16
October, 2026

A News 365Times Venture

16
Friday
October, 2026

A News 365Times Venture

Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!

Date:

Off The Record: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన నేతలు, కార్యకర్తలకు ఆశాభంగం జరిగిందట. ఆశించినన్ని సీట్లు కేటాయించే పరిస్థితి కూటమిలో లేకపోవడంతో కార్యకర్తలు డీలా పడ్డారట. పోటీ చేద్దామని ఉవ్విళ్లూరిన నాయకులు ఉసూరుమన్నారట. ఇటు సీట్లు దక్కక కొందరు… అటు రిజర్వేషన్లు కలసిరాక మరికొందరు అయోమయంలో పడ్డారట. జనసేన నాయకులు, కేడర్‌లో అంతర్మథనం జరుగుతోందట. ఎప్పుడూ పల్లకీ మోయడమేనా..? పదవులకు మాత్రం మనం కనిపించమా..? బలం ఏంటో చూపించినా పట్టించుకోరా..? అంటూ రగిలిపోతున్నారట. కూటమిలో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య సీట్‌ షేరింగ్‌ లెక్కలు ఇంకా తేలలేదు. అయితే… ఒకటి మాత్రం స్పష్టమైంది. జనసేన డిమాండ్‌ చేసినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేదని గల్లీ లీడర్‌ నుంచి అందరికీ ఓ క్లారిటీ అయితే వచ్చింది. దాంతో పార్టీ కార్యకర్తల్లో అంతర్గత చర్చలు మొదలయ్యాయట.

క్షేత్రస్థాయిలో బలాబలాలు పరిశీలించడానికి కమిటీలు వేసి, అంత కసరత్తు జరిపి, ఇదిగో మా బలం అని చూపించినా, సీట్లు పెరగలేదంటూ చర్చించుకుంటున్నారట. కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి జనసేన కారణం కదా అనుకుంటున్నారట. సర్దుబాటు అంటే జనసేన కేడర్ సర్దుకుపోవడమేనా అని నిట్టూర్పులూడుస్తున్నారట జనసైనికులు. పల్లకీలు మోయడమే తప్ప… పల్లకీలో కూర్చునే అవకాశమే రాదా..? అని నిరాశ వ్యక్తం చేస్తున్నారట. ప్రభుత్వంలో ఉన్నాం… కలిసి పని చేద్దాం అంటారే కానీ… కలిసి పదవులు తీసుకుందాం అనే మాటలు ఎందుకు రావు..? అని మదనపడుతున్నారట ఆ పార్టీ నేతలు. క్షేత్రస్ధాయిలో తాము కనుక పని చేయకపోయి ఉంటే కూటమి ప్రభుత్వం ఏర్పడేదా..? అని ఆగ్రహం, అసహనం, అసంతృప్తి ఏకకాలంలో వ్యక్తం చేస్తున్నారట జనసేన నాయకులు, కార్యకర్తలు. స్థానిక సమరంలో అవకాశాలు దక్కుతాయని ఎదురు చూసినప్పటికీ… నిరాశే మిగిలిందని అంటూ లోలోపల చెప్పుకుని తెగ బాధపడిపోతున్నారట.

పార్టీ ఆవిర్భావం నాటి నుంచీ కష్టపడి పని చేశామంటున్నారు జనసైనికులు. గత స్థానిక ఎన్నికల్లోనూ సొంతంగా గెలిచి చూపించామని గుర్తు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడీ పరిస్ధితేంటి అని బాధపడిపోతున్నారట. ఎందుకు ఈ భంగపాటు అని తోటి కార్యకర్తలు, నాయకుల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారట. అధిక సంఖ్యలో సీట్లు సాధిస్తామంటూ మీటింగ్‌లు పెట్టి మరీ చెప్పారు. సొంతంగా పోటీ చేసినా చాలా స్థానాల్లో గెలుస్తామని కమిటీలు నివేదికలు ఇచ్చాయి. మరి ఎందుకు తగ్గడం అనే కోణంలో కేడర్‌ చర్చలు జరుపుతోందట‌‌. గత స్థానిక ఎన్నికల్లో గెలిచి చూపించిన చోట మరోసారి పోటీ చేసి గెలవగలం అనుకుంటున్నారట. మరి జనసేనలో ఈ అంతర్మథనం ఎటు దారి తీస్తుందో..? స్థానిక సమరంలో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి కేసులో బిగ్ ట్విస్ట్!

ప్రముఖ హాలీవుడ్ నటుడు, ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే మృతి...

SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కీలక మార్పు చేసింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో...

Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!

Tectonic plate movement: బద్ధ శత్రువులు, కోల్డ్ వార్ సమయంలో ఘర్షణ...