24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?

Date:

Gyanesh Kumar: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ మరోసారి ప్రతిపక్షాలకు టార్గెట్‌గా మారారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)విషయంలో మరో ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి గత 10 నెలల్లో 14 సార్లు అభ్యంతరం తెలిపినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించడం సంచలనంగా మారింది. అయితే, ఈ నివేదికను ఈసీ తోసిపుచ్చింది. ఎన్నికల సంఘంలో ప్రతీ నిర్ణయం తీసుకునేటప్పుడు లిఖితపూర్వక వ్యాఖ్యలు, విభేదాలు, సూచనలు సమర్పించడం తన సహజమైన, ప్రజాస్వామ్యయుతమైన అంతర్గత ప్రక్రియలో భాగమని పేర్కొంది.

ఐఐటీ నుంచి హార్వర్డ్ వరకు జ్ఞానేష్ కుమార్ విద్యానేపథ్యం..

కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్, 2025 ఫిబ్రవరి 19న దేశ 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన కేవలం ఒక సాధారణ బ్యూరోక్రాట్ మాత్రమే కాదు, అద్భుతమైన విద్యా నేపథ్యాన్ని కలిగి ఉన్నారు. 1985లో ఐఐటీ కాన్పూర్ నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్ డిగ్రీ పొందారు. ఐసీఎఫ్ఏఐలో బిజినెస్ ఫైనాన్స్ లో చదవారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్‌లో డిగ్రీ సంపాదించారు.

ఆర్టికల్ 370 నుంచి రామ మందిరం వరకు..

కేరళ రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ నుంచి కార్యదర్శి వరకు అనేక పదవుల్లో జ్ఞానేష్ కుమార్ పనిచేశారు. ఆర్టికల్ 370 రద్దు సమయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో కాశ్మీర్ విభాగానికి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. 2019 ఆగస్టులో జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370ని తొలగించిన చారిత్రాత్మక బిల్లు ముసాయిదా రూపకల్పనలో ముఖ్యమైన, వ్యూహాత్మక పాత్ర పోషించారు.

హోం మంత్రిత్వ శాఖలో ఉన్న సమయంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం, శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ ఏర్పాటుకు సంబంధించిన చట్టపరమైన, పరిపాలన అంశాలలో కీలక పాత్ర పోషించారు. ఎన్నికల సంఘంలో చేరకముందు ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన సహకార మంత్రిత్వ శాఖకు కార్యదర్శిగా పనిచేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమను ఉగ్రవాదులు అని పిలిచారు.. కానీ మేము...

AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..

AP Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్‌ తీరం వైపు దూసుకొస్తుంది తీవ్ర...

SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..

మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం డెబిట్ కార్డు...

Gautam Gambhir: సంజు శాంసన్‌ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..

ఇంగ్లాండ్ సిరీస్ సమయంలో సంజు శాంసన్‌ను పక్కనపెట్టి వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్...