29
September, 2026

A News 365Times Venture

29
Tuesday
September, 2026

A News 365Times Venture

Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్‌ లాంచ్.!

Date:

Ai+ Pulse 2 FE, NovaTab and Nova LapTab: పండుగ సీజన్‌కు ముందు భారత్‌లో Ai+ కంపెనీ Ai+ Pulse 2 FE స్మార్ట్‌ఫోన్, Ai+ నోవా ట్యాబ్, Ai+ నోవా లాప్ ట్యాబ్ ట్యాబ్లెట్లను విడుదల చేసింది. ఈ మూడు డివైజ్‌లు ఆండ్రాయిడ్ 16 ఆధారంగా కంపెనీకి చెందిన nxtQ OSపై పనిచేస్తాయి. 5G ట్యాబ్లెట్ విభాగంలోకి Ai+ తొలిసారి అడుగుపెట్టింది.

కొత్త డివైజ్‌ల అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 7, 2026 రాత్రి 11:59 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ నుంచి విద్యార్థులు, మొబైల్ ప్రొడక్టివిటీ అవసరాలకు ఉపయోగపడే ట్యాబ్లెట్ల వరకు ఈ లైనప్‌ను కంపెనీ తీసుకొచ్చింది.

Ai+ Pulse 2 FE..

Ai+ పల్స్ 2 FEలో 6.67 అంగుళాల HD+ IPS డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. పంచ్-హోల్ డిజైన్‌లో 8MP ఫ్రంట్ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో G81 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి 4GB ర్యామ్, 64GB స్టోరేజ్ జత చేశారు. మైక్రోSD కార్డు ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు. వెనుక భాగంలో 50MP AI కెమెరాను అందించారు. HDR సపోర్ట్ కూడా ఉంది. 5,000mAh బ్యాటరీకి 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, సైడ్-మౌంటెడ్ కెపాసిటివ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యూయల్ మైక్రోఫోన్ నాయిస్ క్యాన్సిలేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రీన్, పర్పుల్ రంగుల్లో లభిస్తుంది.

Ai+ NovaTab..

విద్యార్థులు, ఆన్‌లైన్ క్లాసులు, రిమోట్ ఎడ్యుకేషన్‌ను దృష్టిలో పెట్టుకుని Ai+ నోవా ట్యాబ్ ను రూపొందించారు. ఇందులో 11.97 అంగుళాల డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. 5G, Wi-Fi కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తుంది. ఈ ట్యాబ్లెట్‌లో 2.2GHz వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేసే ఆక్టా-కోర్ T760 ప్రాసెసర్, Arm Mali-G57 MC4 GPU ఉన్నాయి. 6GB లేదా 8GB ర్యామ్ వేరియంట్లలో 128GB స్టోరేజ్‌తో వస్తుంది. 13MP వెనుక కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా, డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఇందులో ఉన్నాయి. 8,000mAh బ్యాటరీకి 18W ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. డార్క్ బ్లూ, సిన్నమన్ బ్రౌన్ రంగుల్లో లభిస్తుంది.

Ai+ Nova LapTab..

ప్రొడక్టివిటీ, మీడియా వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని Ai+ నోవా లాప్ ట్యాబ్ ను తీసుకొచ్చారు. ఇందులో 13.2 అంగుళాల 2.4K డిస్‌ప్లే ఉంది. 2400×1600 పిక్సెల్స్ రిజల్యూషన్, 3:2 యాస్పెక్ట్ రేషియో, 450 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్, 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్నాయి. స్టైలస్ ఇన్‌పుట్‌తో పాటు అటాచ్ చేసుకునే ఫిజికల్ కీబోర్డ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. దీంతో ట్యాబ్లెట్‌ను అవసరాన్ని బట్టి ల్యాప్‌టాప్ తరహాలో ఉపయోగించుకోవచ్చు.

ఇందులో 2.5GHz వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేసే ఆక్టా-కోర్ మీడియాటెక్ MT8755 ప్రాసెసర్ ఉంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ అందించారు. మైక్రోSD ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు. క్వాడ్ స్పీకర్ సెటప్, 5G కనెక్టివిటీ, 16MP రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 10,000mAh బ్యాటరీకి 33W ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. టీల గ్రీన్, డార్క్ బ్లూ రంగుల్లో ఈ డివైజ్ లభిస్తుంది.

ధరలు..

* Ai+ Pulse 2 FE 4GB + 64GB వేరియంట్ ధర రూ.9,999గా నిర్ణయించారు.

* Ai+ NovaTab 6GB + 128GB వేరియంట్ రూ.17,999, 8GB + 128GB వేరియంట్ రూ.20,999 ధరకు లభిస్తుంది. ఈ ధరల్లో బ్యాంక్ ఆఫర్లు కూడా కలిపి ఉన్నాయి.

* Ai+ Nova LapTab 8GB + 128GB వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. ఈ ధరలోనూ బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి.

మూడు డివైజ్‌ల అమ్మకాలు అక్టోబర్ 7, 2026 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమవుతాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..

దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోని ప్రయాణికులకు భారతీయ రైల్వే శాఖ...

Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..

అమరావతిలో అక్టోబర్ 1వ తేదీ ఉదయం 6:30 గంటల నుంచే లబ్ధిదారుల...

WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..

మహిళా ప్రీమియం లీగ్ 2027 సీజన్‌కు సంబంధించి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్...

Shubman Gill: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్‌మన్ గిల్.. సెంచరీతో కదం తొక్కిన కెప్టెన్..

భారత క్రికెట్ జట్టు యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి అద్భుతమైన...