24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

Gautam Gambhir: సంజు శాంసన్‌ విషయంలో తప్పు చేశా.. ఆ రాత్రి నాకు నిద్ర కూడా పట్టలేదు..

Date:

ఇంగ్లాండ్ సిరీస్ సమయంలో సంజు శాంసన్‌ను పక్కనపెట్టి వైభవ్ సూర్యవంశీని ప్లేయింగ్ ఎలెవెన్‌లో ఆడించడం తన కెరీర్‌లోనే అత్యంత కఠినమైన నిర్ణయమని టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వెల్లడించారు. ఈ నిర్ణయం తీసుకున్న రాత్రి తప్పు చేశాననే ఫీలింగ్ వచ్చిందని..  అస్సలు నిద్రపట్టలేదని ఆయన తెలిపారు. సంజు శాంసన్‌తో తాను స్వయంగా ఈ విషయం గురించి మాట్లాడానని, జట్టు అవసరాలరీత్యా ఆ సమయంలో వైభవ్ ఫామ్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని గంభీర్ పేర్కొన్నారు.

వెస్టిండీస్‌తో జరిగిన అండర్-19 పర్ఫామెన్స్, ఐపీఎల్‌లో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ అప్పట్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు సంజు శాంసన్ కొన్ని ఇన్నింగ్స్‌ల్లో నిలకడగా రాణించలేకపోవడంతో, ఓపెనింగ్ స్థానంలో వేగంగా పరుగులు సాధించే ఆటగాడి అవసరం జట్టుకు ఎంతైనా ఉండేది. అయితే టోర్నమెంట్‌లో అప్పటి వరకు అద్భుతంగా రాణించిన ఆటగాడిని కేవలం మూడు, నాలుగు మ్యాచ్‌ల తర్వాత పక్కనపెట్టడం సులభం కాదని గంభీర్ అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ.. సోషల్ మీడియా ఒత్తిడికి , బయట జరిగే చర్చలకు తలొగ్గి తుది జట్టును ఎంపిక చేయలేమని, దేశానికి ఏది సరైనదో అదే నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు.. న్యూజిలాండ్‌తో త్వరలో ప్రారంభంకానున్న టెస్టు సిరీస్‌కు భారత్ సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో కీలక ఆటగాళ్లకు వైట్ బాల్ క్రికెట్ నుంచి తగిన విశ్రాంతి ఇవ్వాలని కోచింగ్ సిబ్బంది భావిస్తోంది. పొట్టి ఫార్మాట్ నుంచి వన్డేలు, టెస్టులకు మారడం అంత సులభం కానందున, టెస్టు మ్యాచ్‌లకు ముందు బ్యాటర్లకు తగిన బ్రేక్ ఇవ్వడం ద్వారా వారిని మానసికంగా, శారీరకంగా సిద్ధం చేయవచ్చని గంభీర్ అభిప్రాయపడ్డారు. మొత్తానికి జాతీయ జట్టు ఎంపికలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తున్నప్పటికీ, ఆటగాళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు.

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?

OTR: ఆ టీడీపీ ఎమ్మెల్యేకి నిద్ర పట్టడం లేదా? ఏం చేయాలో...

Story Board: సర్ పేరుతో ఏమిటీ ప్రహసనం..? సామాన్యుల దగ్గర్నుంచీ వీవీఐపీల దాకా ఎవర్నీ వదలరా..?

Story Board: దేశంలో ఓటర్ల జాబితా సమగ్ర ప్రక్షాళనకు ఉద్దేశించిన సర్...

ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తాజాగా విడుదల చేసిన నూతన ప్లేయర్...

Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన

టర్కీ బుద్ధి మారలేదు. డీజిల్ కోసం భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. మళ్లీ...