26
June, 2026

A News 365Times Venture

26
Friday
June, 2026

A News 365Times Venture

Home Minister Anitha: ‘మావిగన్’ పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు

Date:

Home Minister Anitha: మరోసారి ప్రతిపక్షంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు హోం మంత్రి వంగలపూడి అనిత.. “మావిగన్ పేరు ఎత్తితేనే ప్రజలు నవ్వుకుంటున్నారు” అంటూ వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాల కంటే మాటలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆమె విమర్శించారు. వైసీపీ పాలనలో కనీసం ఒక ఫైర్ ఇంజన్ కూడా కొనుగోలు చేయలేదని ఆమె ఆరోపించారు. ప్రజా భద్రత వంటి ముఖ్య అంశాలను నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. తప్పు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Read Also: TTD Laddu Sales Record: లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డు..

గతంలో అవగాహనలేని నాయకులు ఇష్టానుసారం వ్యవహరించి కోర్టుల నుంచి ఎదురుదెబ్బలు తిన్నారని అనిత వ్యాఖ్యానించారు. ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా ముందుకు సాగుతోందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వంటి నాయకుల మార్గదర్శకత్వంలో విజ్ఞతతో నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ చట్టబద్ధంగా మాత్రమే పనిచేస్తుందని, ఎక్కడా నిర్లక్ష్యానికి తావివ్వదని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, అత్యాధునిక సౌకర్యాలను కల్పించడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా ఏలూరులో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త మహిళా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని మంత్రి అనిత పేర్కొన్నారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఈ దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..

CM Yogi: అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర...

Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..

Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం వ్యవహారంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్...

Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!

విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తును ప్రత్యేక...