17
April, 2026

A News 365Times Venture

17
Friday
April, 2026

A News 365Times Venture

Nashik: లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడి.. ఏకంగా TCS ఆఫీసులోనే దుకాణం పెట్టేసిన కంత్రీగాళ్లు.!

Date:

Nashik: మహారాష్ట్రలోని నాసిక్‌లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయంలో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్ల ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను కంపెనీ సస్పెండ్ చేసినట్లు తాజాగా ప్రకటించింది. ఏ విధమైన వేధింపులకైనా “జీరో టాలరెన్స్” విధానం పాటిస్తున్నామని సంస్థ స్పష్టం చేసింది.

డబ్బులే.. డబ్బులు.. Women’s T20 World Cup 2026కు భారీ ప్రైజ్ మనీ ప్రకటించిన ICC..!

ఈ విషయమై పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు తమపై సీనియర్ సహచరులు మానసిక, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. అలాగే మతపరమైన ఆచారాలు, మత మార్పిడి విషయంలో ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటివరకు ఈ కేసులో ఏడు మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఒక సీనియర్ హెచ్‌ఆర్ మేనేజర్ కూడా ఉన్నారు. మరో మహిళా అధికారి పరారీలో ఉండగా, ఆమె కోసం రెండు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఉద్యోగులు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ, హెచ్‌ఆర్ విభాగం స్పందించలేదని ఆరోపణలు ఉన్నాయి.

SRH vs RR: దంచి కొట్టిన ఇషాన్.. రాజస్థాన్‌ ముందు భారీ లక్ష్యం

ఈ విషయంపై స్పందించిన TCS ప్రతినిధులు.. కేసు గురించి సమాచారం అందుకున్న వెంటనే చర్యలు తీసుకున్నామని తెలిపారు. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత ఉద్యోగులను సస్పెండ్ చేశామని, పోలీసులతో పూర్తిగా సహకరిస్తున్నామని వెల్లడించారు. కంపెనీ నాసిక్ కార్యాలయాన్ని మూసివేయనున్నట్లు వచ్చిన వార్తలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. అయితే పోలీసుల ప్రకారం కంపెనీ ఆపరేషనల్ నిర్ణయాలు వారి అంతర్గత వ్యవహారమని తెలిపారు. ప్రస్తుతం SIT దర్యాప్తు కొనసాగుతుండగా, పరారీలో ఉన్న నిందితురాలిని పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

swayambhu : నిఖిల్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘స్వయంభు’ ఫస్ట్ సాంగ్ ఆదరిందిగా

జోవియల్ క్యారెక్టర్స్ నుండి నిఖిల్ ను టోటల్‌గా ఛేంజ్ చేసింది స్వామిరారా,...

Israel-Lebanon: ఇజ్రాయెల్‌తో 10 రోజులు కాల్పుల విరమణ ఒప్పందం.. లెబనాన్‌లో సంబరాలు

మొత్తానికి మధ్యప్రాచ్యంలో వాతావరణం చల్లబడుతోంది. తాజాగా ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య 10 రోజుల...

Bonus Shares: ఒక షేరు కొంటే.. మరో షేరు ఉచితం.. ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..

భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) పెట్టుబడిదారులకు మరియు షేర్ హోల్డర్లకు...