3
July, 2026

A News 365Times Venture

3
Friday
July, 2026

A News 365Times Venture

WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్‌పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన

Date:

WhatsApp Username Feature: వాట్సాప్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న యూజర్‌నేమ్ ఫీచర్‌పై నెలకొన్న సందేహాలకు మెటా సంస్థ స్పష్టత ఇచ్చింది. ఈ ఫీచర్ వల్ల సైబర్ మోసాలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పలు కీలక ప్రశ్నలకు సమాధానాలు వెల్లడించింది. ఇటీవల ఈ ఫీచర్‌పై ప్రభుత్వం నోటీసు జారీ చేసిన నేపథ్యంలో దీనిపై చర్చ మరింత పెరిగింది. మెటా వెల్లడించిన వివరాల ప్రకారం.. వాట్సాప్‌లో యూజర్‌నేమ్ సృష్టించడం పూర్తిగా ఐచ్ఛికం. వినియోగదారులు కోరుకుంటే మాత్రమే యూజర్‌నేమ్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉపయోగంలో ఉన్న కొన్ని యూజర్‌నేమ్‌లు, అలాగే ప్రముఖులు, ప్రభుత్వ సంస్థలు, ధృవీకరించబడిన ఖాతాలకు సంబంధించిన పేర్లు రక్షితంగా ఉంటాయని కంపెనీ తెలిపింది.

ప్రస్తుతం అందుబాటులో లేదు..

యూజర్‌నేమ్‌లను ఉపయోగించి సందేశాలు పంపే సదుపాయం ప్రస్తుతం అందుబాటులో లేదని వాట్సాప్ స్పష్టం చేసింది. ఈ ఫీచర్ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త వ్యక్తి సందేశం పంపితే, అతని దేశ వివరాలతో పాటు హెచ్చరిక సందేశం కూడా కనిపిస్తుందని తెలిపింది. అంతేకాకుండా అనుమానాస్పద ఖాతాలు, మోసపూరిత కార్యకలాపాలను నిరంతరం పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

యూజర్‌నేమ్‌ తెలుసుకున్నా మెసేజ్‌ చేయలేరు..?

యూజర్‌నేమ్‌ను ఎవరైనా తెలుసుకున్నంత మాత్రాన మీకు నేరుగా సందేశాలు పంపలేరని కూడా కంపెనీ స్పష్టం చేసింది. వాట్సాప్‌లో యూజర్‌నేమ్‌లను నేరుగా శోధించే అవకాశం ఉండదని, అదనపు భద్రత కోసం “యూజర్‌నేమ్ కీ” అనే ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్‌ను కూడా అందిస్తున్నట్లు వెల్లడించింది. ఈ కీని వినియోగదారులు ఎప్పుడైనా మార్చుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.

అలా అయితే లింక్‌ చేయాల్సిందే..!

అదే యూజర్‌నేమ్‌ను ఫేస్‌బుక్ లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉపయోగించాలనుకుంటే ఆయా ఖాతాలను లింక్ చేయాల్సి ఉంటుందని మెటా పేర్కొంది. అయితే, పూర్తిగా కొత్త యూజర్‌నేమ్‌ను కూడా ఎంచుకోవచ్చని స్పష్టం చేసింది. అలాగే యూజర్‌నేమ్‌ను భవిష్యత్తులో అవసరమైతే మార్చుకునే అవకాశం కూడా ఉంటుందని తెలిపింది.

రిజర్వ్‌ చేయడం సాధ్యం కాదు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నట్లుగా ప్రముఖుల పేర్లను ఎవరైనా ముందుగానే రిజర్వ్ చేసుకోవడం సాధ్యం కాదని మెటా ఖండించింది. ఆ పేర్లను ఆయా అసలు యజమానులు లేదా ధృవీకరించబడిన ఖాతాలే ఉపయోగించగలవని వివరించింది. వినియోగదారుల అభిప్రాయాలను సేకరించిన తర్వాత ఈ ఏడాది చివర్లో యూజర్‌నేమ్ ఫీచర్‌ను అధికారికంగా అందుబాటులోకి తీసుకురావాలని సంస్థ యోచిస్తోంది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు

Schools and Colleges Closed: భారీ వర్షాలు మహారాష్ట్రలో చాలా ప్రాంతాల్లో...

Jeans Cleaning Tips: కొత్త జీన్స్ త్వరగా పాతబడుతుందా..? అసలు కారణం మీ ఉతికే విధానమే..!

Jeans Cleaning Tips: జీన్స్ అనేది దాదాపు ప్రతి ఒక్కరి వార్డ్‌రోబ్‌లో...

Congress vs BRS: తెలంగాణ భవన్‌ దగ్గర ఉద్రిక్తత.. హరీశ్‌ రావును అడ్డుకున్న పోలీసులు!

Congress vs BRS: కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి...