2
November, 2026

A News 365Times Venture

2
Monday
November, 2026

A News 365Times Venture

Muncipal Elections: ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌.. క్యూలైన్లలో ఉన్నవారికీ ఛాన్స్..

Date:

ఆంధ్రప్రదేశ్‌లో 92 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభమైంది. కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు ఘటనలు మినహా దాదాపు అన్ని చోట్లా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సాగింది. సాయంత్రం వేళల్లో పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. నిబంధనల ప్రకారం సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసినప్పటికీ, ఆ సమయానికి పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో ఉన్న ఓటర్లందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు. చివరిలో ఉన్న ఓటర్లకు టోకెన్లు పంపిణీ చేసి, వారందరితో ఓటింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయించారు.

ఈ ఎన్నికల్లో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్‌లో స్వల్ప ఉద్రిక్తత, కలకలం రేగింది. బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల గుర్తులు తారుమారు కావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమై పోలింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ తర్వాత లోపాలను సరిదిద్ది కొత్త బ్యాలెట్ పేపర్లను అందుబాటులోకి తెచ్చారు. ఈ సాంకేతిక లోపం వల్ల ఏర్పడిన జాప్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ఆ ఒక్క డివిజన్‌లో ఓటర్లకు దాదాపు రెండున్నర గంటల పాటు అదనపు సమయం కేటాయించి పోలింగ్‌ను కొనసాగించారు.

పోలింగ్ ముగిసిన వెంటనే ఎన్నికల సిబ్బంది అన్ని కేంద్రాల్లోని బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన పోలీసు భద్రత నడుమ స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్ నవంబర్ 3న జరగనుంది. అదే రోజు ఉదయం 8:00 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా, మధ్యాహ్నానికల్లా ఆయా స్థానాల గెలుపోటములపై పూర్తి స్పష్టత రానుంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Amit Shah: ‘‘మీరు అక్కడే ప్రధానిగా ఉండండి’’.. రాహుల్‌పై అమిత్ షా సెటైర్!

Amit Shah: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోం మంత్రి...

Rahul Gandhi: జ్ఞానేశ్ కుమార్ తర్వాత మోదీ వంతు.. రామ్‌లీలా మైదాన్‌లో రాహుల్ హెచ్చరిక!

Rahul Gandhi: ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన ఇండియా కూటమి మెగా...

CM Revanth Reddy : 20 కోట్ల ఓట్ల తొలగింపుకు కేంద్రం కుట్ర.. మోదీని గద్దె దించే వరకు విశ్రమించం

దేశంలో పేదలు, దళితులు, గిరిజనులు , మహిళలకు రాజ్యాంగం కల్పించిన ఓటు...

Bangladesh: ‘‘ఢిల్లీనా.. ఢాకానా?’’ బంగ్లాదేశ్‌లో మళ్లీ భారత్ వ్యతిరేక నినాదాలు

Bangladesh:బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా దిగిపోయిన తర్వాత భారత్ వ్యతిరేక నినాదాలు వినిపించాయో,...