12
August, 2026

A News 365Times Venture

12
Wednesday
August, 2026

A News 365Times Venture

Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!

Date:

Child Sexual Abuse Content Sharing: సోషల్ మీడియా వేదికగా పిల్లలకు సంబంధించిన లైంగిక దోపిడీ, అశ్లీల కంటెంట్ లింకులను షేర్ చేస్తున్నారనే ఆరోపణలపై మేడ్చల్ జిల్లా పరిధిలోని జీడిమెట్ల పోలీసులు గాజులరామారానికి చెందిన శానప్ప అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం.. నిందితుడు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌ను వీక్షిస్తూ, వాటికి సంబంధించిన లింకులను ఇతరులకు షేర్ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని అమెరికాకు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ (NCMEC) గుర్తించింది. NCMEC తన టిప్‌లైన్ ద్వారా సంబంధిత సమాచారాన్ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB)కు అందించింది. ఈ అందిన సమాచారంతో రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు.

అందిన సమాచారాన్ని పరిశీలించిన సైబర్ క్రైమ్ పోలీసులు సంబంధిత ఆన్‌లైన్ కార్యకలాపాలకు సంబంధించిన ఐపీ అడ్రస్, ఫోన్ నంబర్ వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఈ వివరాల ఆధారంగా అనుమానితుడి కార్యకలాపాలు జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నట్లు గుర్తించి, ఆ సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించారు. దీంతో జీడిమెట్ల పోలీసులు గాజులరామారం ప్రాంతానికి చెందిన శానప్పపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోషల్ మీడియా ద్వారా బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌ను షేర్ చేయడం, ప్రసారం చేయడం వంటి కార్యకలాపాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన కంటెంట్‌ను చూడటం, నిల్వ చేయడం, షేర్ చేయడం లేదా ఇతరులకు పంపడం చట్టపరంగా తీవ్రమైన పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

USA: ఉద్యోగంలో చేరిన కొన్ని రోజులకే.. అమెరికాలో ఏపీకి చెందిన టెక్కీ మృతి..

USA: అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 26...

Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..

Railways: ఇటీవల రైలులో ‘‘హనీమూన్’’ కోసం ఏర్పాట్లు చేయడం, దానికి సంబంధించిన...

AP Aqua Farmers: ఆక్వా రైతులకు గుడ్‌న్యూస్.. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల తగ్గింపు..! కీలక ప్రకటన

AP Aqua Farmers: ఆక్వా రైతులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని...

Hyderabad: అలర్ట్.. KBR పార్క్ చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్ వే..!

Hyderabad: హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక అలర్ట్ జారీ...