4
October, 2026

A News 365Times Venture

4
Sunday
October, 2026

A News 365Times Venture

PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!

Date:

PL-15E: ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ ప్రయోగించిన చైనా తయారీ PL-15E ఎయిర్-టు-ఎయిర్ మిసైల్‌ను భారత్ కూల్చేసింది. భారత సరిహద్దుల్లోనే ఈ క్షిపణిని ధ్వంసం చేసింది. అయితే, ఈ క్షిపణి భారత్‌కు చిక్కడంతో దీని పనితనం, దానిలో ఏ టెక్నాలజీ ఉపయోగించారనే దానిపై భారత్ రివర్స్ ఇంజనీరింగ్ చేస్తోంది. ఇదే సమయంలో జపాన్ కూడా ఈ మిస్సైల్ గురించి అడిగింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ క్షిపణి రహస్యాలపై ఫ్రాన్స్ ఆసక్తి కనబరుస్తోంది. సిందూర్ సమయంలో పంజాబ్‌లోని హోషియార్‌పూర్ సమీపంలో కూప్పకూలిన ఈ క్షిపణిని భారత రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నట్లు గతంలో అనేక నివేదికలు వెలువడ్డాయి.

PL-15Eలోని సీకర్, గైడెన్స్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్లు, కమ్యూనికేషన్ విధానం వంటి అంశాలను అధ్యయనం చేయడం ద్వారా ఈ చైనీస్ మిస్సైల్ దాని లక్ష్యాలను ఎలా గుర్తిస్తుందనే దానిపై, దాని సిగ్నల్స్‌ను ఎలా ఎదుర్కోవచ్చు అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయి.

ఇదిలా ఉంటే, జపాన్ తర్వాత ఫ్రాన్స్ కూడా భారత్‌కు చిక్కిన ఈ PL-15E సంబంధిత సమాచారంపై ఆసక్తి చూపుతోంది. ఫ్రెంచ్ వైమానిక దళం ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం ఎలా సత్తా చాటిందనే దానిపై అధ్యయనం చేస్తోంది. ఈ విషయాన్ని ఫ్రెంచ్ ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్స్ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ డొమినిక్ టార్డిఫ్ ఇటీవల వెల్లడించారు. రాఫెల్ యుద్ధవిమానాల కోసం లాంగ్ రేంజ్ ఎయిర్ టూ ఎయిర్ మిస్సైల్ అభివృద్ధి చేసే అవకాశాలను ఫ్రాన్స్ పరిశీలిస్తోంది.

భారత్ వద్ద ఇప్పటికే రాఫెల్, సుఖోయ్ సుఖోయ్-30MKI, తేజస్ వంటి యుద్ధవిమానాలు ఉన్నాయి. మరోవైపు, పాకిస్తాన్ తన వైమానికదళం ఉపయోగించే చైనా తయారీ J-10C, JF-17 యుద్ధ విమానాలతో ఈ PL-15 క్షిపణుల్ని అనుసంధానించింది. PL-15Eపై భారత అధ్యయనం తర్వాత స్వదేశీ టెక్నాలజీతో రూపొందిస్తున్న అస్త్రా Mk-2లో ఈ టెక్నాలజీని4 ఉపయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో చైనా వైమానిక ఆయుధాల సామర్థ్యాన్ని అధ్యయనం చేసేందుకు ఒక సాంకేతిక అవకాశం లభించినట్లైంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లోని శాసనసభ్యుల్లో 50 శాతం మంది యువతేనని మంత్రి...

UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!

UP Election: 2027 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)-కాంగ్రెస్...

Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!

Flydubai Terror Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమాన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా...

CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..

CJP: CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా...