15
October, 2026

A News 365Times Venture

15
Thursday
October, 2026

A News 365Times Venture

Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?

Date:

Salary Hike 2026-27: జీతాలు పెరగక చాలా రంగాల్లో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. మరికొన్ని రంగాలను ఉద్యోగాల తొలగింపు భయం వెంటాడుతుంది.. ఇక, మరికొన్ని రంగాల్లో ఉద్యోగాలను AI దెబ్బకొడుతుంది.. అయితే, ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. భారత్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల జీతాలు సగటున 9.1 శాతం పెరిగే అవకాశం ఉందని గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ ఏఆన్ (Aon) తన వార్షిక సర్వేలో వెల్లడించింది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), ఇంధన రంగం, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు అధిక వేతన పెంపు లభించే అవకాశం ఉందని అంచనా వేసింది. 45 పరిశ్రమలకు చెందిన 1,200కు పైగా కంపెనీల సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదికను రూపొందించింది.

ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో అత్యధిక జీతాల పెంపు
2026-27లో ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఉద్యోగుల జీతాలు 10.1 శాతం పెరిగే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఈ జాబితాలో ఇంధన రంగం 9.9 శాతం పెంపుతో రెండో స్థానంలో ఉండగా, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాల్లో 9.8 శాతం వేతన పెంపు ఉండొచ్చని తెలిపింది. ప్రతిభావంతులైన ఉద్యోగులను ఆకర్షించడం, కొనసాగించడం కోసం కంపెనీలు పెట్టుబడులు పెడుతూనే ఖర్చులను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయని నివేదిక సూచించింది.

దేశీయ వినియోగం, పెట్టుబడులతో కంపెనీల్లో విశ్వాసం
భారత్‌లో దేశీయ వినియోగం బలంగా ఉండటం, పెట్టుబడులు కొనసాగడం, ఎగుమతులు మెరుగుపడటం వంటి అంశాలు కంపెనీల వ్యాపార విశ్వాసాన్ని పెంచుతున్నాయని ఏఆన్ ఇండియా టాలెంట్ సొల్యూషన్స్ విభాగం అధిపతి, భాగస్వామి రూపాంక్ చౌదరి తెలిపారు. ఈ పరిస్థితులు ఉద్యోగుల్లో ప్రతిభను పెంపొందించేందుకు కంపెనీలకు తోడ్పడుతున్నాయని, అదే సమయంలో నిర్వహణ ఖర్చులను అదుపులో ఉంచేందుకు అవకాశం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.

ఉద్యోగుల వలసలు 18 శాతానికి పెరుగుదల
జీతాల పెంపు అంచనాలు స్థిరంగా ఉన్నప్పటికీ, నైపుణ్యం కలిగిన ఉద్యోగులను సంస్థల్లో కొనసాగించడం కంపెనీలకు సవాలుగా మారుతోంది. 2026లో ఉద్యోగుల వలసల రేటు 18 శాతానికి పెరిగినట్లు ఏఆన్ సర్వే వెల్లడించింది. 2025లో ఇది 16.2 శాతంగా, 2024లో 17.1 శాతంగా నమోదైంది. ఈ గణాంకాలు ప్రతిభావంతులైన ఉద్యోగుల కోసం కంపెనీల మధ్య పోటీ కొనసాగుతోందని సూచిస్తున్నాయి.

కంపెనీల్లో పెరుగుతున్న ఏఐ వినియోగం
కార్పొరేట్ రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం వేగంగా పెరుగుతోందని సర్వే తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పాదకత సాధనాలను క్రమం తప్పకుండా ఉపయోగిస్తున్న కంపెనీల శాతం 2025లో 46.1 శాతంగా ఉండగా, 2026లో 56 శాతానికి చేరింది. దాదాపు 60 శాతం కంపెనీలు ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్పడంపై దృష్టి సారిస్తున్నాయి. ఏజెంటిక్ ఏఐ వినియోగం, ఏఐ సంబంధిత నైపుణ్యాలకు డిమాండ్ కూడా పెరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది.

ఏఐ, మెషిన్ లెర్నింగ్ నిపుణులకు అధిక వేతనాలు
ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్‌లో నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు భారతీయ కంపెనీలు 2025తో పోలిస్తే సుమారు 10 శాతం అధిక వేతనాలు చెల్లిస్తున్నట్లు సర్వే వెల్లడించింది. వ్యాపార కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని విస్తరించడంతో పాటు ఉద్యోగుల నైపుణ్యాలను మెరుగుపరచడంపై సంస్థలు పెట్టుబడులు పెంచుతున్నాయని ఈ వివరాలు సూచిస్తున్నాయి.

కొత్త వేతన నియమావళి అమలుపైనా వివరాలు
కొత్త వేతన నియమావళి నిబంధనలను 65.4 శాతం కంపెనీలు ఇప్పటికే అమలు చేస్తున్నట్లు సర్వే పేర్కొంది. మరో 20.9 శాతం కంపెనీలు వచ్చే ఆరు నెలల్లో ఈ నిబంధనలను అమలు చేయాలని భావిస్తున్నాయి. మొత్తంగా 2026-27లో జీతాల పెంపు సగటున 9.1 శాతంగా ఉండొచ్చని అంచనా ఉన్నప్పటికీ, ఏ రంగంలో పనిచేస్తున్నారు, ఉద్యోగికి ఉన్న నైపుణ్యాలు, కంపెనీ పరిస్థితులు వంటి అంశాలు వాస్తవ వేతన పెంపుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మరోసారి న్యాయపరమైన చర్చ మొదలైంది....

ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..

ACP Vivek Bhagat: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ రాజీనామా...

Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్

జర్మనీలోని బోఖుమ్ నగరంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ నివాస భవనంలో...

OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి

OTR:  ఆ జిల్లా టీడీపీలో లోకల్‌ బాడీ రిజర్వేషన్లు కొత్త ఈక్వేషన్స్‌కు...