31
October, 2026

A News 365Times Venture

31
Saturday
October, 2026

A News 365Times Venture

Innodata Layoffs: ఇన్నోడేటా ఉద్యోగులకు షాక్.. రాత్రికి రాత్రే 90 శాతం మందికి లేఆఫ్.?

Date:

Innodata Layoffs:  సాఫ్ట్‌వేర్, ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. టెక్ దిగ్గజ కంపెనీల నుంచి చిన్న కంపెనీల వరకు ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటిస్తున్నారు. వేల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకున్నాయి టెక్ సంస్థలు. ఇదిలా ఉంటే, ప్రముఖ అవుట్‌సోర్సింగ్ సంస్థ ఇన్నోడేటా ఇండియా దాదాపు 90 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. సంస్థలో ప్రధాన క్లయింట్‌గా ఉన్న మెటా తన ప్రాజెక్ట్ పనుల్ని ఉపసంహరించుకోవడంతో ఉద్యోగుల అవసరం తగ్గిపోయిందని, అందుకే ఈ భారీ తొలగింపులు చేపట్టినట్లు తెలుస్తోంది.

రాత్రికి రాత్రే 90 శాతం మందికి ఉద్వాసన..?

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. ఇన్నోడేటా ఇండియాలో సుమారు 1000 నుంచి 1200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 90 శాతం మందిని తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉద్యోగాలు కోల్పోయిన వారికి 4 నెలల జీతానికి సమానమైన సెవరెన్స్ ప్యాకేజీ అందిస్తున్నట్లు సమాచారం. అయితే, దీంట్లో నోటీస్ పీరియడ్‌కు సంబంధించిన చెల్లింపులు, ఇతరాలు ఉన్నాయా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. ఈ తొలగింపులు కేవలం భారత్‌కు మాత్రమే పరిమితం కాలేదని, అమెరికా, ఫిలిప్పీన్స్‌లో కూడా ఉద్యోగ కోతలు జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

ఎమర్జెన్సీ మీటింగ్, సిస్టమ్ యాక్సెస్ నిలిపివేత..

ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఆకస్మికంగా జరిగినట్లు బాధితులు పేర్కొంటున్నారు. రెడ్డిట్‌లో ఓ ప్రాసెస్ అనలిస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఉద్యోగులను అకస్మాత్తుగా ఎమర్జెన్సీ హెచ్ఆర్ మీటింగ్‌కు పిలిచారు, ప్రధాన క్లయింట్ మెటా పనులు తగ్గించడంతో తమ ఉద్యోగాలు అవసరం లేదని మీటింగ్‌లో చెప్పినట్లు ఆరోపించారు. సమావేశం జరుగుతున్నప్పుడు ఉద్యోగులు ప్రశ్నలు అడగకుండా మైక్రోఫోన్లు మ్యూట్ చేశారని సదరు ఉద్యోగి ఆరోపించారు. మీటింగ్ పూర్తయిన గంటలోపే ఉద్యోగులకు యాక్సెస్ నిలిపేసినట్లు తెలుస్తోంది. ఆఫీస్ సిస్టమ్స్ పనిచేయకపోవడంతో ఒకరితో ఒకరు మాట్లాడుకునేందు వాట్సాప్‌ను ఆశ్రయించినట్లు ఉద్యోగి వివరించారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..

దక్షిణాఫ్రికా మూడో టెస్టులో ఆస్ట్రేలియాపై 176 పరుగుల భారీ తేడాతో అద్భుత...

Shreyas Iyer: ఆ ఒక్కడే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు.. మా ఓటమికి కారణం అదే..

న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఎదురైన ఘోర పరాజయంపై భారత...

Diwali lights safety tips: దీపావళికి లైట్లు కొనేటప్పుడు ఈ 5 జాగ్రత్తలు తప్పనిసరి.!

Diwali lights safety tips: దీపావళి వచ్చేస్తోంది. చిన్నా పెద్దా అంతా...

Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్

నాలుగో టీ20 మ్యాచ్‌లో సాధించిన భారీ విజయంపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్...