31
October, 2026

A News 365Times Venture

31
Saturday
October, 2026

A News 365Times Venture

OTR: సుభాష్ రెడ్డి పేరు వింటేనే ఉలిక్కిపడుతున్న గులాబీ నేతలు.. అసలు సంగతేంటి

Date:

OTR: ఆ ఇంటి గడప తొక్కారో…. ఇక అంతే సంగతులు. మీరు బీఆర్‌ఎస్‌లో ఉన్నామన్న సంగతి మర్చిపొండి. రమ్మన్నారు కదా…. అని పొరపాటున ఆయన కారెక్కారో… ఇక అంతే సంగతులు. ఆ రోజుతో మీరు కారు పార్టీలో బంధం తెగినట్టే. ప్రస్తుతం అక్కడ బీఆర్‌ఎస్‌ కేడర్‌కు ఇలాంటి హెచ్చరికలే వస్తున్నాయట. ఎక్కడ, ఎందుకా వార్నింగ్స్? వాళ్ళని అంతలా భయపెడుతున్న ఆ వ్యక్తి ఎవరు? కామారెడ్డి జిల్లా గులాబీ పార్టీ నేతలకు కొత్త టెన్షన్ పట్టుకుందట. జిల్లాకు చెందిన వ్యాపార వేత్త, ఎస్.ఆర్. పౌండేషన్ అధినేత తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి పేరు వింటేనే వాళ్లంతా ఉలిక్కిపడుతున్నట్టు తెలుస్తోంది. బీబీపేట మండలం జనగామకు చెందిన సుభాష్ రెడ్డి సొంత నిధులతో సర్కారు స్కూళ్లను కార్పొరేట్ తరహాలో కట్టించి తనదైన ముద్ర వేస్తున్నారు.

అలాగే… ఎస్.ఆర్. పౌండేషన్ పేరుతో కామారెడ్డి పట్టణంలోని లక్ష మందికి ఉపయోగపడేలా ఆధునిక సౌకర్యాలతో మహాప్రస్ధానం నిర్మిస్తున్నారు. ఇటీవలే నియోజకవర్గ వ్యాప్తంగా.. ఒక్కో గ్రామ పంచాయతీకి 2 లక్షలు విలువ చేసే ఫర్నిచర్‌ను సొంత డబ్బుతో కొనిచ్చారు. ఆయన ఏ ఉద్దేశ్యంతో ఇదంతా మొదలుపెట్టారోగానీ… చివరికి అది రాజకీయాల వైపే దారి తీస్తోంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఇదంతా చేస్తున్నారని, పొలిటికల్‌ స్టెప్స్‌ వేయబోతున్నారన్న ఫీలింగ్‌ స్థానికంగా బల పడింది. అందుకు తగ్గట్టే… త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ప్రకటించేశారాయన. దీంతో… సొంత డబ్బు ఖర్చుపెడుతూ సౌకర్యాలు కల్పిస్తున్నారు… ఆయన శ్రీమంతుడు సినిమాలో మహేష్‌బాబు టైప్‌ అంటూ తెగ పొగిడేసిన లోకల్‌ లీడర్స్‌… పక్కలో బాంబు పడ్డట్టు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారట. ఈయనగారు ఇప్పుడొచ్చి మా సీటుకు ఎక్కడ ఎర్త్ పెడతారోనని కామారెడ్డి నేతల్లో కంగారు మొదలైంది.

