13
November, 2026

A News 365Times Venture

13
Friday
November, 2026

A News 365Times Venture

Holiday Cancel: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. రెండో శనివారం సెలవు క్యాన్సిల్..

Date:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నవంబర్ 14వ తేదీని వర్కింగ్ డేగా ప్రకటిస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. గత అక్టోబర్ 19న మహర్నవమి సందర్భంగా ప్రభుత్వం జనరల్ సెలవును ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సెలవు దినానికి బదులుగా నవంబర్ 14వ తేదీ రెండవ శనివారం అయినప్పటికీ ఉద్యోగులు విధులకు హాజరుకావాలని గతంలోనే ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ విషయంలో తాజాగా కొన్ని సవరణలు చేస్తూ ప్రభుత్వం మరో మెమోను విడుదల చేసింది.

అక్టోబర్ 19న దసరా సెలవు రోజున ఎన్నికల విధులు, దసరా ఉత్సవాలు, విజయవాడలో జరిగిన సరస్ (SARAS) మేళా వంటి అధికారిక బాధ్యతలలో ఉన్న సిబ్బంది ఆ సెలవును పూర్తిగా వినియోగించుకోలేకపోయారు. ఈ విషయాన్ని వివిధ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంతో, అప్పట్లో విధులకు హాజరైన ఆయా అర్హులైన ఉద్యోగులకు నవంబర్ 14న సెలవును వర్తింపజేయాలని నిర్ణయించారు.

సంబంధిత శాఖల అధిపతులు, కలెక్టర్లు , జిల్లా మేజిస్ట్రేట్లు ఈ వివరాలను పరిశీలించి కేవలం ఆ రోజు విధుల్లో ఉన్న ఉద్యోగులకు మాత్రమే ఆ రోజు సెలవు ఇవ్వాలని ఉత్తర్వులలో స్పష్టం చేశారు. ఈ మినహాయింపు కేవలం ఎన్నికలు మరియు పండుగ సమయాల్లో విధులను నిర్వర్తించిన వారికే వర్తిస్తుందని, మిగిలిన ఉద్యోగులందరూ యథావిధిగా నవంబర్ 14న విధులకు హాజరుకావాల్సి ఉంటుందని ప్రభుత్వం తేల్చిచెప్పింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Qualcomm Layoffs: ఐఐటీ డిగ్రీ, రూ. 26 లక్షల ప్యాకేజ్.. లేఆఫ్స్‌లో రోడ్డున పడ్డ ఇంజనీర్!

Qualcomm Layoffs: టెక్ ఉద్యోగులకు భరోసా లేకుండా పోయింది. చిన్న కంపెనీల...

Goree Beauty Cream: భారత్‌లో పాకిస్తానీ ఫెయిర్‌నెస్ క్రీమ్.. వాడితే కిడ్నీలు ఖతం..

Goree Beauty Cream: భారత్‌లో పాకిస్తాన్‌తో వాణిజ్యంపై ఆంక్షలు ఉన్నప్పటికీ, ఆ...

AP Elections: ఎస్ఈసీ కీలక సమావేశం.. రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడలో...

CM Revanth Reddy: నీళ్ల నివాసాన్ని ఆక్రమిస్తే.. మన నివాసాలనే ఆక్రమిస్తాయి..

నీళ్ల నివాసాన్ని మనం ఆక్రమిస్తే, ఆ నీళ్లే మన నివాసాలను ఆక్రమిస్తాయని...