17
November, 2026

A News 365Times Venture

17
Tuesday
November, 2026

A News 365Times Venture

Shehbaz Sharif: 2050 నాటికి ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా పాకిస్థాన్.. అప్పుల ఊబిలో ఉన్నా భారీ లక్ష్యం!

Date:

Shehbaz Sharif:  పేదరికం, తీవ్ర అప్పుల భారం, అంతర్గత సంక్షోభం మధ్య పాకిస్తాన్ భారీ లక్ష్యాన్నే పెట్టుకుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి(IMF) నుంచి తదుపరి విడత నిధుల కోసం ఎదురుచూస్తున్న పాకిస్థాన్.. 2050 నాటికి ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ధీమా వ్యక్తం చేశారు. 2022లో గోల్డ్‌మన్ శాక్స్ సంస్థ 2075 నాటికి పాకిస్తాన్ 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేసింది. అయితే, ఈ అంచనాలను పాక్ 2050 కన్నా ముందే చేరుకుంటుందని పాక్ ప్రధాని చెప్పారు.

రాజధాని ఇస్లామాబాద్‌లో శుక్రవారం జరిగిన పాకిస్తాన్ మినరల్స్ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్‌లో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. గోల్డ్‌మన్ శాక్స్ అంచనాను ప్రస్తావిస్తూ.. “ఇక్కడ నేను ఒక చిన్న సవరణ చేయాలనుకుంటున్నాను” అని అన్నారు. 2075 నాటికి కాకుండా, 2050కు ముందే పాకిస్థాన్ ప్రపంచంలో ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే, లక్ష్యం పెద్దదిగా ఉన్నప్పటికీ పాకిస్తాన్ ఆ టార్గెట్ చేరుకుంటుందా అనేదానిపై నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ అప్పుల భారం, ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. మరోవైపు, ఐఎంఎఫ్ నుంచి 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 10,000 కోట్ల) నిధుల ఆమోదం కోసం ఎదురుచూస్తోంది.

ఖనిజాలపై షరీఫ్ ఆశలు..

పాకిస్తాన్ ఆర్థిక వృద్ధికి ఖనిజ సందప దోహదపడుతుందని పాక్ ప్రధాని భావిస్తున్నారు. దేశంలో తవ్విన ఖనిజాలను ముడి సరుకుగా వేరే ప్రాంతాలకు ఎగుమతి చేయకుండా, దేశంలోనే శుద్ధి చేసి పారిశ్రామిక ఉత్పత్తులుగా మార్చాలని పెట్టుబడిదారుల్ని కోరారు. బలూచిస్తాన్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద రాగి, బంగారు ఖనిజాల నిక్షేపాలు ఉన్నట్లు షరీఫ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.

గోల్డ్‌మన్ శాక్స్ ఏం అంచనా వేసింది.?

గోల్డ్‌మన్ శాక్స్ 2022లో విడుదల చేసిన అధ్యయనం 104 దేశాల ఆర్థిక వ్యవస్థలను పరిశీలించింది. ఈ అంచనాల ప్రకారం, 2075 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా చైనా, భారత్, అమెరికా, ఇండోనేషియా, నైజీరియా తొలి ఐదు స్థానాల్లో ఉంటాయని, పాకిస్తాన్ ఆరో స్థానంలో ఉండొచ్చని అంచనా వేసింది. ఇది నిజమైతే పాకిస్తా్న్ వాస్తవ జీడీపీ 12.7 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని, తలసరి జీడీపీ 27,100 డాలర్లుగా అంచనా వేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం...

Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!

Congress Chalo Delhi: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించాల్సిన ‘ఛలో...

Uttam Kumar Reddy : మేడిగడ్డపై ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కీలక విన్నపాలు

తెలంగాణలో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, నిధుల విషయంలో...

BJP: ఇటలీ నేత ‘ఓట్ చోర్’ నినాదం.. రాహుల్ గాంధీ నవ్వులపై బీజేపీ మండిపాటు!

BJP: హైదరాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘‘భారత్ సమ్మిట్’’ వివాదానికి...