13
November, 2026

A News 365Times Venture

13
Friday
November, 2026

A News 365Times Venture

Qualcomm Layoffs: ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. లేఆఫ్స్‌లో రోడ్డున పడ్డ ఇంజనీర్!

Date:

Qualcomm Layoffs: టెక్ ఉద్యోగులకు భరోసా లేకుండా పోయింది. చిన్న కంపెనీల నుంచి మొదలు అతిపెద్ద టెక్ సంస్థలు తమ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఐఐటీ, ఎన్ఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి డిగ్రీలు పొందినా కూడా లేఆఫ్స్ తప్పడం లేదు. తాజాగా ఇంటర్నెట్‌లో ఓ ఉద్యోగి విషయం వైరల్‌గా మారింది. ప్రముఖ చిక్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ తొలగింపుల్లో ఏడాదికి రూ. 26 లక్షల ప్యాకేజీ కలిగిన ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. తన స్నేహితుడికి ఎదురైన చేదు అనుభవాన్ని వికాస్ అనే ఎక్స్ యూజర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఫ్రెండ్ ఉద్యోగం పోయిందని పోస్ట్..

క్వాల్‌కామ్ లేఆఫ్‌లో తన స్నేహితుడి ఉద్యోగం పోయిందని వికాస్ ఆల్వేస్ అనే నెటిజన్ వెల్లడించారు. ఎంతో కష్టపడి క్యాంపప్ ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగం సాధించినా, చివరకు లేఆఫ్ తప్పలేదని చెప్పారు. బీటెక్ చదవుతున్న సమయంలోనే తన స్నేహితుడికి సదర్లాండ్ సంస్థలో నాన్-టెక్నికల్ జాబ్ అవకాశం వచ్చిందని, అయితే ఉద్యోగంలో చేరకుండా గేట్ పరీక్షకు సిద్ధమై, ఒక ఏడాది కష్టపడి 1100 ర్యాంక్ సాధించి, ఐఐటీ హైదరాబాద్‌లో వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ (VLSI) విభాగంలో ఎం.టెక్ చదివినట్లు చెప్పాడు.

రూ. 26 లక్షల భారీ ప్యాకేజీతో క్వాల్‌కామ్ జాబ్..

ఐఐటీ హైదరాబాద్‌లో రెండేళ్ల ఎం.టెక్ పూర్తి చేసిన తర్వాత క్వాల్‌కామ్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఉద్యోగం పొందినట్లు వికాస్ వెల్లడించారు. తన స్నేహితుడికి ఏడాదికి రూ.18 లక్షల బేస్ శాలరీతో పాటు మొత్తం కాస్ట్ టు కంపెనీ (CTC) రూ.26 లక్షలకు పైగా ప్యాకేజీ లభించినట్లు వెల్లడించారు. ఇంత కష్టపడి ఉద్యోగం సాధించినా, అది ఎక్కువ కాలం నిలవలేదని, తాజా లేఆఫ్‌లో ఉద్యోగం పోయినట్లు చెప్పారు. టెక్ రంగంలో ఉద్యోగాల పరిస్థితి ఘోరంగా ఉందని అభిప్రాయపడ్డారు.

భారత్‌లో 1000 మంది లేఆఫ్..?

క్వాల్‌కామ్ ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగుల్ని తగ్గించుకుంటోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 3000లకు పైగా ఉద్యోగుల్ని సాగనంపుతోంది. భారత్‌లో 1000 మంది ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది. బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, చెన్నై నగరాల్లో కలిపి క్వాల్‌కామ్ సుమారు 20,000 మందికి ఉపాధి కల్పిస్తోంది. ఇదిలా ఉంటే జనవరి 2027లో మరోసారి కోతలు ఉంటాయని కంపెనీ చెబుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Holiday Cancel: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రెండో శనివారం సెలవు క్యాన్సిల్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 14వ తేదీని వర్కింగ్ డేగా ప్రకటిస్తూ అధికారికంగా...

Goree Beauty Cream: భారత్‌లో పాకిస్తానీ ఫెయిర్‌నెస్ క్రీమ్.. వాడితే కిడ్నీలు ఖతం..

Goree Beauty Cream: భారత్‌లో పాకిస్తాన్‌తో వాణిజ్యంపై ఆంక్షలు ఉన్నప్పటికీ, ఆ...

AP Elections: ఎస్ఈసీ కీలక సమావేశం.. రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడలో...

CM Revanth Reddy: నీళ్ల నివాసాన్ని ఆక్రమిస్తే.. మన నివాసాలనే ఆక్రమిస్తాయి..

నీళ్ల నివాసాన్ని మనం ఆక్రమిస్తే, ఆ నీళ్లే మన నివాసాలను ఆక్రమిస్తాయని...