11
November, 2026

A News 365Times Venture

11
Wednesday
November, 2026

A News 365Times Venture

Former CM Returns Bulletproof Vehicle: 13 ఏళ్ల నాటి బుల్లెట్‌ప్రూఫ్ వాహనం.. ప్రభుత్వానికి తిరిగిచ్చిన మాజీ సీఎం!

Date:

Former CM Returns Bulletproof Vehicle: జార్ఖండ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు బాబులాల్ మారండీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తన భద్రత కోసం ప్రభుత్వం కేటాయించిన 13 ఏళ్ల నాటి బుల్లెట్‌ప్రూఫ్ వాహనం తరచూ మార్గమధ్యలోనే మొరాయిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఆ వాహనాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశారు. మాజీ ముఖ్యమంత్రుల భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు బాబులాల్ మారండీ లేఖ రాశారు. తన బుల్లెట్‌ప్రూఫ్ వాహనం పరిస్థితి అధ్వానంగా ఉందని 2026 మార్చి 21నే ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలియజేసినట్లు పేర్కొన్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ వాహనాన్ని మార్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తన భద్రతా వాహనాన్ని మార్చకుండా ఎవరి ఆదేశాల మేరకు అధికారులు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

కేవలం తన వాహనమే కాకుండా భద్రతా సిబ్బంది ఉపయోగించే జీపుల పరిస్థితి కూడా దారుణంగా ఉందని మారండీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ వాహనాలు సైతం పాతబడిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. ఈ విషయంపై డీజీపీ, ఐజీ, హోంశాఖ కార్యదర్శికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదని లేఖలో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా భద్రతా ఏర్పాట్లను కూడా మారండీ ప్రస్తావించారు. ఆయన కాన్వాయ్‌లోని వాహనాల దుస్థితి, నవంబర్ 6న జాతీయ రహదారి 33పై చౌకా సమీపంలో జరిగిన ప్రమాదాన్ని ఉదహరించారు. ముఖ్యమంత్రికి కొత్త, మెరుగైన వాహనాలు అందిస్తున్న ప్రభుత్వం.. మాజీ ముఖ్యమంత్రుల భద్రత విషయంలో మాత్రం ఎందుకు నిర్లక్ష్యం చేస్తోందని నిలదీశారు.

రాష్ట్రంలోని మాజీ ముఖ్యమంత్రులందరి భద్రతా వాహనాలను ఒకే ప్రమాణాలతో సమీక్షించాలని, తక్షణమే సురక్షితమైన, మెరుగైన బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలను కేటాయించాలని బాబులాల్ మారండీ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలకు సంబంధించి ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక నివేదిక ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ఒక కీలక ప్రశ్న సంధించారు. ప్రస్తుతం మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో మీరూ మాజీ ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడు మీకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ప్రభుత్వాన్ని ఎలాంటి జవాబుదారీతనంతో ప్రశ్నిస్తారని నిలదీశారు. తన భద్రత కోసం కేటాయించిన పాత బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయడం ఇప్పుడు జార్ఖండ్ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

PRASHAST : ప్రైవేట్ స్కూళ్లలో కొత్త స్క్రీనింగ్.. నిర్లక్ష్యం చేస్తే చర్యలు.!

బడిలో చదువుతున్న ప్రతీ పిల్లాడూ ప్రత్యేకమే.. కానీ, కొందరు చిన్నారుల్లో ఉండే...

Perni Nani: పులివెందులలో గెలిచింది ఇలాగేనా..? టీడీపీ అరాచకానికి పరాకాష్ట..!

Perni Nani: ఏపీలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలు టీడీపీ అరాచకానికి...

YS Jagan: రిగ్గింగ్ మాస్టర్ చంద్రబాబు..! ప్రజాస్వామ్యం గురించి నీతులా? జగన్ సంచలన వ్యాఖ్యలు

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంలో పాలక, ప్రతిపక్షాల...

Diwali Cleaning Tips: దీపావళి వేళ నూనె మరకలు జిడ్డుగా మారిపోయాయా? ఈ సింపుల్ చిట్కా చాలు..

Diwali Cleaning Tips: దేశం మొత్తం దీపావళి కాంతులతో వెలిగిపోతుంది.. అయితే,...