15
October, 2026

A News 365Times Venture

15
Thursday
October, 2026

A News 365Times Venture

Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!

Date:

Tectonic plate movement: బద్ధ శత్రువులు, కోల్డ్ వార్ సమయంలో ఘర్షణ పడిన అమెరికా, రష్యాలు భవిష్యత్తులో కలిసిపోయే అవకాశం ఉంది. అయితే ఇది ఎలా సాధ్యమంటే, ఈ రెండు దేశాల భూభాగాలు కోట్ల సంవత్సరాల తర్వాత కలిసే అవకాశం ఉంది. ఈ రెండు కలిసి ‘‘సూపర్ కాంటినెంట్’’ ఏర్పడుతుందని రష్యన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలా ఎలా కలిసిపోతాయని చాలా మంది అనుకుంటారు. మనం చూస్తున్నట్లు భూభాగం ఒకే దగ్గర స్థిరంగా ఉండదు. భూమి కింద ఉండే ‘‘టెక్టానిక్ ప్లేట్లు’’ నిరంతరం కదులుతూ ఉంటాయి.

మనం ఉంటున్న భూమి అనేక పొరలుగా విభజించబడి ఉంటుంది. భూ ఉపరితలం చాలా గట్టిగా ఉన్నప్పటికీ, ఇది మాంటెల్ అనే మొత్తని పొరపై తేలుతూ నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. ఇవి ప్రతీ ఏడాది కొన్ని సెంటీమీటర్లు మాత్రమే కదులుతాయి. కానీ కొన్ని కోట్ల ఏళ్ల తర్వాత ఈ దూరం సెంటీమీటర్ల నుంచి కిలోమీటర్లకు పెరుగుతుంది.

రష్యన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ యొక్క స్టేట్ జియోలాజికల్ మ్యూజియం డైరెక్టర్ అయిన సెర్గీ చెర్కాసోవ్ ప్రకారం, భూమి ఉపరితలం గతలో అనుకున్నదాని కన్నా వేగంగా మారుతోంది. ఖండాలు కలిసి ఒక సూపర్ కాంటినెంట్ ఏర్పడి, ఆ తర్వాత మళ్లీ విడిపోతాయి. ఈ చక్రం ప్రతీ 400-600 మిలియన్ సంవత్సరాలకు ఒకసారి పునరావృతమవుతుంది.

సూపర్ కాంటినెంట్ ఏర్పాటు..

ఖండాలు కలవడానికి అత్యంత అనుకూలమైన మార్గం అట్లాంటిక్ మహాసముద్రంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అట్లాంటిక్ క్రమంగా కుచించుకుపోతోంది. అమెరికా, ఐరోపా, ఆసియా ఖండాలు క్రమంగా ఒకదానితో ఒకటి దగ్గరవుతున్నాయి. దీని వల్ల అంటార్కిటికా మినహా అన్ని ఖండాలు ఉత్తరార్థగోళంలో ఒక మహా ఖండాన్ని ఏర్పాటు చేస్తాయి. ఈ క్రమంలో యూరప్, ఆసియాలోని చాలా భాగం రెండుగా విడిపోతుంది. బైకాల్ సరస్సు చుట్టూ ఉ న్న ‘‘పాన్-ఏషియన్ రిఫ్ట్’’ వెంబడి ఈ విభజన జరుగుతుందని అంచనా. రష్యాలోని అతిపెద్ద భాగం ఉత్తర అమెరికాతో కలిసే ఛాన్స్ ఉంది.

ఎప్పటి వరకు జరుగుతుంది.? ఎలాంటి ప్రభావం ఉంటుంది..?

ఈ ప్రక్రియకు సుమారు 20-30 కోట్ల సంవత్సరాలు పట్టవచ్చు. గతంలో భూమిపై ‘‘పాంజియా’’ అనే భారీ ఖండం ఉండేది. ఆ తర్వాత టెక్టానిక్ ప్లేట్ల కదలికలతో నేడు ఉన్న ఖండాలు ఏర్పడ్డాయి. భవిష్యత్తులో ఇవన్నీ మళ్లీ కలిసి ఒక మహా ఖండాన్ని ఏర్పాటు చేస్తాయి. ప్రస్తుతం పేట్ల కదలికలను ఉపగ్రహాలు, జీపీఎస్ కొలతలు, భూకంప అధ్యయనాల ద్వారా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Jana Sena Party: జనసేనలోకి పలువురు వైసీపీ నేతలు, ప్రముఖులు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కల్యాణ్‌..

Jana Sena Party: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రాజకీయ...

Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీని వెంబడిస్తున్న కేసులు.. కోర్టు సమన్లు జారీ..

Dhruv Rathee: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీని పాత కేసులు వెంబడిస్తున్నాయి....

Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..

రాబోయే పండుగల సీజన్‌లో చక్కెర కృత్రిమ కొరతను నివారించి, వినియోగదారులకు అందుబాటు...