3
July, 2026

A News 365Times Venture

3
Friday
July, 2026

A News 365Times Venture

IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్‌లో కనిపించిన కీలక లోపాలు

Date:

IND vs ENG: భారత్–ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది.. చెస్టర్-లె-స్ట్రీట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అయితే, ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాకముందే ఎడతెరిపి లేకుండా వర్షం తగులుకోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.. టీమిండియా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 68 పరుగులతో అద్భుతంగా రాణించగా, అభిషేక్ శర్మ 59 పరుగులతో దూకుడైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇక, చివర్లో శివమ్ దూబే కేవలం 21 బంతుల్లో అజేయంగా 42 పరుగులు చేసి జట్టు స్కోరును 189కు చేర్చాడు. అభిషేక్–శ్రేయస్ మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు.

టీమిండియా 189 పరుగుల గౌరవప్రధమైన స్కోర్‌ చేసినా.. ఈ ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా బ్యాటింగ్‌లో కొన్ని బలహీనతలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. సంజు శాంసన్, ఇషాన్ కిషన్ తక్కువ స్కోర్లకే అవుట్ కావడంతో ఓపెనింగ్ జోడీపై ప్రశ్నలు తలెత్తాయి. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఇషాన్ కిషన్‌ రనౌట్ కావడం ఆందోళన కలిగించింది. అభిషేక్ శర్మ అవుటైన తర్వాత మధ్య ఓవర్లలో పరుగుల వేగం తగ్గడం కూడా జట్టుకు ప్రతికూలంగా మారింది.

తిలక్ వర్మ 13 బంతుల్లో 13 పరుగులే చేయడంతో మధ్య ఓవర్లలో వేగం పెంచలేకపోయాడు. అలాగే అక్షర్ పటేల్ కంటే ముందుగా హర్షిత్ రాణాను బ్యాటింగ్‌కు పంపిన వ్యూహం కూడా ఫలించలేదు. దీంతో టాప్ ఆర్డర్ స్థిరత్వం, మధ్య ఓవర్లలో రన్‌రేట్, రనౌట్‌లు, బ్యాటింగ్ క్రమం వంటి అంశాలు టీమ్ ఇండియాకు సవాలుగా మారాయి. ఇప్పుడు ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జూలై 4న మాంచెస్టర్‌లో జరగనుంది. తొలి మ్యాచ్ ఫలితం తేలకపోవడంతో ఈ పోరు సిరీస్‌లో కీలకంగా మారనుంది. టీమ్ ఇండియా తన బలహీనతలను సరిదిద్దుకుని విజయంతో సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

తొలి టీ20లో టీమ్ ఇండియా 5 ప్రధాన బలహీనతలు

* ఓపెనింగ్ ఆందోళనలు కొనసాగుతున్నాయి: సంజు శాంసన్, ఇషాన్ కిషన్ మరోసారి త్వరగా అవుటవ్వడంతో టాప్ ఆర్డర్‌లో అస్థిరత బయటపడింది.
* మధ్య ఓవర్లలో నెమ్మదైన బ్యాటింగ్: అభిషేక్ అవుటైన తర్వాత, 8వ నుంచి 14వ ఓవర్ల మధ్య పరుగులు చేసే వేగం గణనీయంగా తగ్గిపోయింది.
* రనౌట్ సమస్య: ఒక అపార్థం కారణంగా ఇషాన్ కిషన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ రనౌట్ కావడం జట్టుకు ఆందోళన కలిగించే విషయం.
* తిలక్ వర్మ నెమ్మది బ్యాటింగ్: తిలక్ వర్మ ఈ ఫార్మాట్‌ నెమ్మదిగా బ్యాటింగ్ చేసి, 13 బంతుల్లో 13 పరుగులు చేయడం..
* లోయర్-ఆర్డర్ ప్రయోగం: గౌతమ్ గంభీర్ ప్రత్యేక ఆటగాడైన హర్షిత్ రాణాను ఈ మ్యాచ్‌లో అక్షర్ పటేల్ కంటే ముందుగా బ్యాటింగ్‌కు పంపారు. అతని స్థానంలో అక్షర్‌ను పంపించి ఉండాల్సింది, కానీ హర్షిత్ కేవలం రెండు బంతులు ఆడి 0 పరుగులకే ఔటయ్యాడు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్‌పై బ్యాన్ విధించిన కేంద్రం..

Indian Govt: అప్పటి వరకు బాగానే నడుస్తున్న ఇ-రిక్షా (E-Rickshaw)లు ఒక్కసారిగా...

Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్‌ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటాయి

Green Chillies Storage Tips: పచ్చిమిరపకాయలు దాదాపు ప్రతి భారతీయ వంటింట్లో...

WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్‌పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన

WhatsApp Username Feature: వాట్సాప్‌లో త్వరలో అందుబాటులోకి రానున్న యూజర్‌నేమ్ ఫీచర్‌పై...