8
October, 2026

A News 365Times Venture

8
Thursday
October, 2026

A News 365Times Venture

Fraud Wedding: ఆప్ నాయకుడిని పెళ్లి పేరుతో బురిడీ కొట్టించిన నకిలీ అధికారిణి.. ఆ తర్వాత ఏమైందంటే..!

Date:

మోసపోయేవాళ్లుంటే.. మోసం చేసేవాళ్లు కూడా పెరిగిపోతున్నారు. ఈ మధ్య టెక్నాలజీ పెరిగాక ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. అయినా కూడా అప్రమత్తం కావడం లేదు. ఇందులో సామాన్యుల దగ్గర నుంచి నాయకుల వరకు అందరి పరిస్థితి ఇలానే ఉంది. తాజాగా పంజాబ్‌లో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అధికారిణిగా నటిస్తూ.. ఆప్ నాయకుడిని పెళ్లి చేసుకుంది. అన్ని చక్కబడ్డాక.. వధువు అత్తారింట్లో విలువైన నగలు సర్దుకుని పరారైంది. దీంతో బాధిత కుటుంబ లబోదిబో అంటుంది. అసలేమైంది? పెళ్లిదాకా ఎలా వెళ్లింది. తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

పంజాబ్‌లో ఆప్ సంయుక్త కార్యదర్శి అమరీందర్ సింగ్.. మన్విందర్ కౌర్‌ను ఫిబ్రవరి 2026లో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్, కేబినెట్ మంత్రి తరుణ్‌ప్రీత్ సింగ్ సౌంధ్ సహా పలువురు ప్రముఖ ఆప్ నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అయితే కొద్ది రోజులకే వధువు అసలు బండారం బయటపడింది. కొన్ని నెలల్లోనే ఆమె ఇంట్లో నగలు, విలువైన వస్తువులతో పరారైపోయింది. దీంతో బాధిత కుటుంబం షాక్‌కు గురైంది. అయితే పెళ్లి సమయంలో మన్విందర్ కౌర్‌ను సీపీఎస్ అధికారిణిగా కుటుంబ సభ్యులు పరిచయం చేశారని.. ఆమెకు గతంలోనే పెళ్లైందని.. 18 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడని అమరీందర్ సింగ్ ఆరోపించాడు. తప్పుడు సమాచారం.. అంతేకాకుండా తప్పుడు వయసుతో నమ్మించి మోసం చేశారని తెలిపాడు. గతంలో పెళ్లై, విడాకులు తీసుకున్న సమాచారాన్ని దాచి పెట్టారని చెప్పాడు.

బాధితుడు అమరీందర్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురిపై మోసం, ఫోర్జరీ కేసు నమోదు చేశారు. నిందితులు ఆమె సోదరుడు తర్లోచన్ సింగ్, తల్లి వరీందర్‌జిత్ కౌర్, కజిన్ నరీందర్ సింగ్ గోల్డీ, వదిన రూపిందర్ కౌర్, మాజీ గ్రామ సర్పంచ్ సురీందర్ సింగ్ రాణా ఉన్నారు. నిందితులందరూ తార్న్ తారన్ జిల్లాలోని భిఖివింద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుర్ సింగ్ గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం

పాకిస్థాన్‌లో ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, రాజకీయ సవాళ్లు పెరుగుతున్నాయి. ఇంకోవైపు...

Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..

Congress Protest: ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)ను వ్యతిరేకిస్తూ,...

SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్‌ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?

ఎస్‌ఐఆర్ (SIR), కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా...

WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..

భారత్ , వెస్టిండీస్ మధ్య లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో జరిగిన...