6
August, 2026

A News 365Times Venture

6
Thursday
August, 2026

A News 365Times Venture

Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!

Date:

Crispy Wheat Flour Snacks: సాయంత్రం టీ సమయానికి ఏమైనా కరకరలాడే స్నాక్స్ తినాలనిపించినప్పుడు, బయటి జంక్ ఫుడ్ కొనే బదులు ఇంట్లోనే ఉన్న గోధుమపిండితో ఆరోగ్యకరమైన స్నాక్స్ చేసుకోవచ్చు. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఈ క్రిస్పీ చిప్స్ తయారుచేయడం చాలా తేలిక, అలాగే రుచిలోనూ అద్భుతంగా ఉంటాయి. వీటిని ఒక్కసారి ఎక్కువ మొత్తంలో చేసుకుని నిల్వ ఉంచుకుంటే.. వర్షం పడేటప్పుడైనా లేదా టీ టైమ్‌లోనైనా లేదా ఎప్పుడు పడితే అప్పుడు హ్యాపీగా ఆస్వాదించవచ్చు. ఇప్పుడు ఈ కరకరలాడే గోధుమపిండి బిస్కెట్లను పర్ఫెక్ట్‌గా ఎలా తయారుచేయాలో చూద్దాం.

కావలసిన పదార్థాలు:

* గోధుమపిండి: 1/2 కేజీ (4 కప్పులు)
* వాము: 1 టేబుల్ స్పూన్
* జీలకర్ర: 1 టీస్పూన్
* నువ్వులు: 3 – 4 టేబుల్ స్పూన్లు
* కారం: 2 స్పూన్లు
* ఉప్పు: రుచికి సరిపడా (సుమారు 2.5 స్పూన్లు)
* వేడి నూనె: 1/2 కప్పు
* నీళ్లు: కలుపుకోవడానికి సరిపడా (సుమారు 1.25 కప్పులు)
* డీప్ ఫ్రైకి సరిపడా నూనె

తయారీ విధానం:

మొదటగా ఒక గిన్నెలో గోధుమపిండి, వాము, జీలకర్ర, నువ్వులు, కారం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో అర కప్పు వేడి నూనె పోసి, గరిటెతో బాగా తిప్పాలి. నూనె చల్లారాక, పిండిని చేత్తో ఒత్తుతూ ముద్దలా అయ్యేలా 2-3 నిమిషాలు కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పూరీ పిండి కంటే కాస్త గట్టిగా కలుపుకోవాలి (మెత్తగా ఉండకూడదు). అలా ఆ పిండిపై మూత పెట్టి అర గంట సేపు నాననివ్వాలి.

నానిన పిండిని 4 భాగాలుగా విభజించుకోవాలి. డ్రై అవ్వకుండా ఒక భాగం తీసుకుని మిగిలిన పిండిపై మూత పెట్టాలి. తీసుకున్న పిండి ఉండకు పొడిపిండి అద్ది చపాతీలా ఒత్తుకున్నాక, లోపల పొరలు (లేయర్స్) రావడం కోసం నాలుగు వైపులా మడతబెట్టి (ఫోల్డ్ చేసి) మళ్లీ ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలి. ఇప్పుడు చాకుతో మీకు నచ్చిన డైమండ్ లేదా స్క్వేర్ షేప్‌లో ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ముక్కలుగా తయారైన వాటిని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక, ఫ్లేమ్ ని సిమ్‌లో ఉంచి కట్ చేసుకున్న బిస్కెట్ ముక్కలను వేయాలి. వీటిని సన్న, మీడియం ఫ్లేమ్ మధ్య మాత్రమే వేయించాలి. పెద్ద మంటలో వేయిస్తే పైన రంగు వచ్చి లోపల మెత్తగా ఉండిపోతాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక నూనె వడకట్టి బయటకు తీయాలి. అంతే.. గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ రెడీ.! బాగా చల్లారిన తర్వాత వీటిని ఎయిర్ టైట్ కంటెయినర్‌లో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

AIIMS: మరో రెండు ఎయిమ్స్‌లు మంజూరు చేయాలి.. కేంద్రానికి ఎంపీ లింగమనేని రమేశ్ విజ్ఞప్తి!

ఆంధ్రప్రదేశ్‌లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్రానికి మరో...

Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!

Best EV Bikes: భారతదేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, పెట్రోల్‌లో ఇథనాల్...

Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!

కేబినెట్ సమావేశానికి ముందు రాష్ట్ర మంత్రులతో మంత్రి నారా లోకేష్ నిర్వహించిన...