12
August, 2026

A News 365Times Venture

12
Wednesday
August, 2026

A News 365Times Venture

Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..

Date:

Railways: ఇటీవల రైలులో ‘‘హనీమూన్’’ కోసం ఏర్పాట్లు చేయడం, దానికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో రైల్వే శాఖ విమర్శలు ఎదుర్కొంది. ఇది మరవకముందే బర్త్ డే పార్టీ వెలుగులోకి వచ్చింది. ఝాన్సీ గుండా వెళుతున్న న్యూఢిల్లీ-భోపాల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లో టికెట్ తనిఖీ సిబ్బంది పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది. వైరల్ అవుతున్న ఈ 44 సెకన్ల వీడియోలో, ఝాన్సీకి చెందిన తనిఖీ సిబ్బంది తమ డ్యూటీ యూనిఫాంలో మరో ఉద్యోగి బర్త్ డే వేడుకలు నిర్వహించడం వీడియోలో కనిపించింది. కేక్ కట్ చేసి, పూలమాల వేస్తూ ఉద్యోగులు కనిపిస్తారు. ఈ సంఘటన మూడు నాలుగు రోజుల క్రితం జరిగినట్లు తెలుస్తోంది.

తాజా బర్త్ డే ఘటనలో ఉద్యోగులు న్యూఢిల్లీ-భోపాల్ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ ఇన్స్‌పెక్టర్లని భావిస్తున్నారు. విధి నిర్వహణలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం ఏమిటనే విమర్శలు వస్తున్నాయి. ఈ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియో తన దృష్టికి వచ్చిందని ఝాన్సీ డివిజన్ పీఆర్ఓ మనోజ్ కుమార్ తెలిపారు. దీనిపై రైల్వే యంత్రాంగం దర్యాప్తు ప్రారంభించింది. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోనుంది.

గతంలో జూన్ 6, 2026న నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక హనీమూన్ సూట్ ఏర్పాటు చేయడం వివాదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో రైల్వే శాఖ దీనిని సమోటోగా స్వీకరించి దర్యాప్తు ప్రారంభించింది. ఈ కేసులో టికెట్ తనఖీ సిబ్బందిని బాధ్యులుగా గుర్తించి వారిని సస్పెండ్ చేశారు.



Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..

USA: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26...

AP Aqua Farmers: ఆక్వా రైతులకు గుడ్‌న్యూస్.. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల తగ్గింపు..! కీలక ప్రకటన

AP Aqua Farmers: ఆక్వా రైతులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని...

Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!

Hyderabad: హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ జారీ...