బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే.అద్వానీని ప్రధాని మోడీ కలిశారు. ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్య విషయాలపై ఆరా తీశారు. అనంతరం అద్వానీ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రభుత్వాధినేతగా మోడీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది. అద్వానీని మోడీ పరామర్శించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మోడీ.. ముఖ్యమంత్రిగా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 25 ఏళ్లు పూర్తైంది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు తాను ఈ స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఈ విజయం ఆత్మస్తుతికి సందర్భం కాదని.. కృతజ్ఞతలు తెలియజేయాల్సిన తరుణమని ప్రధాని మోడీ అన్నారు.
Met Advani Ji at his residence and sought his blessings.
His decades of public service and contribution to our national life have left a lasting imprint.
He has played a pivotal role in strengthening India’s progress. https://t.co/ib51lx4CkU
— Narendra Modi (@narendramodi) October 7, 2026




