5
October, 2026

A News 365Times Venture

5
Monday
October, 2026

A News 365Times Venture

India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. టీమిండియా ఖాతాలో మరో స్వర్ణం..

Date:

India vs Pakistan ఏషియన్ గేమ్స్‌లో 2026 భారత్ మరో బంగారు పతకం కొట్టేసింది. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. చివరి బంతి వరకు సాగిన పోరులో పాకిస్థాన్ ఓటమిపాలయ్యింది. టీమిండియా 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన మొదట బ్యాటింగ్ చేసిన భారత్ పాకిస్థాన్ ముందు 212 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు ఆరు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. బ్యాటింగ్ బరిలోకి దిగిన పాక్‌ను వాషింగ్టన్ సుందర్ దెబ్బకొట్టాడు. కెప్టెన్ సాహిబ్జాదా ఫర్హాన్‌ను (10 పరుగులు) సుందర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖాన్‌(3)ను పెవిలియన్‌కు పంపాడు. ఏడో ఓవర్‌లో అక్షర్ తన స్పిన్ బౌలింగ్‌లో మజ్ సదాఖత్‌ను (23) పంపేశాడు. ఇక అప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న సైమ్ అయూబ్(29) శివం దూబే ఔట్ చేశాడు. చాలా సేపటికి వాషింగ్టన్ సుందర్ మరో వికెట్ పడగొట్టాడు. అద్బుల్ సమద్ తొమ్మిది బాల్స్‌లో తొమ్మిది పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. హసన్ నవాజ్ చివరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. నవాజ్ 51 బంతులలో 96 పరుగులు చేసి దూబే వేసిన చవరి బంతికి పెవిలియన్‌కు చేరాడు. పాక్ చివరికి 192 పరుగులు చేసింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటెల్, శివం దూబే చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. బుమ్రాతో సహా మిగతా బౌలర్లు ఎవ్వరూ వికెట్లు పడగొట్టలేకపోయారు.

మరోవైపు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. కాటేరమ్మకొడుకు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో అదరగొట్టేశారు. మ్యాచ్ ప్రారంభంలో అభిషేక్ 28 బాల్స్‌లో 61 పరుగులు చేసి పాకిస్థాన్‌కు చుక్కులు చూయించాడు. చివర్లో తిలక్ వర్మ(51) బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ తొలుత బ్యాటింగ్ బరిలోకి దిగారు. ఈ జోడీ జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించింది. అయితే, వైభవ్ తన ఇన్నింగ్స్‌ను పొడిగించలేకపోయాడు. సామ్ అయూబ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ క్యాచ్ పట్టడంతో అతను అవుటయ్యాడు. వైభవ్ 9 బంతుల్లో రెండు సిక్సర్లతో 15 పరుగులు చేశాడు. వైభవ్ అవుటయ్యే సమయానికి స్కోరు 28/1గా ఉంది. వైభవ్ తరువాత బ్యాటింగ్‌కి వచ్చిన సంజూ శామ్సన్ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. అహ్మద్ డానియల్ బౌలింగ్‌లో కేవలం 2 పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. దీంతో అభిషేక్ శర్మ దుమ్మురేపేశాడు. 20 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కానీ, 61 పరుగుల వద్ద అభిషేక్ ఇన్నింగ్స్ ముగిసింది. తన ఇన్నింగ్స్‌లో 28 బంతులు ఆడిన అభిషేక్, 3 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 217గా నమోదైంది. అరాఫత్ మిన్హాస్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖాన్ అతడిని స్టంప్ చేయడంతో అభి పెవిలియన్‌కు చేరాడు. ఇక బరిలోకి దిగిన ఇషాన్ కిషన్ అరఫత్ మిన్హాస్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. 18 బంతుల్లో 3 ఫోర్లు బాది.. 20 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక అప్పటి వరకు నిలకడగా ఆడిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. శ్రేయస్ 24 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. మ్యాచ్ మధ్యలో టీమిండియా కాస్త తడబడింది. అభిషేక్ శర్మ అవుటైనప్పుడు, 7.5 ఓవర్లలో భారత జట్టు స్కోరు 3 వికెట్ల నష్టానికి 93 పరుగులకు చేరింది. ఆ తర్వాత, 14.1 ఓవర్లలో శ్రేయస్ అవుటైనప్పుడు, టీమ్ ఇండియా స్కోరు 5 వికెట్ల నష్టానికి 133 పరుగులకు చేరింది. చివరి ఓవర్లలో శివమ్ దూబే, తిలక్ వర్మ తరఫున వేగవంతమైన ఇన్నింగ్స్‌ ఆడారు. అహ్మద్ డానియల్ బౌలింగ్‌లో దూబే క్యాచ్ అవుట్ అయ్యాడు. దూబే 15 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. తిలక్ వర్మ ఎట్టకేలకు 22 బంతుల్లో 51 పరుగులు పూర్తి చేసి టీమిండియాకి చేయూతనందించాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?

ఒకప్పుడు స్నీకర్లను కేవలం క్రీడలకు లేదా సాధారణ అవసరాల కోసం ధరించే...

Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్‌లోని శాసనసభ్యుల్లో 50 శాతం మంది యువతేనని మంత్రి...

UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!

UP Election: 2027 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)-కాంగ్రెస్...

Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!

Flydubai Terror Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమాన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా...