12
November, 2026

A News 365Times Venture

12
Thursday
November, 2026

A News 365Times Venture

PRASHAST : ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.!

Date:

బడిలో చదువుతున్న ప్రతీ పిల్లాడూ ప్రత్యేకమే.. కానీ, కొందరు చిన్నారుల్లో ఉండే ప్రత్యేక అభ్యాసన లోపాలు లేదా దివ్యాంగత్వాన్ని సకాలంలో గుర్తించకపోతే వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో ‘ప్రశస్త్’ (PRASHAST) కార్యక్రమాన్ని అత్యంత కఠినంగా, ప్రాధాన్యతతో అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా తీసుకువచ్చిన ఈ సరికొత్త స్క్రీనింగ్ విధానంపై ఇప్పుడు విద్యా వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.

అసలు ఏంటి ఈ ‘ప్రశస్త్’?

3 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో ఉండే వివిధ రకాల దివ్యాంగత్వాలను, శారీరక లేదా మానసిక అభ్యాసన లోపాలను ముందస్తుగానే పసిగట్టడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ ‘ప్రశస్త్’ (Pre-Assessment Holistic Screening Tool) స్క్రీనింగ్ విధానాన్ని రూపొందించింది. దీని ద్వారా చిన్నారుల సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి, వారికి తగిన విద్యా సహాయం , వైద్య సదుపాయాలు అందించడానికి వీలు కలుగుతుంది.

ప్రైవేట్ యాజమాన్యాలకు కఠిన మార్గదర్శకాలు

ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పలు ఆదేశాలు జారీ చేశారు. యూడీఐఎస్ఈ+ (UDISE+) రికార్డుల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు అందరూ తప్పనిసరిగా ‘ప్రశస్త్’ పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వారితో పాటు పాఠశాలల్లోని ఉపాధ్యాయులు, ఇతర బోధనేతర సిబ్బంది కూడా ప్రిన్సిపాళ్ల లాగిన్ ద్వారా నిర్దేశించిన అవగాహన కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. అనంతరం పాఠశాలలో చదువుతున్న అర్హులైన విద్యార్థులందరికీ నిర్ణీత సమయంలోగా స్క్రీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు

ఈ మహత్తర కార్యక్రమం నిర్ణీత గడువులోగా పూర్తయ్యేందుకు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు పూర్తిస్థాయిలో సహకరించాలని ప్రభుత్వం కోరింది. ఒకవేళ ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేసినా, స్క్రీనింగ్ ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమైనా సంబంధిత ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ప్రత్యేక అవసరాలు ఉన్న చిన్నారుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం అమలులో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని తేల్చిచెప్పింది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Sonia Gandhi: సోనియా ప్రధాని కాకపోవడానికి కారణం వాళ్లే.. సంచలన విషయాలు వెలుగులోకి..

కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ తన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ...