7
August, 2026

A News 365Times Venture

7
Friday
August, 2026

A News 365Times Venture

Nathan Thomas: 306 ఏళ్ల నాటి గిన్నిస్ రికార్డ్ బద్దలు.. 18 ఏళ్లకే ప్రొఫెసర్‌గా మారిన కుర్రాడు..

Date:

Nathan Thomas: సాధారణంగా 18 ఏళ్ల వయసంటే ఏ డిగ్రీ కాలేజీలోనో చేరి, ఫ్రెండ్స్‌తో సరదగా కాలక్షేపం చేస్తూ భవిష్యత్తు గురించి అప్పుడప్పుడే ఆలోచించడం మొదలుపెడతారు. కానీ, అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన నాథన్ థామస్ కథ మాత్రం వేరు! 18 ఏళ్ల 346 రోజుల వయసులోనే అతడు ప్రొఫెసర్‌గా మారి, బోధనా రంగానికే సరికొత్త పాఠం నేర్పాడు. మైయామి డేడ్ కాలేజీలో ఇంజినీరింగ్ పాఠాలు చెబుతూ, ఏకంగా 306 ఏళ్ల నాటి గిన్నిస్ వరల్డ్ రికార్డును తిరగరాశాడు. అత్యంత పిన్న వయసులో పురుషుల విభాగంలో ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. 1717లో స్కాటిష్ గణితశాస్త్రవేత్త కోలిన్ మెక్లారిన్ 19 ఏళ్ల వయసులో నెలకొల్పిన రికార్డును నాథన్ దాటేయడం విశేషం.

నాథన్ మేధస్సు వెనుక ఒక అసాధారణమైన ప్రయాణం ఉంది. కేవలం 10 ఏళ్ల చిన్నారి వయసులోనే ‘డ్యూయల్ ఎన్‌రోల్‌మెంట్’ ప్రోగ్రామ్ ద్వారా మైయామి డేడ్ కాలేజీలో చేరి, తన పాఠశాల విద్యతో పాటు కాలేజీ చదువును కూడా ముందుకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత 14 ఏళ్లకే ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి మారి, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీలను అత్యుత్తమ ప్రతిభతో పూర్తిచేశాడు. ఏదైతే కాలేజీలో చిన్నప్పుడు విద్యార్థిగా అడుగుపెట్టాడో, అదే మైయామి డేడ్ కాలేజీకి 2023 ఆగస్టులో ఫ్యాకల్టీ మెంబర్‌గా తిరిగొచ్చాడు. అక్కడ విద్యార్థులకు ‘COP 2270: C ఫర్ ఇంజినీర్స్’ కోర్సును బోధిస్తూ, C-ప్రోగ్రామింగ్, కంప్యూటేషనల్ ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో మెళకువలు నేర్పిస్తున్నాడు.

తనతో సమానమైన వయస్సున్న వారికి పాఠాలు చెప్పడం నాథన్‌కు ఎప్పుడూ ఇబ్బందిగా అనిపించలేదట. నేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం లేదని, ఆసక్తి, నిబద్ధత మాత్రమే ముఖ్యమని నమ్మే నాథన్, తరగతి గదిలో ప్రతీ ఒక్కరి లక్ష్యం జ్ఞానాన్ని పెంచుకోవడమేనని అంటున్నాడు. కష్టమైన కాన్సెప్టులను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకున్నప్పుడు పొందే తృప్తి మరేదో ఇవ్వలేదంటాడు. నాథన్ ఇంజినీరింగ్ వైపు అడుగులు వేయడానికి అతని కుటుంబ నేపథ్యం కూడా ఒక కారణం. ముఖ్యంగా తన తల్లి చిన్నప్పుడే గణితాన్ని ఒక ఆటలా నేర్పిస్తూ, సైన్స్ పట్ల ఆసక్తి పెంచేలా చేసిందని ఆయన గుర్తుచేసుకుంటాడు. ఇంతటితో నాథన్ ప్రయాణం ఆగిపోలేదు. ఇంజినీరింగ్ బోధిస్తూనే మరోవైపు యూనివర్సిటీ ఆఫ్ మైయామి స్కూల్ ఆఫ్ లాలో ‘జూరిస్ డాక్టర్’ (లా) డిగ్రీ చదువుతున్నాడు. 2028లో పూర్తికానున్న ఈ కోర్సు ద్వారా ‘ఇంటలెక్చువల్ ప్రాపర్టీ లా’లో స్పెషలైజేషన్ సాధించాలనేది అతని లక్ష్యం. ఇంజినీరింగ్ నేర్పిన లాజికల్ థింకింగ్, సమస్యా పరిష్కార నైపుణ్యాలు తనకు న్యాయశాస్త్రం చదవడంలో కూడా ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెబుతున్నాడు. 10 ఏళ్లకే కాలేజీ ప్రయాణం ప్రారంభించి, రెండు ఇంజినీరింగ్ డిగ్రీలు పూర్తి చేసి, గిన్నిస్ రికార్డు సాధించి, ఇప్పుడు ప్రొఫెసర్‌గానూ, న్యాయవిద్యార్థిగానూ రాణిస్తున్న నాథన్ థామస్ జీవితం కేవలం ఒక రికార్డుకు మాత్రమే పరిమితం కాదు.. నిరంతర జిజ్ఞాసకు, కష్టపడే తత్వానికి నిలువెత్తు నిదర్శనం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!

విజయవాడలో డీఎస్సీ-2025 నియామకాల వ్యవహారం రాజకీయంగా మరోసారి వేడెక్కింది. డీఎస్సీలో జరిగినట్లు...

AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!

ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్రానికి మరో...