ఆ క్రమంలో… ముందుగా గులాబీ నేతలు అలెర్ట్ అయ్యారట. పార్టీ శ్రేణులు ఎవ్వరూ సుభాష్‌రెడ్డి ఇంటి గడప తొక్కొద్దు, ఆయనతో తిరగొద్దంటూ క్లియర్‌ కట్‌ ఆదేశాలు ఇచ్చేశారట. ఆదేశించడమే కాదు, యాక్షన్‌ కూడా మొదలుపెట్టేశారు. తమ గ్రామ పంచాయతీకి ఫర్నిచర్ కావాలంటూ తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డిని కలిసిన పాల్వంచ సర్పంచ్ శంకర్‌పై కామారెడ్జి జిల్లా గులాబీ పార్టీ వేటు వేసింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ సస్పెన్షన్ అంశం ఇప్పుడు కామారెడ్డి జిల్లా పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌ అయింది. లోకల్‌ గులాబీ నేతలకు సుభాష్‌రెడ్డి కలలో కూడా కనిపిస్తున్నారంటూ సెటైర్స్‌ కూడా పడుతున్నాయి. వాస్తవానికి సుభాష్ రెడ్డి.. గత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారట. ఈ విషయం తెలిసిన మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆయన్ని అడ్డుకోవడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేసినట్టు చెబుతున్నారు. కానీ బీఆర్‌స్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడని పేరున్న సుభాష్.. ఈసారి ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమేనని అంటున్నారు.

గత ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగడం కూడా సుభాష్‌రెడ్డి వెనక్కి తగ్గడానికి ఒక కారణం. ఇక అప్పట్నుంచి ఏ పార్టీలో చేరకుండా.. సామాజిక కార్యక్రమాలతో నియోజకవర్గంలో పలుకుబడి పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారాయన. కొద్ది రోజులుగా ఆయనకు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీల నుంచి ఆహ్వానాలు అందుతున్నట్టు చెబుతున్నారు సన్నిహితులు. దీంతో ఈసారి ఎన్నికల బరిలో సుభాష్‌ రెడ్డి దిగడం ఖాయమైపోయింది. అందుకే కామారెడ్డి గులాబీ పార్టీ నేతలు ముందు చూపుతో సదరు వ్యాపారవేత్త కదలికలపై నిఘా పెట్టారట. ఎవరెవరు ఆయన్ని కలుస్తున్నారంటూ ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఆ క్రమంలోనే పాల్వంచ సర్పంచ్‌ను బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్ చేసినట్టు తెలిసింది. మరికొంత మంది కార్యకర్తలను కూడా వివరణ కోరారట. పొరపాటునో గ్రహపాటునో సుభాష్‌ రెడ్డి తమ పార్టీలో చేరితే ఎక్కడ తమ సీటుకు ఎసరొస్తుందోనన్నది కామారెడ్డి గులాబీ లీడర్స్‌ టెన్షన్‌. కేటీఆర్‌కు సన్నిహితుడని చెబుతున్నా…. మూడు ముఖ్యమైన పార్టీల నుంచి ఆఫర్స్‌ ఉన్నందున ఫైనల్‌గా ఆయన ఎటువైపు మొగ్గుతారన్న క్లారిటీ లేదు. కానీ… లోకల్‌ గులాబీ లీడర్స్‌ మాత్రం ఆ ఇంటి గడప తొక్కొద్దంటూ తమ నాయకుల్ని ఆదేశించడం చర్చనీయాంశమైంది.

 

 

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

చేవెళ్ల ఫామ్‌హౌస్‌లో విద్యార్థుల పార్టీపై పోలీసుల ఆకస్మిక దాడి.. భారీగా మద్యం పట్టివేత!

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలో కలకలం రేగింది. కమ్మెట గ్రామ...

Fake Currency: విశాఖలో భారీగా నకిలీ కరెన్సీ కలకలం.. 66 లక్షల విలువైన నోట్లు పట్టివేత..

విశాఖపట్నం మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నకిలీ కరెన్సీ చెలామణి...

Israel Elections: యూదుల గడ్డపై అరబ్ పార్టీల హవా.. నెతన్యాహూకు షాక్.!

Israel Elections: ఇజ్రాయిల్ రాజకీయాల్లో ఇది పెను సంచలనంగా చెప్పొచ్చు. ఒది...

Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..

భారత్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు 87 పరుగుల...