27
June, 2026

A News 365Times Venture

27
Saturday
June, 2026

A News 365Times Venture

YouTube Shorts‌లో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!

Date:

YouTube Shorts‌: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ (YouTube) లోని షార్ట్స్ (Shorts) కోసం పలు కొత్త ఫీచర్లను ప్రకటించింది. గత ఐదేళ్లుగా వినియోగదారుల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్‌ను ఆధారంగా తీసుకుని ఈ మార్పులను తీసుకువచ్చినట్లు సంస్థ తెలిపింది. వీటి ద్వారా వినియోగదారులకు మరింత బెటర్ వీక్షణ అనుభవం అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

క్లియర్ స్క్రీన్ మోడ్‌:

YouTube Shorts‌లో కొత్తగా క్లియర్ స్క్రీన్ మోడ్ “Clear Screen Mode” అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసినప్పుడు వీడియోపై కనిపించే టెక్స్ట్ వివరాలు, లైక్, కామెంట్, షేర్ వంటి ఐకాన్లు తాత్కాలికంగా కనిపించవు. దీంతో ఎలాంటి అంతరాయాలు లేకుండా పూర్తి స్క్రీన్‌లో వీడియోను చూడవచ్చు.

2X స్పీడ్ ప్లేబ్యాక్:

వినియోగదారుల నుంచి ఎక్కువగా వచ్చిన డిమాండ్ మేరకు యూట్యూబ్ షార్ట్స్ లో 2X ప్లేబాక్ స్పీడ్ ఫీచర్‌ను కూడా ప్రవేశపెడుతోంది. దీని సహాయంతో వీడియోలను రెట్టింపు వేగంతో చూడవచ్చు. ముఖ్యంగా సమాచారం ఆధారిత లేదా కొంచెం ఎక్కువ నిడివి ఉన్న షార్ట్ వీడియోలను త్వరగా వీక్షించాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

కొత్త ఆడియో కంట్రోల్స్:

ఇకపై షార్ట్స్ వీడియోల ఆడియోను మ్యూట్ చేయడం కూడా మరింత సులభం కానుంది. వీడియోను ట్యాప్ చేసి పాజ్ చేసిన తర్వాత ప్రత్యేకంగా ఇచ్చిన మ్యూట్ ఐకాన్ ద్వారా సౌండ్‌ను ఆఫ్ చేయవచ్చు. దీంతో వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా వీడియోలను వీక్షించగలరు.

షార్ట్స్ టైమర్:

యూట్యూబ్ మరో కొత్త ఫీచర్‌గా షార్ట్స్ టైమర్ ను పరిచయం చేస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు చూసే సమయాన్ని నియంత్రించుకోవచ్చు. టైమర్‌ను జీరోకి సెట్ చేసే అవకాశం కూడా ఉండటంతో మరింత ఖచ్చితమైన నియంత్రణ ఇందులో లభిస్తుంది.

ఫీడ్ సిఫార్సు:

వీడియోలపై వినియోగదారుల స్పందన ఆధారంగా కంటెంట్‌ను సిఫార్సు చేసే విధానంలో కూడా యూట్యూబ్ మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉన్న థంబ్-అప్ బటన్ స్థానంలో హార్ట్ (❤) ఐకాన్ ను తీసుకురానుంది. అలాగే షార్ట్స్ ప్లేయర్‌లో ఉన్న డిస్ లైక్ బటన్‌ను తొలగించనుంది. యూట్యూబ్ ప్రకారం, డిస్‌లైక్ బటన్ ద్వారా వినియోగదారుల అభిప్రాయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడం కష్టమవుతోందని తెలిపింది. కొందరు వీడియో నాణ్యత బాగోలేదని డిస్‌లైక్ చేస్తే.. మరికొందరు కేవలం ఆ కంటెంట్‌పై ఆసక్తి లేక డిస్‌లైక్ చేస్తున్నారని సంస్థ గుర్తించింది.

‘Not Interested’ ఆప్షన్‌:

డిస్‌లైక్ బటన్ స్థానంలో “Not Interested”, “Don’t Recommend This Channel” వంటి ఎంపికలను మరింత ప్రాధాన్యంతో ఉపయోగించనున్నారు. వీటి ద్వారా వినియోగదారుల అభిరుచులను మెరుగ్గా అర్థం చేసుకుని, వారికి అనుగుణమైన వీడియోలను సిఫార్సు చేయనున్నట్లు యూట్యూబ్ వెల్లడించింది. అయితే కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా ఉన్న వీడియోలను రిపోర్ట్ చేసే అవకాశం మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. ఈ కొత్త ఫీచర్లు దశలవారీగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ షార్ట్స్ వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Amaravati Tension: ఉండవల్లిలో హైటెన్షన్.. వైసీపీ నేతలపై కోడిగుడ్లు, రాళ్ల దాడి

Amaravati Tension: అమరావతి రాజధాని ప్రాంతంలో పర్యటించేందుకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్...

PM Modi: సీషెల్స్‌లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన

ప్రధాని మోడీ సీషెల్స్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన కోసం శనివారం...

Pawan Kalyan: వైసీపీకి పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.. మౌనం బలహీనత కాదు..!

Pawan Kalyan: జనసేన పార్టీ సంస్థాగత బలోపేతంపై దృష్టి సారిస్తూ పార్టీ...