22
November, 2026

A News 365Times Venture

22
Sunday
November, 2026

A News 365Times Venture

Iran US Tensions: అమెరికా ఎఫ్-16పై ఇరాన్ క్షిపణి దాడి!

Date:

Iran US Tensions: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ‘‘హార్ముజ్ జలసంధి’’ వద్ద ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తమ వైమానిక రక్షణ వ్యవస్థలు లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయని ఇరాన్ ప్రకటించింది. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఇరాన్ ప్రభుత్వ ఆధ్వరంలోని తస్నీమ్ వార్తా సంస్థ వెల్లడించింది. శనివారం ఇరాన్ సైన్యం ప్రకటన ప్రకారం.. పర్షియన్ గల్ఫ్ మీదుగా ప్రయాణిస్తున్న అమెరికా ఎఫ్-16 జెట్‌ను దేశీయంగా అభివృద్ధి చేసిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ గుర్తించినట్లు తెలిపింది.

అమెరికా విమానాన్ని గుర్తించి, దాని కదలికల్ని నిరంతరం పర్యవేక్షించామని ఇరాన్ ఆర్మీ పబ్లిక్ రిలేషన్స్ విభాగం వెల్లడించింది. విమానాన్ని టార్గెట్ చేసిన క్షిపణిని ప్రయోగించినట్లు తెలిపింది. ఈ క్షిపణి యుద్ధ విమానానికి సమీపంలో పేలిందని, దీంతో విమానం దెబ్బతిన్నట్లు చెప్పింది. దీంతో పైలట్ తన మిషన్‌ను మధ్యలో నిలిపేసి, సమీపంలోని వైమానిక స్థావరంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది ఇరాన్ పేర్కొంది.

ఇదిలా ఉంటే, ఇరాన్ వాదనల్ని అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్కామ్) తోసిపుచ్చింది. ఇరాన్ ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేసింది. మిడిల్ ఈస్ట్‌లో ఉన్న అమెరికా యుద్ధ విమానాలు సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. మరోవైపు, అమెరికాకు చెందిన ఎంక్యూ 9 రీపర్ డ్రోన్‌లను కూడా కూల్చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తం 58 అమెరికా డ్రోన్లను ధ్వంసం చేశామని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) ప్రకటించింది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

PM Modi: నా మాట విని బంగారం కొనడం తగ్గించారు.. ఇప్పుడు లాభపడ్డారు..

PM Modi: దేశంలో బంగారం కొనుగోళ్లపై ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి...

Microwave Cleaning Hacks : ఓవెన్‌లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ

Microwave Cleaning Hacks : వంటగదిలో ఎక్కువగా ఉపయోగించే ఎలక్ట్రానిక్ వస్తువుల్లో...

CM Revanth Reddy :తెలంగాణ ఎగుమతుల్లో 68% వృద్ధి.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే లక్ష్యం

గత మూడేళ్లలో తెలంగాణ నుంచి జరిగే వస్తువుల ఎగుమతులు 68 శాతం...

Rishabh Pant: రిషబ్ పంత్ వరల్డ్ రికార్డు.. చరిత్రలోనే తొలి వికెట్ కీపర్‌గా..

వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) చరిత్రలో 3,000 పరుగులు పూర్తి చేసిన...