3
July, 2026

A News 365Times Venture

3
Friday
July, 2026

A News 365Times Venture

Perni Nani: ఇంతకీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? లడ్డూ వివాదంపై పేర్ని నాని ఆగ్రహం

Date:

Perni Nani: కూటమి ప్రభుత్వం ముసుగులో నారా చంద్రబాబు ప్రభుత్వం ఉందని.. ఇంతకీ చంద్రబాబు, పవన్, మాధవ్, కేశవ్ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.. లడ్డూ వివాదంపై తాజాగా మాజీ మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. కేశవ్ తన ఆర్థిక శాఖ గురించి, ప్రభుత్వ అప్పుల గురించి పట్టదు. ఆ శాఖను ఆయన నడుపుతారా.. చంద్రబాబు నడుపుతారా తెలియదన్నారు.. కెమికల్స్ కలిపి ఆవు నెయ్యి కలిపారని చెప్పిన కేశవ్.. తక్కువ ధరలకు నెయ్యి కొన్నారు కాబట్టి అది కల్తీ నెయ్యి అంటున్నారన్నారు.. వారి ప్రభుత్వంలోనే హర్ష్ డెయిరీని ఇన్స్పెక్షన్ చేసి అన్నీ సంతృప్తికరంగా ఉన్నాయని అప్రూవ్ చేశారని ఆరోపించారు. అక్టోబర్ 2018 మాకేం సంబంధం.. ఫిబ్రవరి 2019 మాకేం సంబంధం అన్నారన్నారు.. మరి మే 2019 లో కేబినెట్ ఎలా పెట్టారు? అని ప్రశ్నించారు. మీ ఆపద్ధర్మ ప్రభుత్వంలో చాలా నిర్ణయాలు కూడా తీసుకున్నారు.. హర్ష్ ఫ్రెష్ డెయిరీ నుంచి 291 రూపాయలకు టీడీపీ కొనుగోలు చేసింది.. మరి ఇది భోలే బాబా డెయిరీ నే కదా? అని నిలదీశారు. 319, 329 తప్పన్నారు.. తాము రావటానికి రెండు నెలల ముందు 291కి వాళ్ళు ఎలా కొనుగోలు చేశారని చెప్పారు..

READ MORE: CM Revanth Reddy : వ్యవసాయం దండుగ కాదు.. పండుగ చేసి చూపిస్తాం.!

2014 – 19 మధ్య హర్ష్ ఫ్రెష్ డెయిరీ నుంచి కొన్నారు.. మీ ప్రభుత్వం సమయంలో మీ సొంత సంస్థ హెరిటేజ్ రేట్లు ఎలా ఉన్నాయో చెప్పే ధైర్యం మీకు ఉందా? అని మాజీ మంత్రి పేర్ని నాని నిలదీశారు. “హెరిటేజ్ కంపెనీలో ప్రతీ ఆరు నెలలకు రేటు ఎలా ఉందో చెప్పండి.. ఎవరు అపచారం చేశారో.. ఎవరు హిందువో.. ఎవరు ఏంటో అర్థం అవుతుంది.. పవన్ ఉచ్ఛం.. నీచం లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. పవన్ కళ్యాణ్ ఎన్ని మతాలు మారారు.. తమ్ముడు కోటింగ్ ఇచ్చిన తర్వాత ఒక అన్నయ్య మాట్లాడారు.. సనాతన హిందువు అని చెప్పుకునే పవన్, నాగబాబుకు దేవుడంటే భయం లేదు.. భక్తి లేదు. జగన్ మీరు మా మతం జోలికి రావొద్దు అంటూ దిగజారి మాట్లాడారు.. మీ ప్రభుత్వం హాయంలో పెంటపాడులో తగలబడ్డ రథం ముద్దాయిని ఇప్పటి వరకు పట్టుకున్నారా? 250 ఆలయాలు ధ్వంసం చేశారని చంద్రబాబు మాట్లాడారు.. మీ హయంలో విజయవాడలో ఎన్ని ఆలయాలు ధ్వంసం చేశారు.. ఎంత నీచంగా ఆలయాలు, గర్భ గుడుల్లో విగ్రహాలు కూడా కూల్చివేశారు.. మీరు కూలదోసిన ప్రతీ ఆలయాన్ని పునః ప్రతిష్ట జేసింది జగన్ కాదా? పవన్ కళ్యాణ్ అయోధ్యకు యానిమల్ ఫ్యాట్‌తో తయారు చేసిన లక్ష లడ్డూలు సప్లై చేశారు.. దేశం మొత్తం తినిపించారు అని నీచంగా మాట్లాడారు.. పాలకమండలి సభ్యులు మహారాష్ట్రకు చెందిన సౌరభ్ గోరా, మైహోమ్స్ రామేశ్వరరావులు నెయ్యి వారే ఇచ్చి లడ్డూలు తయారు చేయించారు.. బూట్లు వేసుకుని దేవుడికి కొబ్బరి కాయలు కొట్టి, పూజలు చేసే చంద్రబాబు.. తల్లిదండ్రులు చనిపోతే జుట్టు కూడా ఇవ్వనివాడు హిందూ ధర్మాన్ని గౌరవించేవారు.. జగన్‌ను ప్రజల ద్వారా గెలవలేక నిందించటమే పనిగా పెట్టుకున్నారు.. రాజధానికి భూములు ఇచ్చిన రైతులను నానా ఇబ్బందులు పెడుతుంది ఎవరు.. రాజకీయాల్లో పతనానికి పరాకాష్టలా ఇవాళ చంద్రబాబు, పవన్ మాట్లాడిన మాటలు..” అని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

READ MORE: Bhumana Karunakar Reddy: స్వామికి చంద్రబాబు ఒక్కడే భక్తుడా? టీటీడీ మాజీ ఛైర్మన్ ఫైర్

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్‌పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన

WhatsApp Username Feature: వాట్సాప్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న యూజర్‌నేమ్ ఫీచర్‌పై...

Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Schools and Colleges Closed: భారీ వర్షాలు మహారాష్ట్రలో చాలా ప్రాంతాల్లో...

Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!

Jeans Cleaning Tips: జీన్స్ అనేది దాదాపు ప్రతి ఒక్కరి వార్డ్‌రోబ్‌లో...

Congress vs BRS: తెలంగాణ భవన్‌ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్‌ రావును అడ్డుకున్న పోలీసులు!

Congress vs BRS: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి...