17
April, 2026

A News 365Times Venture

17
Friday
April, 2026

A News 365Times Venture

Reed Hastings: సొంత కంపెనీ నుంచి తప్పుకున్న ఫౌండర్.. నెట్‌ఫ్లిక్స్‌లో ముగిసిన ‘రీడ్ హేస్టింగ్స్’ శకం

Date:

Reed Hastings: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి వినోదాన్ని చేరువ చేసిన నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు రీడ్ హేస్టింగ్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలతో ఛైర్మన్‌గా ఆయన పదవీకాలం ముగియనుండగా, ఆ తర్వాత కంపెనీ డైరెక్టర్ల బోర్డు నుంచి కూడా ఆయన తప్పుకోనున్నట్లు సంస్థ అధికారికంగా వెల్లడించింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు నెట్‌ఫ్లిక్స్‌ను అగ్రపథంలో నడిపిన హేస్టింగ్స్, ఇకపై ప్రజా సంక్షేమం కోసం పని చేయాలని భావిస్తున్నారు. 2023లోనే ఆయన సీఈఓ పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు బోర్డు నుంచి కూడా తప్పుకోవడంతో ఆయన తదుపరి అడుగు సామాజిక సేవా కార్యక్రమాల వైపు ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ఆయన చేపట్టబోయే కొత్త ప్రాజెక్ట్ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది.

READ ALSO: Womens Reservation Bill: నారీ శక్తి బిల్లుపై ఓటమి.. మరి మిగిలిన రెండు బిల్లుల సంగతేంటి?

1997లో చిన్న అడుగు..
1997లో తన స్నేహితుడు మార్క్ రాండోల్ఫ్‌తో కలిసి హేస్టింగ్స్ నెట్‌ఫ్లిక్స్‌ను ప్రారంభించారు. మొదట్లో డీవీడీ రెంట్ సర్వీస్‌గా మొదలైన ఈ సంస్థ.. నేడు 190కి పైగా దేశాల్లో స్ట్రీమింగ్ సేవలను అందిస్తోంది. “వినియోగదారుల సంతోషంపై దృష్టి పెట్టడం, ప్రతిభావంతులు ఎదిగేలా ఒక సంస్కృతిని నిర్మించడమే నెట్‌ఫ్లిక్స్‌కు నేను అందించిన నిజమైన సహకారం” అని హేస్టింగ్స్ ఈ సందర్భంగా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. భారతదేశంలో కూడా దీనికి భారీ క్రేజ్ ఉంది. మన దేశంలో ప్రకటనలతో కూడిన బేసిక్ ప్లాన్ రూ.199 కే అందుబాటులో ఉంది. వెబ్ సిరీస్‌లు, ఒరిజినల్ మూవీస్, డాక్యుమెంటరీలతో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ రంగంలో రారాజుగా వెలుగొందుతోంది.

కేబుల్ టీవీ లేదా శాటిలైట్ కనెక్షన్ అవసరం లేకుండా, నేరుగా ఇంటర్నెట్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్‌టాప్‌లలో వీడియో కంటెంట్‌ను చూసే సదుపాయాన్ని ఓటీటీ (Over-The-Top) అంటారు. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, జీ5 వంటివి ఈ రంగంలో ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి.

READ ALSO: Fish Pickle: చేపల పచ్చడి నీచు వాసన రాకుండా పర్ఫెక్ట్‌గా కుదరాలా.. అయితే సింపుల్‌గా ఇలా చేయండి!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!

నేటి ఆధునిక కాలంలో జీవనశైలి వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనదిగా మారిన ‘మధుమేహం’...

Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

పిల్లలే రేపటి పౌరులు, వారి ఆరోగ్యంపై పెట్టే శ్రద్ధ వారు ఆరోగ్యవంతమైన...

Women Reservation: అంకెల్లో గెలిచి.. అధిక్యంలో ఓడి.. బిల్లు వీగిపోవడం వెనుక ఉన్న కారణాలివే..

నేడు లోక్‌సభ వేదికగా జరిగిన పరిణామాలు భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక...

SBI Bank: బ్యాంక్ ఖాతాదారులను ఇలా కూడా మోసం చేస్తుందా ఎస్బీఐ..? ఏం జరిగిందంటే..

రూపాయిల కరెంటు బిల్లు కట్టబోయి ఏకంగా రూ. 1.99 లక్షలు పోగొట్టుకున్న...