తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో కీలక మార్పులు చేస్తూ భారీ స్థాయిలో ఐఏఎస్ (IAS) అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ కె. రామకృష్ణారావు మూడు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేశారు. సెక్రటరీలు, జిల్లా కలెక్టర్లు , జీహెచ్‌ఎంసీ జోనల్ కమిషనర్లతో సహా పలువురు ఉన్నతాధికారులకు కొత్త బాధ్యతలు అప్పగించారు.
సంజయ్ కుమార్: పీఆర్ & ఆర్డీ (PR&RD) స్పెషల్ చీఫ్ సెక్రటరీ బాధ్యతల నుంచి బదిలీ అయి, న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు.
ఎం. దాన కిశోర్: లెటిఎఫ్ (LET&F) శాఖ నుంచి బదిలీ అయి, పీఆర్ & ఆర్డీ, ఆర్‌డబ్ల్యూఎస్ & ఆర్‌ఎస్ఏడి విభాగాలకు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే గవర్నర్‌కు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు (FAC) నిర్వహిస్తారు.
బి. విజయేంద్ర.. సోషల్ డెవలప్‌మెంట్ (SCD) శాఖ సెక్రటరీగా నియామకమయ్యారు. హరిచందన దాసరి.. హైదరాబాద్ కలెక్టర్ బాధ్యతల నుంచి బదిలీ అయి, లెటిఎఫ్ శాఖ సెక్రటరీగా నియమితులయ్యారు. వీరికి రెవెన్యూ శాఖ అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. శ్రీ కృష్ణ ఆదిత్య ఎస్.. ఇంటర్ బోర్డు సెక్రటరీ పోస్ట్ నుంచి బదిలీ అయి, పరిశ్రమలు & వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీగా నియమితులయ్యారు. శ్రీ జెండగే హనుమంత్ కొండిబా.. సివిల్ సప్లైస్ డైరెక్టర్ బాధ్యతల నుంచి బదిలీ అయి, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓగా నియామకమయ్యారు.
జిల్లాల కొత్త కలెక్టర్లు..
ప్రభుత్వం పలు జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. హైదరాబాద్ కలెక్టర్‌గా ప్రియాంక అలా, సంగారెడ్డి కలెక్టర్‌గా ప్రాతీక్ జైన్ (గతంలో కలెక్టర్‌గా ఉన్న పి. ప్రవిణ్య ఆర్&బీ శాఖ స్పెషల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు). ఖమ్మం కలెక్టర్‌గా దివాకర టీఎస్ (గతంలో కలెక్టర్‌గా ఉన్న అనుదీప్ దురిశెట్టి ఐటీఈ&సీ జాయింట్ సెక్రటరీగా బదిలీ అయ్యారు). నిర్మల్ కలెక్టర్‌గా… భవేష్ మిశ్రా (గతంలో కలెక్టర్‌గా ఉన్న అభిలాష అభినవ్ ఇంటర్ బోర్డు సెక్రటరీగా బదిలీ అయ్యారు). నారాయణపేట కలెక్టర్‌గా.. చెక్క ప్రియాంక, ములుగు కలెక్టర్‌గా హేమంత్ సహదేవరావ్ భోర్కడే, నాగర్‌కర్నూల్ కలెక్టర్‌గా కేశవ్ పాటిల్ నియమితులయ్యారు.
మున్సిపల్, ఇతర కీలక నియామకాలు..
జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్.. నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్ నుంచి సివిల్ సప్లైస్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. జి. ముకుంద రెడ్డి (2019).. జీహెచ్‌ఎంసీ గోల్కొండ జోనల్ కమిషనర్ నుండి ఐ&పీఆర్ స్పెషల్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అపూర్వ్ చౌహాన్.. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ నుండి సీసీఎల్ఏ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు.
ఐటీడీఏ పీఓలు.. ఉట్నూర్ ఐటీడీఏ పీఓగా మంద మకరందు, ఎటూరునాగారం ఐటీడీఏ పీఓగా లెనిన్ వత్సల్ టొప్పో బాధ్యతలు చేపట్టనున్నారు.
పాలనా యంత్రాంగంలో వేగం పెంచేందుకు. వివిధ శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ భారీ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వం పేర్కొంది. బదిలీ అయిన అధికారులందరూ తక్షణమే తమ కొత్త బాధ్యతల్లో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి.




