29
September, 2026

A News 365Times Venture

29
Tuesday
September, 2026

A News 365Times Venture

New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..

Date:

దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోని ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ శుభవార్తను అందించింది. మచిలీపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూలు సిటీ వరకు నూతనంగా ఒక ట్రై-వీక్లీ (వారానికి మూడు రోజులు నడిచే) ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టడానికి ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంతాలకు, మధ్య ప్రాంతాలకు మధ్య ప్రయాణ సౌకర్యాలను మరింత సులభతరం చేయడానికి ఈ రైలు ఎంతగానో ఉపయోగపడుతుంది. గుడివాడ, వినుకొండ, నంద్యాల వంటి ప్రధాన ప్రాంతాలకు ఈ రైలు ద్వారా నేరుగా రైలు సౌకర్యం లభించనుంది.

మచిలీపట్నం – కర్నూలు సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు మొత్తం 499 కిలోమీటర్ల దూరం కవర్ చేస్తుంది. ఈ రైలు మచిలీపట్నంలో సాయంత్రం 16:55 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 05:45 గంటలకు కర్నూలు సిటీకి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కర్నూలు సిటీ – మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ ఉదయం 09:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 21:35 గంటలకు మచిలీపట్నానికి చేరుకుంటుంది.

ఈ నూతన రైలు సేవలు మచిలీపట్నం నుంచి సోమవారం, బుధవారం, శనివారాలలో అందుబాటులో ఉంటాయి. అలాగే కర్నూలు సిటీ నుంచి మచిలీపట్నానికి మంగళవారం, గురువారం, ఆదివారాలలో నడుస్తాయి. ఈ ప్రయాణ మార్గంలో ఈ రైలు గుడివాడ, విజయవాడ, నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపూర్ రోడ్, కంబమ్, గిద్దలూరు, దిగువమెట్ట, నంద్యాల, బేతంచెర్ల మరియు డోన్ వంటి మొత్తం 12 ప్రధాన స్టేషన్లలో కమర్షియల్ స్టాపేజీలను కలిగి ఉంటుంది.

ఈ కొత్త రైలు సర్వీసు ప్రారంభం కావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులకు అదనపు ప్రయాణ సౌలభ్యం కలగడమే కాకుండా.. మచిలీపట్నం, విజయవాడ , కర్నూలు సిటీల మధ్య కనెక్టివిటీ మరింత బలపడుతుంది. అంతేకాకుండా.. ఈ మార్గంలోని పలు పట్టణాలు , నగరాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులకు రవాణా సౌలభ్యం మెరుగవుతుంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..

అమరావతిలో అక్టోబర్ 1వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచే లబ్ధిదారుల...

WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..

మహిళా ప్రీమియం లీగ్ 2027 సీజన్‌కు సంబంధించి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్...

Shubman Gill: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్..

భారత క్రికెట్ జట్టు యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి అద్భుతమైన...