11
November, 2026

A News 365Times Venture

11
Wednesday
November, 2026

A News 365Times Venture

Perni Nani: పులివెందులలో గెలిచింది ఇలాగేనా..? టీడీపీ అరాచకానికి పరాకాష్ట..!

Date:

Perni Nani: ఏపీలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలు టీడీపీ అరాచకానికి పరాకాష్టగా నిలిచాయని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. నామినేషన్ల ప్రక్రియతో ప్రారంభమైన అరాచకం డిక్లరేషన్ ఫారాల వరకు కొనసాగిందని ఆరోపించారు. టీడీపీకి చెందిన హంతకులు, గూండాలపై బైండోవర్ కేసులు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని పక్షవాతం వచ్చిన రోగిలా మార్చేశారని వ్యాఖ్యానించారు. వ్యవస్థలను నాశనం చేసి చంద్రబాబు ఏం సాధించాలనుకుంటున్నారని నిలదీశారు. దుశ్శాసన మూకలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాయని, చంద్రబాబు సృష్టించింది ప్రజాస్వామ్య విధ్వంసమని పేర్ని నాని ఆరోపించారు. పులివెందులలో టీడీపీ గూండాలు రిగ్గింగ్ చేసినట్లు చూపిస్తున్న వీడియోలు బయటకు వచ్చాయని పేర్కొన్నారు. అలాంటి పరిస్థితుల్లో సాధించిన విజయాన్ని కూడా నిజమైన గెలుపుగా పరిగణించాలా అని ప్రశ్నించారు. తాము కోరుతున్న పోలింగ్ కేంద్రాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని ఇచ్చే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని సవాల్ విసిరారు.

2021లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందని గుర్తుచేశారు నాని.. అప్పట్లో మంగళగిరి, తాడికొండలోనూ టీడీపీ పరాజయం పాలైందని అన్నారు. మరి ఇప్పుడు అమరావతికి వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని చంద్రబాబు అంగీకరిస్తారా అని ప్రశ్నించారు. మరోవైపు.. గ్రామకంఠం పేరుతో రాజధాని రైతులపై ఎందుకు కక్ష కట్టారని పేర్ని నాని ప్రశ్నించారు. రైతుల ఆస్తులు, పొలాలను నిర్దయగా కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, మంత్రి నారాయణ ఇళ్లు తప్ప అక్కడ మరెవరైనా ఇళ్లు నిర్మించుకుంటున్నారా అని నిలదీశారు. రాజధానిలోని 29 గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను పట్టించుకునే పరిస్థితి లేదా అని ప్రశ్నించారు. జగన్ హయాంలో చేసిన పనులు మినహా చంద్రబాబు శంకుస్థాపన చేసి ప్రారంభించిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా అని అడిగారు.

తుపానులను ఆపేస్తానని చెప్పిన చంద్రబాబు పాలనలో ఆర్ణబ్ తుపాను కారణంగా ప్రజలు ఎందుకు ప్రాణాలు కోల్పోయారని పేర్ని నాని ప్రశ్నించారు. మురసు తుపాను వల్ల నష్టపోయిన వారికి కనీసం నయాపైసా సాయం చేశారా అని నిలదీశారు. కరువుతో అల్లాడుతున్న రాయలసీమ, పల్నాడు ప్రాంత రైతులకు ప్రభుత్వం ఏం న్యాయం చేసిందని ప్రశ్నించారు. ఇక, పీ4 కార్యక్రమం వల్ల బాగుపడిన ఒక్క కుటుంబమైనా ఉందా అని పేర్ని నాని ప్రశ్నించారు. అమరావతిలోని కాంట్రాక్టర్లంతా మార్గదర్శకులుగా మారారని, చంద్రబాబు, లోకేష్ కుటుంబాలు మాత్రం బంగారు కుటుంబాలుగా ఉన్నాయని విమర్శించారు. ఇదేనా పీ4 కార్యక్రమం ద్వారా సాధించిన అభివృద్ధి అని ప్రశ్నించారు.

చంద్రబాబుకు యాభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్నా, ఆ అనుభవమంతా తప్పుడుదనమేనని పేర్ని నాని వ్యాఖ్యానించారు. 20 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారో వారి వివరాలను ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. దేశంలో చంద్రబాబులా అత్యంత చెత్త రాజకీయాలు నడిపేవారు మరెవరూ లేరని విమర్శించారు. ప్రతిపక్షాలను ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకోవడమేనా మంచి రాజకీయాలు అని ప్రశ్నించారు. బీసీలకు 34 శాతం టికెట్లు ఇస్తామని చెప్పి మోసం చేయడం సామాజిక న్యాయమా అని నిలదీశారు. దళితుల్లో ఎంతమందికి పదవులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కమ్మవారు ఎక్కువా, దళితులు ఎక్కువా అని ప్రశ్నిస్తూ, చంద్రబాబు మాటలతో కాలక్షేపం చేయకుండా ఏ కులానికి ఏ విధంగా న్యాయం చేశారో స్పష్టంగా చెప్పాలని అన్నారు. చంద్రబాబు నిర్వహించిన ప్రెస్‌మీట్ ఆత్మవంచనతో కూడుకున్నదని పేర్ని నాని విమర్శించారు. ఎన్నికల నిర్వహణ నుంచి అమరావతి, రైతుల సమస్యలు, తుపాను నష్టాలు, పీ4 కార్యక్రమం, ఉద్యోగాలు, సామాజిక న్యాయం వరకు పలు అంశాలపై ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు మాజీ మంత్రి, వైసీపీ సీనియర్‌ నేత పేర్ని నాని..

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

PRASHAST : ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.!

బడిలో చదువుతున్న ప్రతీ పిల్లాడూ ప్రత్యేకమే.. కానీ, కొందరు చిన్నారుల్లో ఉండే...

YS Jagan: రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు..! ప్రజాస్వామ్యం గురించి నీతులా? జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో పాలక, ప్రతిపక్షాల...

Former CM Returns Bulletproof Vehicle: 13 ఏళ్ల నాటి బుల్లెట్‌ప్రూఫ్ వాహనం.. ప్రభుత్వానికి తిరిగిచ్చిన మాజీ సీఎం!

Former CM Returns Bulletproof Vehicle: జార్ఖండ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి,...

Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..

Diwali Cleaning Tips: దేశం మొత్తం దీపావళి కాంతులతో వెలిగిపోతుంది.. అయితే,...