SRH vs RCB: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు జరుగుతున్న కీలక పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ హై వోల్టేజ్ మ్యాచ్‌కు వేదికగా మారింది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించాడు. దీంతో అభిమానులు భారీ స్కోర్‌పై అంచనాలు వ్యక్తం చేస్తున్నారు.
టాస్ సమయంలో మాట్లాడిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్, “టాప్-2లో నిలవడం కాస్త కష్టమే అయినా, ఫైనల్స్‌కు ముందు కొన్ని కొత్త ప్రయోగాలు చేయాలని చూస్తున్నాం. పెద్ద స్కోర్ చేయడమే మా లక్ష్యం” అని అన్నారు. చివరి మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని కూడా వెల్లడించాడు. మరోవైపు ఆర్సీబీ కెప్టెన్ రాజత్ పాటిదార్ మాట్లాడుతూ.. “మేము ఎక్కడ ఆడినా అది హోమ్ గ్రౌండ్‌లానే అనిపిస్తుంది. ప్రతి మ్యాచ్‌లో మా స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వాల్సిందే” అని చెప్పాడు. ఇక టీంలో ఒక మార్పు చోటు చేసుకుంది.
ఈ సీజన్‌లో ఇప్పటికే ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. ఇప్పటి వరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ 13 మ్యాచ్‌లలో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్‌లలో 9 విజయాలతో 18 పాయింట్లు సంపాదించింది. దీంతో ఈ మ్యాచ్ పాయింట్ల పట్టికలో స్థానాల పరంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఈ 2 జట్లు ఇప్పటివరకు 27 సార్లు తలపడగ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 14 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఆర్సీబీ 12 మ్యాచ్‌లలో గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రస్తుత సీజన్‌లో మార్చి 28న జరిగిన తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను ఓడించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI:
విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రాజత్ పాటిదార్ (కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), క్రునాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ, రసిఖ్ సలామ్ దార్.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI:
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలిల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివాంగ్ కుమార్, ఈషాన్ మలింగా, సకిబ్ హుస్సేన్.
Match 68@SunRisers vs @RCBTweets
Toss update from Hyderabad
SRH won the toss and elected to bat first against RCB #TATAIPL #SRHvRCB #SRHvsRCB #sunrisershyderabad #iplupdates #PatCummins #RajatPatidar #royalchallengersbengaluru @a2zcric @IPL pic.twitter.com/FmiiPcy0zs
— A2ZCRICKET (@a2zcric) May 22, 2026



Toss update from Hyderabad 
