22
November, 2026

A News 365Times Venture

22
Sunday
November, 2026

A News 365Times Venture

Microwave Cleaning Hacks : ఓవెన్‌లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ

Date:

Microwave Cleaning Hacks : వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో మైక్రోవేవ్ ఓవెన్ ఒకటి. ఆహారాన్ని వేడి చేయడం, వంటకాలను సిద్ధం చేయడం వంటి పనులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అయితే రోజూ ఉపయోగించడం వల్ల ఓవెన్ లోపల నూనె మరకలు, ఆహారపు అవశేషాలు, జిడ్డు పేరుకుపోతుంటాయి. వీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే మొండి మరకలుగా మారడంతో పాటు దుర్వాసన కూడా వస్తుంది. అలాగని గంటల తరబడి రుద్దాల్సిన అవసరం లేదు. ఇంట్లో అందుబాటులో ఉండే కొన్ని పదార్థాలతో మైక్రోవేవ్‌ను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.

నిమ్మకాయతో జిడ్డు మరకలకు చెక్

మైక్రోవేవ్ శుభ్రం చేయడానికి నిమ్మకాయ మంచి ఎంపిక. ముందుగా మైక్రోవేవ్‌లో ఉపయోగించేందుకు అనువైన గిన్నెలో ఒక కప్పు నీళ్లు తీసుకోవాలి. అందులో సగం నిమ్మకాయ రసం పిండాలి. నిమ్మకాయ ముక్కలను కూడా గిన్నెలో వేయవచ్చు. తర్వాత ఆ గిన్నెను ఓవెన్‌లో ఉంచి మూడు నుంచి ఐదు నిమిషాలు వేడి చేయాలి. నీటి నుంచి వచ్చే ఆవిరి ఓవెన్ గోడలకు అంటుకున్న జిడ్డును మెత్తబరుస్తుంది. వేడి తగ్గిన తర్వాత మెత్తని గుడ్డతో తుడిస్తే మరకలు సులభంగా తొలగిపోతాయి.

వెనిగర్‌తో దుర్వాసన మాయం

మైక్రోవేవ్‌లో ఆహారపు వాసనలు ఎక్కువగా వస్తుంటే వెనిగర్ ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల వైట్ వెనిగర్ కలపాలి. ఆ మిశ్రమాన్ని మైక్రోవేవ్‌లో కొన్ని నిమిషాలు వేడి చేయాలి. ఆవిరి లోపల పేరుకుపోయిన ఆహారపు అవశేషాలను మెత్తబరుస్తుంది. గిన్నె చల్లారిన తర్వాత బయటకు తీసి ఓవెన్ లోపలి భాగాన్ని శుభ్రమైన గుడ్డతో తుడవాలి.

బేకింగ్ సోడాతో మొండి మరకలు తొలగింపు

ఎక్కువ రోజులుగా పేరుకుపోయిన మరకలను తొలగించేందుకు బేకింగ్ సోడా ఉపయోగపడుతుంది. కొద్దిగా బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి పేస్ట్‌లా తయారు చేయాలి. దాన్ని మరకలున్న ప్రాంతాల్లో రాసి కొన్ని నిమిషాలు ఉంచాలి. తర్వాత తడి గుడ్డతో సున్నితంగా తుడవాలి. గట్టిగా రుద్దడం, పదునైన వస్తువులు ఉపయోగించడం వల్ల ఓవెన్ లోపలి పూత దెబ్బతినే ప్రమాదం ఉంది.

క్లీనింగ్ సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

మైక్రోవేవ్ శుభ్రం చేసే ముందు విద్యుత్ సరఫరా నిలిపివేయాలి. అయితే ఆవిరితో శుభ్రం చేసే పద్ధతిలో మాత్రమే అవసరమైనంతసేపు ఓవెన్ ఆన్ చేయాలి. వేడి గిన్నెను వెంటనే తాకకూడదు. ఓవెన్‌లోని విద్యుత్ భాగాలు, గాలి రంధ్రాల్లోకి నీరు వెళ్లకుండా జాగ్రత్తపడాలి. ప్రతిరోజూ ఉపయోగించిన తర్వాత ఆహారపు మరకలను తుడిచేస్తే జిడ్డు పేరుకుపోదు. ఈ చిట్కాలతో సాధారణ మరకలను కొద్ది నిమిషాల్లో శుభ్రం చేయవచ్చు. మొండి మరకలకు మాత్రం అదనపు సమయం పట్టొచ్చు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

PM Modi: నా మాట విని బంగారం కొనడం తగ్గించారు.. ఇప్పుడు లాభపడ్డారు..

PM Modi: దేశంలో బంగారం కొనుగోళ్లపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి...

CM Revanth Reddy :తెలంగాణ ఎగుమతుల్లో 68% వృద్ధి.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే లక్ష్యం

గత మూడేళ్లలో తెలంగాణ నుంచి జరిగే వస్తువుల ఎగుమతులు 68 శాతం...

Iran US Tensions: అమెరికా ఎఫ్-16పై ఇరాన్ క్షిపణి దాడి!

Iran US Tensions: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి....

Rishabh Pant: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు.. చరిత్రలోనే తొలి వికెట్ కీపర్‌గా..

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో 3,000 పరుగులు పూర్తి చేసిన...