31
October, 2026

A News 365Times Venture

31
Saturday
October, 2026

A News 365Times Venture

Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..

Date:

భారత్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 87 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ (107 పరుగులు, 49 బంతుల్లో) బాది ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్న గ్లెన్ ఫిలిప్స్ మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ.. నా బ్యాటింగ్ ప్రదర్శన చాలా అద్భుతంగా సాగింది. ఈ రోజు పిచ్ బ్యాటింగ్‌కు చాలా బాగా సహకరించింది. మేము దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాం, ఇది చాలా సంతోషంగా ఉంది. జట్టు విజయంలో నా వంతు పాత్ర పోషించడం చాలా ఆనందంగా అనిపించింది.

మైకేల్ బ్రేస్‌వెల్‌తో కలిసి చేసిన భాగస్వామ్యం గురించి చెప్పాలంటే.. ఈ ఎండ్ నుంచి వీచే గాలి కారణంగా షాట్లు ఆడటం కొద్దిగా సులభంగా ఉంటుందని మేం మాట్లాడుకున్నాం. అయితే బ్రేస్‌వెల్ బ్యాటింగ్ తీరు చూస్తుంటే ఏ ఎండ్ నుంచి ఆడుతున్నాడనే దానితో సంబంధం లేకుండా చెలరేగిపోతాడు. ముఖ్యంగా మ్యాచ్ ఉత్కంఠగా సాగుతున్న సమయంలో, భారత్ చేతి నుంచి మ్యాచ్‌ను మా వైపునకు తిప్పుకోవడానికి ఈ భాగస్వామ్యం చాలా బాగా ఉపయోగపడింది. గత మూడు మ్యాచ్‌లు ఓడిపోవడం మాకు చాలా బాధ అనిపించింది.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా పుంజుకోవాలనుకున్నాం.. సమిష్టి కృషితో అది సాధ్యమైందని అన్నాడు.

గత ఆరు నెలల నుంచి ఒక ఏడాది కాలంగా నా బ్యాటింగ్ శైలిలో వచ్చిన మార్పుల గురించి చెప్పాలంటే.. క్రికెట్‌లో ఫామ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్నిసార్లు బంతి బాగా కనిపిస్తుంది, మరికొన్నిసార్లు సరిగ్గా ఆడలేం. ఈ మంచి ఫామ్‌ను వీలైనంత కాలం కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాను. మైదానంలో సాధ్యమైనంత వరకు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి చూస్తున్నానన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Mitchell Santner: 259 స్కోర్ చేసినా టీమిండియా ఫామ్ చూసి భయమేసింది.. ఆ ఒక్కటే మ్యాచ్‌ను మలుపుతిప్పింది: కివీస్ కెప్టెన్

నాలుగో టీ20 మ్యాచ్‌లో సాధించిన భారీ విజయంపై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్...

చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో కలకలం రేగింది. కమ్మెట గ్రామ...

Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..

విశాఖపట్నం మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నకిలీ కరెన్సీ చెలామణి...

Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!

Israel Elections: ఇజ్రాయిల్ రాజకీయాల్లో ఇది పెను సంచలనంగా చెప్పొచ్చు. ఒది...