జట్టు గెలుస్తోంది కాబట్టి తన వైఫల్యాన్ని అతను పెద్దగా పట్టించుకోలేదు. “నాకు పరుగులు రాలేదు అంతే, ఫామ్ కోల్పోలేదు” అనే భ్రమలోనే ఉండిపోయాడు. కానీ, నిలకడగా పరుగులు చేయని కెప్టెన్ డ్రెస్సింగ్ రూమ్‌లో గౌరవం కోల్పోతాడనే నిజాన్ని అతను గ్రహించలేకపోయాడు.

టెక్నిక్ మార్చుకోకపోవడం..
సూర్యకుమార్ సిగ్నేచర్ షాట్ అయిన ‘సుప్లా షాట్’ (వికెట్ల వెనుకకు కొట్టే షాట్) అతనికి శాపంగా మారింది. 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలోనే, అప్పటి కోచ్ రాహుల్ ద్రావిడ్ సూర్యను గ్రౌండ్ లోని అన్ని వైపులా కూడా ఆడటం నేర్చుకోవాలని సూచించారు. కానీ సూర్య తన ఆటను మార్చుకోలేదు. బౌలర్లు అతని శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని వేసే స్ట్రెయిట్ డెలివరీలను ఎదుర్కోవడంలో విఫలం కావడం అతన్ని వన్డేల నుంచే కాకుండా, టీ20ల నుంచి కూడా దూరం చేసింది.

2024లో హార్దిక్ పాండ్యాను కాదని గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ , ఒక సీనియర్ ఆటగాడి మద్దతుతో సూర్య కెప్టెన్ అయ్యాడు. హార్దిక్, సూర్యల మధ్య సంబంధాలు లేవనేది బహిరంగ రహస్యం. ఆసియా కప్‌లో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాకు హ్యాండ్‌షేక్ ఇవ్వకుండా భారత్ ఆర్మీకి విజయాన్ని అంకితం చేసి సూర్య హీరో అయ్యాడు. గంభీర్ మద్దతు ఉన్నా, ఆ టోర్నీలో 6 ఇన్నింగ్స్‌లలో కేవలం 72 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.

ఆ తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్, ఐపీఎల్‌లలో కూడా సూర్య ఘోరంగా విఫలమయ్యాడు. ఒలింపిక్స్ 2028 ఆడాలనేది అతని కల అయినప్పటికీ, ‘పరుగులు చేస్తేనే జట్టులో చోటుంటుంది’ అని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. అలా ఒక మెరుపులా దూసుకొచ్చిన సూర్యకుమార్ కెరీర్, చివరకు ఒక నిశ్శబ్ద ముగింపు వైపు పయనించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!

హోంమంత్రి వంగలపూడి అనితపై చేసిన వ్యాఖ్యల వివాదంపై వైసీపీ నేత, మాజీ...

CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!

CM Revanth Reddy: ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా పేద...

Maharashtra Politics: ఉద్ధవ్ ఠాక్రే కోటలో మరోసారి చీలిక.. షిండే, లోక్‌సభ స్పీకర్‌తో భేటీకి ఎంపీలు రెడీ..

Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో మరో భారీ కుదుపునకు తెర లేచింది....