8
October, 2026

A News 365Times Venture

8
Thursday
October, 2026

A News 365Times Venture

INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?

Date:

INDIA Bloc: ఢిల్లీలో ఎన్నికల సంఘం నిర్వహించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)కు వ్యతిరేకంగా, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి నేతలు భారీ నిరసన చేశారు. జంతర్ మంతర్ వద్ద నిరనసన తెలిపేందుకు వెళ్లిన రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలతో పాటు కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు.

అయితే, ఈ నిరసనల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) పాల్గొనలేదు. అఖిలేష్ యాదవ్ ఈ నిరసనలకు దూరంగా ఉన్నారు. పార్టీ నేతలు కూడా ఎవరూ ఢిల్లీలో కనిపించలేదు. దీంతో రెండు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు, ఎస్పీ నేతలు బుధవారం నిరసనల గురించి తమకు సమాచారం లేదని చెప్పడం గమనార్హం.

ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఏర్పాటు చేసిన లంచ్ మీటింగ్‌కు తమకు సమాచారం లేదని తొలుత కొందరు ఎస్పీ నేతలు చెప్పగా, కాంగ్రెస్ అగ్ర నాయకత్వం నుంచి తమకు ప్రత్యేకంగా సమాచారం లేదని మరో ఎస్పీ వర్గం చెబుతోంది. అయితే, ఈ వాదనల్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఖండించారు. ఇండియా కూటమిలోని అన్ని పార్టీలను లంచ్‌కు ఆహ్వానించామని, అయితే మంగళవారం రాత్రి ఆలస్యంగా కార్యక్రమాన్ని ఖరారు చేసి సమాచారం ఇవ్వడంతో కొన్ని పార్టీలు హాజరుకాలేకపోయాయని చెప్పారు.

2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్-ఎస్పీల మధ్య సీట్ల పంపకాల పంచాయతీ ముదిరింది. ఉత్తర్ ప్రదేశ్‌లో మొత్తం 403 స్థానాలు ఉంటే, కనీసం 150 సీట్లు తమకు కావాలని కాంగ్రెస్ నేతలు ఎస్పీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ అని ఎస్పీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో బలాన్ని చూసుకుని సీట్లు అడగాలని అంటున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఆ మాత్రం ఎంపీ సీట్లు రావడానికి ఎస్పీతో పొత్తే కారణమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఎస్పీ 37, కాంగ్రెస్ 06 ఎంపీ సీట్లు గెలుచుకున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోడీపై సెర్బియా మాజీ అధ్యక్షుడు...

Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!

ఇరాన్ మద్దతు గల హౌతీలు సౌదీపై భీకర దాడులు చేస్తు్న్నారు. దీంతో...

Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా

ప్రముఖ నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తికి పశ్చిమ బెంగాల్‌లో కీలక...

Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..

భారత మహిళా క్రికెట్ జట్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జింబాబ్వే సిరీస్‌కు...