29
September, 2026

A News 365Times Venture

29
Tuesday
September, 2026

A News 365Times Venture

Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!

Date:

Clothes Smell: వర్షాకాలంలో ఇంట్లో ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో బట్టలకు ఉండే తేమ వల్ల వాసన కూడా ఒకటి. వరుసగా వర్షాలు పడటం, సూర్యరశ్మి సరిగ్గా అందకపోవడంతో బట్టలు పూర్తిగా ఆరకపోవచ్చు. దీంతో వాటిలో బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగి దుర్వాసన రావడం మొదలవుతుంది. కాటన్ బట్టలతో పాటు ఖరీదైన సిల్క్ దుస్తులకు కూడా ఈ సమస్య ఎదురవుతుంది. అంతేకాదు.. అల్మారాలో జాగ్రత్తగా మడతపెట్టి పెట్టిన బట్టలు కూడా తేమ కారణంగా వాసన రావచ్చు. అయితే కొన్ని సింపుల్ “హోం హ్యాక్స్” పాటిస్తే ఈ సమస్యను చాలావరకు తగ్గించుకోవచ్చు. మరి బట్టలకు పూలలాంటి సువాసన రావాలంటే ఈ చిట్కాలు పాటించండి.

వైట్ వెనిగర్, బేకింగ్ సోడా:

కాటన్ బట్టలను ఉతికేటప్పుడు చివరి రిన్స్ నీటిలో అర కప్పు వైట్ వెనిగర్ లేదా 1 లేదా 2 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపవచ్చు. ఇవి బట్టల్లో ఉన్న దుర్వాసనను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే వెనిగర్, బేకింగ్ సోడాను ఒకేసారి కలిపి ఉపయోగించకుండా.. విడివిడిగా ఉపయోగించడం మంచిది.

ఎసెన్షియల్ ఆయిల్ స్ప్రే:

లావెండర్, రోజ్ లేదా లెమన్‌గ్రాస్ ఎసెన్షియల్ ఆయిల్‌లో 5 చుక్కలను ఒక కప్పు నీటిలో కలిపి స్ప్రే బాటిల్‌లో వేసుకోవచ్చు. బట్టలు పూర్తిగా తడిగా కాకుండా స్వల్పంగా తేమగా ఉన్నప్పుడు దూరం నుంచి కాస్త స్ప్రే చేయాలి. ముందుగా బట్టలోని కనిపించని చిన్న భాగంపై పరీక్షించడం మంచిది. ముఖ్యంగా సిల్క్ దుస్తుల విషయంలో జాగ్రత్త అవసరం.

కర్పూరం, నాఫ్తలీన్ బాల్స్:

అల్మారాలోని తేమ, పురుగుల సమస్యను తగ్గించడానికి కర్పూరం లేదా నాఫ్తలీన్ బాల్స్‌ను ఉపయోగిస్తుంటారు. వీటిని బట్టలకు నేరుగా తగలకుండా చిన్న పొట్లంలో వేసి అల్మారా మూలల్లో ఉంచవచ్చు. అయితే నాఫ్తలీన్ బాల్స్‌ను పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచాలి.

కర్పూరం, లవంగాలతో సహజ ఫ్రెషనర్:

ఒక చిన్న కాటన్ క్లాత్‌లో కర్పూరం, 5 లవంగాలు, కొద్దిగా వాము వేసి మూటలా కట్టి బట్టలు ఉండే ప్రదేశంలో వేలాడదీయవచ్చు. వీటి సువాసనతో అల్మారా లేదా గదిలో తాజా వాసన ఉండేలా చేసుకోవచ్చు. అయితే ఇది తేమకు ప్రధాన పరిష్కారం కాదు. గదిలో వెంటిలేషన్, బట్టలు పూర్తిగా ఆరబెట్టడం కూడా ముఖ్యమే.

ఫ్యాబ్రిక్ సాఫ్టెనర్‌:

కాటన్ దుస్తులకు తగిన ఫ్యాబ్రిక్ కండిషనర్ లేదా సాఫ్టెనర్‌ను ఉపయోగించడం ద్వారా బట్టలకు మంచి వాసన వచ్చేలా చేసుకోవచ్చు. అయితే సిల్క్ వంటి సున్నితమైన వస్త్రాలకు సాధారణ సాఫ్టెనర్ ఉపయోగించే ముందు దాని లేబుల్ సూచనలు తప్పనిసరిగా పరిశీలించాలి.

