8
May, 2026

A News 365Times Venture

8
Friday
May, 2026

A News 365Times Venture

CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు

Date:

CM Chandrababu: అమరావతిలో నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు రాష్ట్ర శాంతిభద్రతల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. నేరాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాలు, సైబర్ నేరాలు, ఆర్థిక మోసాల నివారణ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అయితే, ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాల శాతం తగ్గినట్లు వివరించారు.

డీజీపీ తెలిపిన వివరాల ప్రకారం:
* మహిళలపై నేరాలు 7 శాతం తగ్గాయి
* చోరీలు 8 శాతం తగ్గాయి
* ఆర్థిక నేరాలు 0.3 శాతం తగ్గాయి
* ఎస్సీ, ఎస్టీలపై నేరాలు 30 శాతం తగ్గాయి
* సైబర్ నేరాల్లో బాధితులు మొత్తం రూ.652 కోట్లు కోల్పోయారని, అందులో రూ.116 కోట్లు ఫ్రీజ్ చేయగలిగామని డీజీపీ వెల్లడించారు.

సైబర్ నేరాలపై మరింత అప్రమత్తత అవసరం
సైబర్, ఆర్థిక నేరాలను అరికట్టడంలో మరింత చురుకుగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజల్లో అవగాహన పెంచడం అత్యంత అవసరమని సూచించారు. సైబర్ నేరాలను సమర్థంగా నియంత్రించేందుకు ప్రత్యేక సైబర్ ఫోర్స్‌తో “సైబర్ వార్ రూమ్” ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల నివారణపై ఫోకస్
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ల వద్ద ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని ఫలితాలు చూపించాలని అధికారులకు చెప్పారు.

కన్విక్షన్ రేటు పెంపుపై దృష్టి
2025లో రాష్ట్రంలో కన్విక్షన్ రేటు 44 శాతంగా ఉండగా, 2026లో అది 49.8 శాతానికి పెరిగినట్లు డీజీపీ వివరించారు. అయితే దీన్ని 70 శాతానికి తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని సీఎం నిర్దేశించారు. టెక్నాలజీని వినియోగించి ఆధారాలు సేకరించడం, వేగవంతమైన దర్యాప్తు ద్వారా నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూడాలని సూచించారు. ఇక “ఇన్ విజిబుల్ పోలీస్ కాదు.. విజిబుల్ పోలీసింగ్ చేసి చూపించాలి” అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలీసుల చర్యలు చూసి నేరం చేయాలంటేనే భయపడే పరిస్థితి రావాలని అన్నారు. చోరీ కేసుల్లో ఫిర్యాదు వచ్చిన 24 గంటల్లోనే నిందితులను పట్టుకునేలా చర్యలు ఉండాలని సూచించారు.

ఎర్రచందనం అక్రమ రవాణాపై డీజీపీ వివరాలు
గత ఏడాదిలో 50 వేల కిలోల ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నామని డీజీపీ తెలిపారు. ఈ కేసుల్లో 302 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో 91 శాతం కన్విక్షన్ రేటు నమోదైందని చెప్పారు. పోలీసింగ్‌లో సాంకేతికత వినియోగాన్ని పెంచుతున్నామని డీజీపీ తెలిపారు. గత ఏడాదిలో డ్రోన్ల ద్వారా లక్ష గంటలపాటు సర్విలెన్స్ నిర్వహించామని చెప్పారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో కూడా డ్రోన్ల వినియోగాన్ని పెంచినట్లు వెల్లడించారు.

జిల్లా ఎస్పీల ప్రజెంటేషన్లు
సమావేశంలో పలువురు జిల్లా ఎస్పీలు తమ జిల్లాల్లో అమలు చేస్తున్న విధానాలను వివరించారు. ముఖ్యంగా కుల వివాదాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, ప్రజా భద్రత అంశాల్లో చేపట్టిన చర్యలను వివరించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగబోతున్నాయా? వాహనదారులకు కేంద్రం షాక్ ఇవ్వబోతుందా?...

Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌కు లైన్‌క్లియర్.. రేపే ప్రమాణస్వీకారం

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్‌కు లైన్‌క్లియర్ అయింది. ఐదు రోజుల ఉత్కంఠకు తెరపడింది....

Amit Shah: గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు బీజేపీ..

Amit Shah: పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ సర్కార్ ఏర్పడబోతోంది. బీజేపీ తొలి...

Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. తొలి బీజేపీ సీఎంగా రికార్డ్..

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు...