25
May, 2026

A News 365Times Venture

25
Monday
May, 2026

A News 365Times Venture

Nara Lokesh: మహానాడుపై క్లస్టర్‌ ఇంఛార్జ్‌లకు నారా లోకేష్ దిశానిర్దేశం

Date:

Nara Lokesh: క్లస్టర్ స్థాయిలో మహానాడు విజయవంతానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ పిలుపునిచ్చారు. ఈ నెల 27,28 తేదీల్లో క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడు సన్నద్ధతపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ 1875 క్లస్టర్ ఇంఛార్జ్ లతో మంత్రి నారా లోకేష్ ఆన్ లైన్ ద్వారా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దిశానిర్దేశం చేస్తూ.. మహానాడు అనేది కేవలం పార్టీ కార్యక్రమం కాదు.. తెలుగుదేశం బలం, త్యాగం, క్రమశిక్షణ, సంస్థాగత స్ఫూర్తికి ప్రతిబింబం. తెలుగుజాతి ప్రగతి, తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కోవిడ్ సమయంలో మహానాడు నిర్వహించుకోలేకపోతే వర్చువల్ గా ఏర్పాటుచేసుకున్నాం. అనంతరం ఒంగోలులో మహానాడును అద్భుతంగా నిర్వహించుకుని ఎన్నికలకు వెళ్లాం. ఘనవిజయం సాధించాం. ఈ సారి మహానాడును ‘స్త్రీ శక్తి మహానాడు థీమ్’ తో నిర్వహించుకుంటున్నాం. మహిళలను పెద్దఎత్తున ప్రోత్సహించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం.

అందరం కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేయాలి
అందరం కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేయాలి. నెల్లూరులో ఘనంగా మహానాడు పండుగను నిర్వహించాలనుకున్నాం. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు.. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈ సారి మహానాడును హైబ్రిడ్ విధానంలో నిర్వహించుకుంటున్నాం. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడులో పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ కేంద్రంగా మహానాడును వర్చువల్ గా నిర్వహించుకుంటున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 1875 క్లస్టర్లలో మహానాడును నిర్వహిస్తున్నాం.

క్లస్టర్ బలోపేతానికి ఇదో మంచి అవకాశం
మీ క్లస్టర్ పరిధిలో ఉన్న కుటుంబ సాధికార సారధి దగ్గరి నుంచి బూత్ ఇంఛార్జ్, గ్రామ పార్టీ అధ్యక్షులు, గ్రామ కమిటీ, క్లస్టర్ కమిటీ సభ్యులు మహానాడులో పాల్గొనాలి. క్లస్టర్ ఇంఛార్జ్ కు ఎక్కువ బాధ్యత ఇవ్వాలనేది జాతీయ అధ్యక్షుల వారి ఆదేశం. క్లస్టర్ మోడల్ లో మనం ముందుకు వెళ్లాలని ఈ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నాం అన్నారు లోకేష్.. క్లస్టర్ బలోపేతానికి ఇదో మంచి అవకాశం. అందరితో అనుబంధం ఏర్పడుతుంది. మహానాడు నిర్వహణపై ఇప్పటికే మార్గదర్శకాలు అందజేశాం. ప్రతి క్లస్టర్ కు పార్టీ నుంచి మెటీరియల్ అందజేస్తాం. స్థలం ఎంపిక చేసుకోవడంతో పాటు ఎల్ఈడీ టీవీ, స్పీకర్లు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంచుకోవాలి. మై టీడీపీ యాప్ ద్వారా హాజరును నమోదు చేస్తారు.

కేఎస్ఎస్, బూత్, గ్రామ, అనుబంధ కమిటీ సభ్యులను ఆహ్వానించాలి
క్లస్టర్ పరిధిలో నిర్వహించే మహానాడు విజయవంతానికి ప్రతిఒక్కరూ అంకితభావంతో పనిచేయాలి. ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ లతో సమన్వయం చేసుకోవాలి. పార్టీ పరంగా కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తాం. మహిళలు పెద్దఎత్తున భాగస్వామ్యం అయ్యేలా చూడాలి. ప్రతి కార్యకర్త బాధ్యతగా తీసుకోవాలి. అనుబంధ విభాగాలను కూడా ఆహ్వానించాలి. కుటుంబ సాధికార సారధి, అనుబంధ విభాగాలు, కమిటీ సభ్యులకు, బూత్, గ్రామ కమిటీ సభ్యులకు ఆహ్వానాలు పంపాలి. ఇదో మంచి అవకాశంగా భావించి రాష్ట్రవ్యాప్తంగా కదలిక తీసుకురావాలి. నూటికి నూరుశాతం క్లస్టర్ స్థాయిలో మహానాడు నిర్వహించాలనేది పార్టీ అధ్యక్షులు చంద్రబాబు గారి ఆదేశం. తూచా తప్పకుండా పాటించాలన్నారు..

పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించాలి
పండుగ వాతావరణంలో మహానాడు నిర్వహించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు లోకేష్. తెలుగుదేశం పార్టీలో వ్యక్తులు శాశ్వతం కాదు. వ్యవస్థ శాశ్వతం. ఆ వ్యవస్థను బలోపేతం చేసేందుకే క్లస్టర్ ఇంఛార్జ్ గా పార్టీ అవకాశం కల్పించింది. ఈ బాధ్యతను మనం స్వీకరించి అమలుచేయాలి. ఏ కార్యక్రమం అయినా క్రమశిక్షణ, పట్టుదల, అంకితభావంతో పనిచేయాలి. గత 23 నెలలుగా నేను సుమారు 60 నియోజకవర్గాల్లో పర్యటించాను. దాదాపు 25 నియోజకవర్గాల్లో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేశాం. అందరూ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు నేతలు ప్రజలతో మమేకం కావాలన్నారు..

పనిచేసే వారికి ప్రాధాన్యత
అందరూ కలిసికట్టుగా పనిచేసే మహానాడు చరిత్రలో మిగిలిపోయే కార్యక్రమంగా నిర్వహించాలి. నామినేటెడ్ పదవుల్లో పనిచేసే వారికి ప్రాధాన్యత ఇచ్చాం. మై టీడీపీ యాప్ ద్వారా పనిచేసే వారిని గుర్తిస్తున్నాం. నియోజకవర్గ పర్యటనల్లో సీఎం గారు, నేను ముందుగా కార్యకర్తలను కలుస్తున్నాం. ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతుంది. త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి. ఇందుకు సన్నద్ధం కావాల్సిన అవసరం ఉంది. అందరూ క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో మమేకం కావాలి. ఇందుకు వేదికగా మహానాడును వినియోగించుకోవాలని, అందరూ కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష్.. ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంఛార్జ్ లు, జోనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మండల, పట్టణ, డివిజన్ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు…

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Pawan Kalyan: అమిత్ షాతో అలాంటి విషయాలు ఎందుకు మాట్లాడతాను

వైసీపీ నాయకుడు గురించి అమిత్ షా దగ్గర ఏమీ మాట్లాడలేదని.. అయినా...

Hardik Pandya: MI వీడి చెన్నై సూపర్ కింగ్స్‌లోకి హార్దిక్ పాండ్యా.. 07:07 టైమ్‌పై సోషల్ మీడియాలో చర్చ..

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సోషల్...

Vaibhav Sooryavanshi: క్రిస్ గేల్ రికార్డు నాకు లెక్క కాదు.. టీ20ల్లో 200 కొట్టి చూపిస్తా: వైభవ్ సూర్యవంశీ

క్రికెట్ ప్రపంచంలో రికార్డులు సృష్టించడం ఒక ఎత్తైతే, వాటిని తిరగరాయడం మరో...