వార్మ్ ఐరన్:

స్వల్పంగా తేమ ఉండి వాసన వస్తున్న కాటన్ బట్టలపై పలుచని కాటన్ వస్త్రాన్ని ఉంచి తక్కువ లేదా తగిన ఉష్ణోగ్రతలో ఐరన్ చేయవచ్చు. వేడి వల్ల మిగిలిన తేమ ఆవిరై బట్టలు త్వరగా ఆరేందుకు సహాయపడుతుంది. సిల్క్ దుస్తులపై నేరుగా అధిక వేడి ఐరన్ చేయకూడదు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

[tds_leads title_text="Subscribe" input_placeholder="Email address" btn_horiz_align="content-horiz-center" pp_checkbox="yes" pp_msg="SSd2ZSUyMHJlYWQlMjBhbmQlMjBhY2NlcHQlMjB0aGUlMjAlM0NhJTIwaHJlZiUzRCUyMiUyMyUyMiUzRVByaXZhY3klMjBQb2xpY3klM0MlMkZhJTNFLg==" f_title_font_family="653" f_title_font_size="eyJhbGwiOiIyNCIsInBvcnRyYWl0IjoiMjAiLCJsYW5kc2NhcGUiOiIyMiJ9" f_title_font_line_height="1" f_title_font_weight="700" f_title_font_spacing="-1" msg_composer="success" display="column" gap="10" input_padd="eyJhbGwiOiIxNXB4IDEwcHgiLCJsYW5kc2NhcGUiOiIxMnB4IDhweCIsInBvcnRyYWl0IjoiMTBweCA2cHgifQ==" input_border="1" btn_text="I want in" btn_tdicon="tdc-font-tdmp tdc-font-tdmp-arrow-right" btn_icon_size="eyJhbGwiOiIxOSIsImxhbmRzY2FwZSI6IjE3IiwicG9ydHJhaXQiOiIxNSJ9" btn_icon_space="eyJhbGwiOiI1IiwicG9ydHJhaXQiOiIzIn0=" btn_radius="3" input_radius="3" f_msg_font_family="653" f_msg_font_size="eyJhbGwiOiIxMyIsInBvcnRyYWl0IjoiMTIifQ==" f_msg_font_weight="600" f_msg_font_line_height="1.4" f_input_font_family="653" f_input_font_size="eyJhbGwiOiIxNCIsImxhbmRzY2FwZSI6IjEzIiwicG9ydHJhaXQiOiIxMiJ9" f_input_font_line_height="1.2" f_btn_font_family="653" f_input_font_weight="500" f_btn_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_btn_font_line_height="1.2" f_btn_font_weight="700" f_pp_font_family="653" f_pp_font_size="eyJhbGwiOiIxMyIsImxhbmRzY2FwZSI6IjEyIiwicG9ydHJhaXQiOiIxMSJ9" f_pp_font_line_height="1.2" pp_check_color="#000000" pp_check_color_a="#ec3535" pp_check_color_a_h="#c11f1f" f_btn_font_transform="uppercase" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjQwIiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGUiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM1IiwiZGlzcGxheSI6IiJ9LCJsYW5kc2NhcGVfbWF4X3dpZHRoIjoxMTQwLCJsYW5kc2NhcGVfbWluX3dpZHRoIjoxMDE5LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" msg_succ_radius="2" btn_bg="#ec3535" btn_bg_h="#c11f1f" title_space="eyJwb3J0cmFpdCI6IjEyIiwibGFuZHNjYXBlIjoiMTQiLCJhbGwiOiIxOCJ9" msg_space="eyJsYW5kc2NhcGUiOiIwIDAgMTJweCJ9" btn_padd="eyJsYW5kc2NhcGUiOiIxMiIsInBvcnRyYWl0IjoiMTBweCJ9" msg_padd="eyJwb3J0cmFpdCI6IjZweCAxMHB4In0="]
spot_imgspot_img

Popular

More like this
Related

Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్‌ సీజన్‌-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్‌, సరస్‌ మేళాకు భారీ ఏర్పాట్లు

Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్‌ నగర కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికతకు...

Work From Home: ఉద్యోగులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి వర్క్ ఫ్రం హోం..

ఢిల్లీలో శీతాకాలంలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు, పరిశుభ్రమైన గాలిని అందించేందుకు ఢిల్లీ...

TGPSC: నిరుద్యోగులకు అలర్ట్.. ఆ ఉద్యోగాల పరీక్షల తేదీలు ఖరారు..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (TGPSC) వివిధ ఉద్యోగాల భర్తీ కోసం...

Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్

Smriti Irani: ఎన్నికల సంఘం, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌, స్పెషల్ ఇంటెన్సివ్...