22
May, 2026

A News 365Times Venture

22
Friday
May, 2026

A News 365Times Venture

Summer Foods for Kids: డీహైడ్రేషన్‌కు చెక్..! వేసవిలో పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడే సూపర్ ఫుడ్స్ ఇవే..

Date:

Summer Foods for Kids: సమ్మర్‌ హాలీ డేస్‌లో పిల్లలు ఎంజాయ్‌ చేస్తుంటారు.. విద్యా సంస్థలకు సెలవులు ఉండడంతో.. ఆటలు, పాటల్లో మునిగిపోతారు.. చివరకు ఎండను సైతం లెక్క చేయకుండా ఆటలు ఆడేస్తుంటారు.. అయితే, వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. మండే ఎండలు, వేడి గాలులు, అధిక తేమ కారణంగా పిల్లలు త్వరగా అలసిపోవడం, చిరాకు పడటం, డీహైడ్రేషన్‌కు గురికావడం సాధారణంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బయట ఎక్కువసేపు ఆడుకునే పిల్లల్లో శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల నీరసం, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయి.

అందుకే వేసవిలో పిల్లల ఆహారంలో శరీరానికి చల్లదనం ఇచ్చే, నీటి శాతం అధికంగా ఉండే ఆహారాలను చేర్చడం చాలా ముఖ్యం. ఇవి పిల్లలను తాజాగా ఉంచడమే కాకుండా, వడదెబ్బ నుంచి కూడా రక్షిస్తాయి. హీట్‌ను, హీట్‌ వేవ్‌ను సైతం లెక్క చేయకుండా వాళ్లు గేమ్స్‌లో మునిపోతారు కాబట్టి.. వాటి బారిన పిల్లలు పడకుండా.. మంచి ఫుడ్‌ అందిస్తే సరిపోతుంది..

పుచ్చకాయ: వేసవిలో పిల్లలకు ఇవ్వాల్సిన ఉత్తమ పండ్లలో పుచ్చకాయ ఒకటి. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండి శరీరానికి శక్తిని అందిస్తాయి.

దోసకాయ: దోసకాయలో దాదాపు 95 శాతం నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. సలాడ్ రూపంలో లేదా కొద్దిగా ఉప్పు చల్లి స్నాక్‌లా పిల్లలకు ఇవ్వవచ్చు.

పెరుగు అన్నం: వేసవిలో పెరుగు అన్నం పిల్లలకు మంచి ఆహారం. ఇది శరీరానికి చల్లదనం ఇవ్వడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పిల్లలు కూడా దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు.

కొబ్బరి నీరు: బయట ఆడుకునే సమయంలో పిల్లలకు చెమట ఎక్కువగా పడుతుంది. దీంతో శరీరంలో అవసరమైన ఖనిజాలు తగ్గిపోతాయి. కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్లను అందించి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

మజ్జిగ: మజ్జిగ శరీరాన్ని చల్లబరచడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే ఆహారం త్వరగా జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది. ఇందులో కాల్షియం, ప్రోటీన్లు వంటి పోషకాలు కూడా ఉంటాయి.

నిమ్మరసం: పిల్లలు బయట ఆడుకుని వచ్చిన తర్వాత నిమ్మరసం ఇవ్వడం చాలా మంచిది. ఇందులో ఉండే విటమిన్ సి శరీరానికి ఉత్సాహాన్ని అందిస్తుంది. వేసవిలో ఇది మంచి శీతల పానీయంగా పనిచేస్తుంది.

గుల్కంద్: గులాబీ రేకులతో తయారయ్యే గుల్కంద్ శరీర వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని పాలలో కలిపి పిల్లలకు ఇస్తే కడుపుకు చల్లదనం కలుగుతుంది.

బేల్ రసం: బేల్ పండు శీతల గుణాలకు ప్రసిద్ధి. దీని రసం పిల్లలను వడదెబ్బ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. కడుపు ఆరోగ్యానికి కూడా ఇది మంచిదిగా భావిస్తారు.

టమోటాలు: టమోటాల్లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో తేమను నిల్వ ఉంచడంలో సహాయపడతాయి. సలాడ్ల రూపంలో పిల్లలకు ఇవ్వవచ్చు.

పిల్లల ఆరోగ్యానికి సరైన ఆహారం చాలా ముఖ్యం
వేసవిలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు, సహజ శీతల పానీయాలు తప్పనిసరిగా ఇవ్వాలి. ఇలా చేస్తే డీహైడ్రేషన్, అలసట, వడదెబ్బ వంటి సమస్యల నుంచి వారిని సులభంగా కాపాడవచ్చు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..

ఐపీఎల్ 2026లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్...

RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..

ఐపీఎల్ 2026లో భాగంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం (ఉప్పల్) వేదికగా...

Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్

బీహార్‌లోని గయా జిల్లాలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి జీతన్...

Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్‌ సింగ్‌కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్

తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో మరో కీలక పరిణామం...