20
November, 2026

A News 365Times Venture

20
Friday
November, 2026

A News 365Times Venture

Indiramma Family Life Insurance: తెలంగాణ కుటుంబాలకు రేవంత్ సర్కార్ భరోసా.. కొత్త బీమా పథకం షురూ

Date:

తెలంగాణలో ప్రతి కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించే లక్ష్యంతో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రభుత్వం నవంబర్ 19 నుంచి అమల్లోకి తెచ్చింది. సిద్దిపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం అందుతుంది. లబ్ధిదారుల తరఫున బీమా కంపెనీలకు ప్రభుత్వమే పూర్తి ప్రీమియం చెల్లిస్తుంది కాబట్టి, కుటుంబాలు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఒకరి కంటే ఎక్కువ మంది సంపాదిస్తుంటే ఎవరి పేరుపై పాలసీ తీసుకోవాలనే నిర్ణయాన్ని లబ్ధిదారులకే వదిలేశారు.

అర్హత నిబంధనలు ఇలా ఉన్నాయి

ఈ పథకం వర్తించాలంటే లబ్ధిదారుల వయస్సు 18 నుంచి 59 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే 1967 నవంబర్ 19 నుంచి 2008 నవంబర్ 18 మధ్య జన్మించిన వారు అర్హులు. ప్రస్తుతం 59 ఏళ్లలోపు ఉన్నవారికి, బీమా కవరేజీ మొదలైన తర్వాత గరిష్ట వయోపరిమితి పెరిగే ఏడాది వరకు ఈ పథకం వర్తిస్తుంది. రేషన్ కార్డు లేని కుటుంబాలు కూడా లబ్ధి పొందేలా ప్రభుత్వం అవకాశం కల్పించింది. నామినీ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా చేర్చితే, ఎవరికి ఎంత వాటా అనే నిష్పత్తిని స్పష్టంగా తెలపాలి.

నెల రోజుల ప్రత్యేక శిబిరాలు.. సులభంగా దరఖాస్తు

నవంబర్ 19 నుంచి డిసెంబర్ 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, వార్డు కార్యాలయాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆధార్, రేషన్ కార్డు వివరాలతో కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. సిబ్బంది ఇంటింటికీ వచ్చి కూడా వివరాలు సేకరిస్తారు. రేషన్ కార్డు ఉన్నవారికి అందులోని డేటా ఆధారంగా నమోదు చేస్తారు. రేషన్ కార్డు లేనివారు ప్రత్యేక దరఖాస్తు ఫారంలో తమతో పాటు కుటుంబసభ్యుల వివరాలు నింపాల్సి ఉంటుంది. కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇతర జిల్లాల్లో ఉంటున్నవారు సమీపంలోని కేంద్రం ద్వారా దరఖాస్తు చేయవచ్చు. ప్రజలకు సహాయంగా హెల్ప్ డెస్క్ ఇంఛార్జ్ అందుబాటులో ఉంటారు. త్వరలోనే ప్రజలు సొంతంగా నమోదు చేసుకునేందుకు వెబ్‌సైట్, యాప్ కూడా అందుబాటులోకి రానున్నాయి.

వృత్తిదారులకు బీమా పెంపు

ఇప్పటికే గీత కార్మికులు, నేత కార్మికులు, మత్స్యకారులకు అందిస్తున్న రూ.2 లక్షల జీవిత బీమాను రూ.5 లక్షలకు పెంచారు. నెల రోజుల పాటు జరిగే ప్రత్యేక శిబిరాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకుని ఇందిరమ్మ జీవిత బీమా పథకంలో చేరాలని, దీని ద్వారా ప్రతి ఇంటికీ ఆర్థిక భద్రత చేకూరుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..

Maharashtra: మహారాష్ట్ర గోండియా జిల్లాలో ఓ ఎయిర్‌లైన్ ఉద్యోగిని హత్య కేసులో...

Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న కోటి దీపోత్సవం 2026 వేడుకల్లో...

CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..

CJP: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) మళ్లీ యాక్టివ్ అవుతోంది. ఢిల్లీ నిరసనల...

Operation Sindoor: పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్‌కు కష్టకాలం.. సిందూర్‌పై కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

Operation Sindoor:  ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌తో వ్యవహరించడంలో భారత్ కష్టకాలాన్ని...