5
November, 2026

A News 365Times Venture

5
Thursday
November, 2026

A News 365Times Venture

IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!

Date:

IND vs NZ: ఆక్లాండ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. బౌలర్ల సమష్టి కృషి, ఆ తర్వాత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతిలో భారత్‌కు 32 ఓవర్లలో 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. టీమిండియా మరో 56 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు భారత పేసర్లు ఆరంభం నుంచే చుక్కలు చూపించారు. అర్ష్‌దీప్ సింగ్ (4/70) ఆరంభంలోనే విల్ యంగ్ (9), హెన్రీ నికోల్స్ (9)లను అవుట్ చేసి దెబ్బకొట్టాడు. టిమ్ సీఫెర్ట్ (38), గ్లెన్ ఫిలిప్స్ (30), డారిల్ మిచెల్ (28) కాసేపు ప్రతిఘటించినా భారీ స్కోర్లు చేయలేకపోయారు. అన్షుల్ కంబోజ్ అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేవలం 22 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టగా.. గుర్నూర్ బ్రార్ 3 వికెట్లతో రాణించాడు. ఆఖర్లో బ్లెయిర్ టిక్నర్ (34), జాకబ్ డఫీ (15 నాటౌట్) పోరాడటంతో కివీస్ 40.2 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌట్ అయింది.

లక్ష్య ఛేదన ప్రారంభించిన భారత్‌కు మొదట్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (0) ఖాతా తెరవకుండానే జేమీసన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మధ్యలో వర్షం కారణంగా DLS పద్ధతిలో 143 పరుగుల లక్ష్యాన్ని అందించారు. దీనితో కోహ్లీ, గిల్ రెండో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పారు. గిల్ 56 బంతుల్లో 37 పరుగులు చేసి నిలకడగా ఆడగా, కోహ్లీ మాత్రం టీ20 తరహాలో చెలరేగి ఆడాడు. విరాట్ కోహ్లీ కేవలం 51 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 74 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు. శ్రేయస్ అయ్యర్ (15) కాసేపు మెరుపులు మెరిపించాడు. ఒకే ఓవర్లో డఫీ బౌలింగ్‌లో కోహ్లీ, అక్షర్ పటేల్ వెనువెంటనే ఔటైనా.. కేఎల్ రాహుల్ (3 నాటౌట్), నమన్ ధీర్ (5 నాటౌట్) లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత్ 22.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసి ఘన విజయాన్ని అందుకుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AP Elections 2026: రేపు యథావిధిగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. విధుల్లో 2.52 లక్షల మంది సిబ్బంది!

AP MPTC and ZPTC Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ...