20
November, 2026

A News 365Times Venture

20
Friday
November, 2026

A News 365Times Venture

CM Revanth Reddy : సిద్దిపేటలో కేసీఆర్‌కు రేవంత్ సవాల్.. మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు

Date:

సిద్దిపేట సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈ రోజుతో సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డా అని నిరూపితమైందని అన్నారు. ప్రజా పాలన ప్రగతిబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలో సుమారు రూ.550 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. 2029లో రెండోసారి ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి ప్రజా పాలన జెండా ఎగురేస్తామని సిద్దిపేట వేదికగా ఆయన మాట ఇచ్చారు.

మదన్ మోహన్ పేరుతో మెడికల్ కాలేజీ.. కేసీఆర్‌పై ఫైర్

సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ.. మాజీ ఎమ్మెల్యే ఆనంతుల మదన్ మోహన్ 1983లో కేసీఆర్‌ను ఓడించి సిద్దిపేట గడ్డ కాంగ్రెస్ అడ్డా అని నిరూపించారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చరిత్ర పుటల్లో మదన్ మోహన్ పేరు లేకుండా చేయాలని నాలుగు దశాబ్దాలుగా కేసీఆర్, హరీష్ రావు కుట్రలు పన్నారని ఆరోపించారు. సిద్దిపేట మెడికల్ కాలేజీకి మదన్ మోహన్ పేరు పెట్టాలని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఆదేశాలు ఇస్తున్నట్లు ప్రకటించారు. చింతమడకలో ఉన్న కేసీఆర్‌కు రాజకీయంగా తొలి అవకాశం ఇచ్చింది మదన్ మోహనేనని, అలాంటి వ్యక్తిపైనే పోటీ చేశారని విమర్శించారు. నమ్మిన వారిని మోసం చేయడం కేసీఆర్ రక్తంలోనే ఉందని, ఎన్టీఆర్ పార్టీలో ఉంటూ రెండో వెన్నుపోటు పొడిచారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2023 మేడ్చల్ సభలో చెప్పినట్లుగానే గజ్వేల్‌లో అడుగుపెట్టి నిరూపించామని అన్నారు.

కుటుంబ రాజకీయాలు, ఆస్తులపై నిలదీత

నాలుగు దశాబ్దాలుగా మామ, ఆ తర్వాత అల్లుడు, ఆపై బావమరిది వస్తున్నారంటూ వారసత్వ రాజకీయాలపై రేవంత్ రెడ్డి చురకలంటించారు. సిద్దిపేట నుంచి గెలిచిన వారిని మంత్రిని చేస్తానని చెప్పారు. 2004లో హరీష్ రావు వార్డు మెంబర్ కూడా కాదని, కాంగ్రెస్ దయతో వైఎస్ మంత్రివర్గంలో మంత్రి అయ్యారని అన్నారు. హరీష్ రావును కాపాడిన సోలిపేట రామలింగారెడ్డి మరణించిన తర్వాత ఆయన కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడుతోందని, హరీష్‌తో రాజకీయాలు మొదలుపెట్టిన జగ్గారెడ్డి అప్పుల్లో కూరుకుపోయారని పేర్కొన్నారు. కేసీఆర్‌తో కలిసి పనిచేసిన చెరుకు ముత్యంరెడ్డి పరిస్థితిని గుర్తుచేస్తూ.. హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలాగో సిద్దిపేట, దుబ్బాక అలానే ఉంటాయని అన్నారు. సిరిసిల్లలో పాపారావును మోసం చేసి కేసీఆర్ కొడుకుకు టికెట్ ఇచ్చారని విమర్శిస్తూ, కేటీఆర్ గంజాయి బ్యాచ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రంగనాయక సాగర్ వద్ద హరీష్ రావుకు, కొండపోచమ్మ సాగర్ వద్ద వందల ఎకరాల్లో కేసీఆర్‌కు, జన్వాడలో కేటీఆర్‌కు ఫామ్ హౌస్‌లు ఎలా వచ్చాయని, హరీష్ రావు మామ, బావమరిది మహేష్ రావుకు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

ఉద్యమకారుల త్యాగాలు.. అమరవీరుల గౌరవం

తెలంగాణ ఉద్యమకారుడు సంతోష్ గౌడ్ అప్పుల పాలై ఆత్మహత్య చేసుకుంటే, బీఆర్ఎస్ నేతలకు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని రేవంత్ రెడ్డి నిలదీశారు. ఉద్యమ సమయంలో హరీష్ రావుకు అగ్గిపెట్టె కూడా దొరకలేదని, శ్రీకాంత చారి ప్రాణాలు అర్పిస్తే కేసీఆర్ కుటుంబ సభ్యులందరికీ పదవులు, ఉద్యోగాలు కట్టబెట్టారని విమర్శించారు. అమరవీరుల పాపం ఊరికే పోదని, ఉసురు తగులుతుందని అన్నారు. శ్రీకాంత చారి తల్లికి అప్పట్లో ఒక పదవి ఇస్తే ఏమయ్యేదని ప్రశ్నిస్తూ, తాము అధికారంలోకి వచ్చాక ఆమె అడగకపోయినా పిలిచి పదవి ఇచ్చి గౌరవించామని రేవంత్ రెడ్డి తెలిపారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Maharashtra: అక్రమ సంబంధం.. సుపారీ హత్య.. భర్త స్నేహితురాలిని చంపించిన భార్య..

Maharashtra: మహారాష్ట్ర గోండియా జిల్లాలో ఓ ఎయిర్‌లైన్ ఉద్యోగిని హత్య కేసులో...

Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న కోటి దీపోత్సవం 2026 వేడుకల్లో...

CJP: మళ్లీ యాక్టివ్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ.. గోవా నుంచి ప్రచారం..

CJP: కాక్రోచ్ జనతా పార్టీ(CJP) మళ్లీ యాక్టివ్ అవుతోంది. ఢిల్లీ నిరసనల...

Operation Sindoor: పాకిస్తాన్‌తో యుద్ధంలో భారత్‌కు కష్టకాలం.. సిందూర్‌పై కాంగ్రెస్ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

Operation Sindoor:  ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌తో వ్యవహరించడంలో భారత్ కష్టకాలాన్ని...